Jana Nayagan Worldwide Business: జన నాయగన్ వరల్డ్‌వైడ్ బిజినెస్ ఎన్ని కోట్లంటే? విజయ్ మూవీ లాభాల్లోకి రావాలంటే
తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ నటించిన తాజా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జననాయగన్. తెలుగులో భారీ విజయం సాధించిన భగవంత్ కేసరి చిత్ర కథను ఆధారంగా చేసుకొని తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా అనేక మార్పులు, చేర్పులు చేసుకొన్న ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్వకత్వం వహించారు. ఈ సినిమాను కన్నడలో భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే నిర్మించారు.
ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు నటించారు. ఈ సిినమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంత? వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్ కెరీర్‌లో చివరి చిత్రం కావడంతో ఖర్చుకు వెనుకాడకుండా, భారీ తారాగణంతో ఈ సినిమాను నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, అలాగే ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 352.60 కోట్ల రూపాయలతో భారీగా నిర్మించారు. ఈ సినిమాకు వచ్చిన హైప్ వల్ల కూడా భారీగానే బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా మ్యూజిక్, ఆడియో రైట్స్ సుమారుగా 29 కోట్ల రూపాయలు వెచ్చించి టీ సిరీస్ దక్కించుకొన్నది. ఈ సినిమా డిజిటల్ అంటే ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ అమెజాన్ ప్రైమ్ వీడియో కంపెనీ 120 కోట్ల రూపాయల ఆఫర్‌తో సొంతం చేసుకొన్నది. ఈ చిత్రానికి సంబంధించి శాటిలైట్ రైట్స్‌ను జీ టెలివిజన్ సుమారుగా 64 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది అని ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
జగ నాయగన్ సినిమా థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. తమిళనాడులో రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. ఈ తమిళనాడు థియేట్రికల్ రైట్స్ సుమారుగా 105 కోట్ల రూపాయలకు మినిమమ్ గ్యారెంటీ పద్దతిలో అమ్ముడుపోయాయి. కేరళ థియేట్రికల్ రైట్స్ 15 కోట్ల రూపాయలు, తెలుగులో రిలీజ్ చేస్తున్న పీవీఆర్, దిల్ రాజు ఈ సినిమా రైట్స్‌ను 12 కోట్ల రూపాయల మేర దక్కించుకొన్నారు. కర్ణాటకలో ఈ సినిమాను కేవీఆర్ సొంతంగా రిలీజ్ చేస్తున్నది.
ఓవర్సీస్‌లో జన నాయగన్ మూవీకి భారీ రేటు పలికింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను ఫరాస్ ఫిల్మ్స్ దక్కించుకొన్నది. ఈ చిత్రానికి 78 కోట్ల రూపాయల ఫ్యాన్సీ ఆఫర్‌ను ఇచ్చి సొంతం చేసుకొన్నది. దాంతో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ మొత్తంగా 210 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ 213 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 423 కోట్ల రూపాయల మేర క్లోజ్ అయింది. నిర్మాతలు కేవీఎన్ ప్రొడక్షన్‌కు ఈ సినిమా రిలీజ్‌కు ముందే 70 కోట్లకుపైగా లాభాలను తెచ్చిపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











