Ulajh Collections: షాకింగ్‌గా జాన్వీ కపూర్ మూవీ కలెక్షన్లు.. 20 కోట్ల బడ్జెట్.. లాభాల్లోకి రావాలంటే?

బాలీవుడ్ చిత్రం ఉలజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. జాన్వీ కపూర్, రోషన్ మ్యాథ్యూ, గుల్షన్ దేవయ్య నటించిన ఈ సినిమా ఆగస్టు 2వ తేదీన రిలీజైంది. అయితే స్పై థ్రిల్లర్‌గా రూపొందిన సినిమాఈ సినిమాకు సుంధాషు సారియా దర్శకత్వం వహించగా.. జంగ్లీ బ్యానర్‌పై వినీత్ జైన్ నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

దేశభక్తుల కుటుంబానికి చెందిన ఓ యువతి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టి.. తాను చేసే ఉద్యోగంలో ఎదుర్కొన్న సవాళ్ల నేపథ్యంగా ఈ సినిమా రూపొందిందవి. ఈ చిత్రాన్ని భారీ తారాగణం, యంగ్ టెక్నిషియన్స్ కలయికతో రూపొందించారు. సుమారుగా ఈ సినిమాను 50 కోట్ల రూపాయలతో నిర్మించారు.

Janhvi Kapoor s Ulajh Box Office Collections Worldwide

జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల అటెన్షన్‌ను అందుకొన్నది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీగా జరగడం వాటికి నార్త్‌లో మంచి బజ్ క్రియేట్ కావడంతో ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని సుమారుగా 2500 స్క్రీన్లలో రిలీజ్ చేయడం గమనార్హం.

అయితే ఉలజ్ చిత్రం బాక్సాఫీస్‌ను ప్రభావితం చేయలేకపోయింది. జాన్వీ కపూర్ కూడా తన గ్లామర్, ఫెర్ఫార్మెన్స్‌తో మెప్పించలేకపోయిందనే టాక్ తొలి ఆట తర్వాత వచ్చింది. దాంతో ఈ సినిమా కలెక్షన్లు పుంజుకోలేకపోతున్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Janhvi Kapoor s Ulajh Box Office Collections Worldwide

జైపూర్, లక్నో, చెన్నై, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో తప్పా పెద్దగా ఆక్యుపెన్సీ నమోదు కాలేదు. దాంతో ఈ సినిమా దేశవ్యాప్తంగా తొలి రోజు కేవలం 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసిందని స్వయంగా నిర్మాత వెల్లడించారు. అయితే ఈ సినిమా ఈ విధంగా కలెక్షన్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమే అని పెదవి విరుస్తున్నారు.

ఉలజ్ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం ఈ చిత్రం 25 కోట్ల షేర్, 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: ulajh janhvi kapoor box office
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X