Japan Collections 2500 స్క్రీన్లలో జపాన్ మూవీ.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే? లాభాల్లోకి రావాలంటే?

తమిళనాడులో సంచలనం రేపిన దొంగ జపాన్ అనే వ్యక్తి కథతో తెరకెక్కించిన జపాన్ మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందు కార్తీ చేసిన ప్రమోషన్స్‌కు మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రమోషన్స్‌లో భాగంగా వచ్చిన టైలర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. అను ఇమ్యాన్యుయేల్, సునీల్ తదితరులు నటించిన ఈ సినిమా నవంబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఓవరాల్‌గా జపాన్ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

జపాన్ సినిమా విషయానికి వస్తే.. యాక్టర్ల పారితోషికం, ప్రమోషన్స్ ఖర్చులన్నీ కలుపుకొంటే ఈ సినిమా నిర్మాణ వ్యయం భారీగానే అయింది. ఈ సినిమా మొత్తం బడ్జెట్‌ను 80 కోట్లకుపైగానే అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక సినిమాకు వచ్చిన క్రేజ్ కారణంగా థియేట్రికల్ బిజినెస్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 42 కోట్లుగా జరిగింది.తెలుగు రాష్ట్రాల హక్కులు 6 కోట్ల మేరకు జరిగిందని సినీ వర్గాలు వెల్లడించాయి.

Japan Movie Day 1 Expected Collections Worldwide: Will Karthi movie breach break Even at box office?

కార్తీ తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రలో కనిపించడంతో జపాన్‌ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. దాంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో స్క్రీనింగ్ చేశారు. తమిళనాడులో సుమారుగా 1200 స్క్రీన్లు, నైజాం, ఆంధ్రాలో 400 స్క్రీన్లు, కేరళ, కర్ణాటకలో 400 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను దాదాపు 2500 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

జపాన్ సినిమా థియేటర్లోకి వచ్చిన నేపథ్యంలో ఓ మోస్తారు ఆక్యుపెన్సీ కనిపించింది. తమిళనాడులో ఓవరాల్‌గా 30 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. త్రిచీలో 42 శాతం, పాండిచ్చేరిలో 50 శాతం, చెన్నైలో 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక తమిళంలో కంటే తెలుగులోను బెటర్ ఆక్యుపెన్సీ కనిపించింది. తెలుగులో 35 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా, వరంగల్, గుంటూరులో 40 శాతం, కాకినాడలో 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

Japan Movie Day 1 Expected Collections Worldwide: Will Karthi movie breach break Even at box office?

జపాన్ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. ఈ సినిమా ఓపెనింగ్స్ గ్రాండ్‌గా ప్రారంభమయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే 1.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో 100K డాలర్లు వసూలు చేసింది. తొలి రోజు తమిళనాడులో 7 నుంచి 8 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 15 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

జపాన్ మూవీ సినిమా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే..42 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 42 కోట్ల షేర్, 80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. రానున్న రోజుల్లో ఈ సినిమా ఏ రేంజ్ వసూళ్లు రాబడుతుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X