Jana Nayagan Business: దళపతి విజయ్ సరికొత్త చరిత్ర.. జన నాయగన్ వరల్డ్ వైడ్ బిజినెస్ ఎన్ని కోట్లంటే?
తమిళ సూపర్‌స్టార్, దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ జన నాయగన్. దాదాపు మూడు దశాబ్ధాల పాటు తన నటన, వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు విజయ్. తనను ఇంతటివాడిని చేసిన సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి దిగారు దళపతి. తమిళగ వెట్రి కజగం (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి తమిళ రాజకీయాల్లో సంచలనం రేపారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు గ్రౌండ్ లెవల్‌లో కసరత్తు చేస్తున్నారు.
విజయ్ చివరి చిత్రంగా జన నాయగన్
ఈ నేపథ్యంలో విజయ్ చివరి చిత్రంగా జన నాయగన్ నిలిచింది. మలేషియాలో జరిగిన ఈ మూవీ ఆడియో లాంచ్ వేడుకలో ప్రజల కోసం సినిమాలకు రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నానని, మరో 30 ఏళ్లు ప్రజాసేవలో నిలబడతానని ప్రకటించారు దళపతి విజయ్. ఈ నేపథ్యంలో జన నాయగన్‌పై తమిళనాడుతో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో జన నాయగన్‌కు రికార్డ్ స్థాయిలో థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

జనవరి 9న జన నాయగన్
జన నాయగన్ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. మమితా బైజు, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, రెబా మోనికా జాన్, సునీల్, మోనిషా బ్లెస్సీ, నిళగల్ రవి, రేవతి, శ్రీకాంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కేలు జన నాయగన్ మూవీని దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా, ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్, అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న జన నాయగన్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
జన నాయగన్‌పై భారీ అంచనాలు
మామూలుగానే తమిళనాట దళపతి విజయ్ సినిమాలపై భారీ అంచనాలు ఉంటాయి. అలాంటిది తన నట జీవితంలోనే చివరి సినిమా అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవడం కూడా కష్టమే. దీనికి తగినట్లుగానే జన నాయగన్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బడా కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఆడియో, డిజిటల్, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్‌కు కళ్లు చెదిరే స్థాయిలో బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
జన నాయగన్ నాన్ థియేట్రికల్ బిజినెస్
జన నాయగన్ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దాదాపు 121 కోట్ల రూపాయలకు దక్కించుకోగా.. ఆడియో రైట్స్‌ను టీ సిరీస్ సంస్థ 35 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. ఇక శాటిలైట్ రైట్స్‌తో కలిపి ఈ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ 200 కోట్ల రూపాయల వరకు జరిగినట్లుగా తెలుస్తోంది.
జన నాయగన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఇక జన నాయగన్ థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే... తమిళనాడు థియేట్రికల్ రైట్స్ 100 కోట్ల రూపాయలు, మలయాళం థియేట్రికల్ రైట్స్ 15 కోట్ల రూపాయలు, తెలుగు థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల రూపాయలు, హిందీ థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 80 మేర బిజినెస్ చేయగా.. కర్ణాటకలో కేవీఎన్ ప్రొడక్షన్స్ సొంతం రిలీజ్ చేసుకుంటోంది. తద్వారా థియేట్రికల్ బిజినెస్ కింద జన నాయగన్‌కు 200 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. ఈ భారీ డీల్స్ కారణంగా దళపతి విజయ్ ఎదుట భారీ టార్గెట్ వచ్చింది. జన నాయగన్ మూవీ లాభాల్లోకి రావాలంటే 450 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్, 220 కోట్ల కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ రాబట్టాల్సి ఉంది. అయితే జన నాయగన్‌పై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ టార్గెట్‌ను విజయ్ అవలీలగా కొట్టేస్తాడని దళపతి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











