బాక్సాఫీస్ వద్ద జాన్వీ కపూర్ తడబాటు.. 25 శాతం క్షీణించిన రూహీ కలెక్షన్లు
లాక్‌డౌన్ తర్వాత థియేటర్లో రిలీజైన బాలీవుడ్ చిత్రం రూహీ. బాలీవుడ్ తారలు జాన్వీ కపూర్, రాజ్‌కుమార్ రావు, వరుణ్ శర్మ నటించిన రూహీ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే లాక్‌డౌన్ తర్వాత భారీ చిత్రం కావడంతో తొలి రోజు ఓ మోస్తారు కలెక్షన్లను రాబట్టింది.
బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం తొలి రోజున రూ.3.06 కోట్లు వసూలు చేసింది. ఇక రెండో రోజు శుక్రవారం అదే ఊపును కొనసాగించలేకపోయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రెండో రోజు వర్కింగ్ డే కావడంతో దాదాపు 25 శాతం మేరకు కలెక్షన్ల పడిపోయాయి అని ట్రేడ్ అనలిస్టు తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు.

రూహీ సినిమా కలెక్షన్ల గురించి తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేస్తూ.. ఉత్తరాదిన కొన్ని ప్రాంతాల్లో సెలవు దినం లేదు. దాంతో రూహీ కలెక్షన్లు భారీగా క్షీణించాయి. తొలి రోజున 3.06 కోట్లు వసూలు చేస్తే.. రెండో రోజున రూ.2.25 కోట్లు రాబట్టింది. మొత్తంగా ఈ చిత్రం రూ.5.31 కోట్లు నమోదు చేసింది అని అన్నారు.
అయితే కామెడీ ప్రధానంగా తెరకెక్కిన రూహీ చిత్రంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. లాక్‌డౌన్ తర్వాత ఎక్కువ మంది ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో సఫలమైంది అంటూ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావు నటనకు మంచి మార్కులే పడ్డాయి.


Click it and Unblock the Notifications











