Mr & Mrs Mahi Collections హాఫ్ సెంచరీ కొట్టిన జాన్వీ కపూర్.. మిస్టర్ అండ్ మిసెస్ మహికి లాభమా? నష్టమా?

బాలీవుడ్ యువ హీరో, హీరోయిన్లు జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావ్ జంటగా నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా కలెక్షన్లు సాధిస్తున్నది. క్రికెట్ బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితులను ఎదురించి బ్రేక్ ఈవెన్‌కు ఈ చిత్రం చేరువైంది. ఈ సినిమా 7 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

దేశంలో సార్వత్రిక ఎన్నికలు, ఐపీఎల్, టీ20 క్రికెట్ టోర్నమెంట్స్ మధ్య మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇలాంటి అంశాలను ఎదుర్కొని బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా వసూళ్లను సాధించింది. జాన్వీ కపూర్ బాక్సాఫీస్ స్టామినాను ఈ మూవీ తెలియజెప్పింది.

Janhvi Kapoor Mr and Mrs Mahi crossed 50 crores milestone at Global Box Office Collections

ఇక జాన్వీ కపూర్ నటించిన ఈ సినిమాను సుమారుగా 50 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాను జీ స్టూడియో, బోనికపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సిన టార్గెట్ ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

భారీ లక్ష్యంతో బాక్సాఫీస్ బరిలో దూకిన ఈ చిత్రం తొలివారం నిలకడగా వసూళ్లను సాధించింది. తొలి మూడు రోజుల్లోనే ఈ చిత్రం సుమారుగా 17 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలివారం ముగిసే సమయానికి ఈ చిత్రం 25 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత కూడా నిలకడగా వసూళ్లను రాబడుతున్నది.

Janhvi Kapoor Mr and Mrs Mahi crossed 50 crores milestone at Global Box Office Collections

మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రం రెండోవారంలో కూడా భారీగా వసూళ్లు సాధించింది. గత 6 రోజుల్లో ఈ సినిమా 7 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో గత 13 రోజుల్లో 33 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ఇంకా నిలకడగానే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ సినిమా గత 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఇండియాలో 33 కోట్లు నికరంగా, 40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం ఓవర్సీస్‌లో 8.5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. దాంతో ఈ చిత్రం 48.5 కోట్ల రూపాయలు కలెక్షన్లను నమోదు చేసింది. దాంతో ఈ మూవీ 50 కోట్లకు చేరువైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X