Jatadhara Day 1 Collections: జటాధార షాకింగ్ కలెక్షన్స్.. సుధీర్ బాబు మూవీ తొలిరోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?

Jatadhara Collections: టాలీవుడ్ యాక్షన్ హీరో సుధీర్ బాబు, హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ తనదైన మార్గంలో ముందుకు సాగుతున్నాడు. ఇటీవల ఆయన నటించిన 'జటాధర' అనే హరర్ థ్రిల్లర్ నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తెలుగు ప్రేక్షకుల ముందుకు మొదటిసారిగా వచ్చిందన్న కారణంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్, ధన పిశాచి, తాంత్రిక శక్తులు, పురాణ గాధలు వంటి అంశాలతో తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో జటాధార మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

జటాధర కథ, నేపథ్యం
'జటాధర' సినిమా పేరెంట్స్ సెంటిమెంట్‌తో పాటు హరర్ ఫ్యాంటసీ జానర్‌ను మిళితం చేస్తూ తెరకెక్కింది. తాంత్రిక విద్య, ధన పిశాచి, శాపం, గుప్త నిధులు వంటి ఆసక్తికర అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. కథలో ప్రధానంగా ఓ కుటుంబం గత జన్మలో చేసిన పాపం కారణంగా ఈ జన్మలో ఎదుర్కొనే శాపం, ఆ శాపం నుంచి బయటపడటానికి హీరో చేసే త్యాగం చుట్టూ కథ తిరుగుతుంది. దర్శకులు వెంకట్ కల్యాణ్ , అభిషేక్ జైస్వాల్ హరర్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాలని ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం పూర్తి స్థాయిలో సఫలీకృతం కాలేదు. ఈ మూవీలో సుధీర్ బాబు ఒక ఆర్కియాలజిస్ట్‌గా, ధన పిశాచిని వెతికే వ్యక్తిగా కనిపిస్తాడు. మరోవైపు సోనాక్షి సిన్హా ధన పిశాచినిగా నటించారు. ఆమె పాత్రకు మైథలాజికల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేసినా, పాత్ర బలహీనంగా ఉండటంతో ప్రేక్షకులను ఆట్రాక్ట్ చేయలేకపోయింది.

Jatadhara Day 1 expected Box office Collections World wide Sudheer Babu Horror Thriller Opens Low

ఈ చిత్రాన్ని జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్ కేఆర్ బన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మించారు. దర్శకులు వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్‌లు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించగా, శిల్పా శిరోద్కర్, దివ్య ఖోస్లా కుమార్, శ్రేయా శర్మ, ఇందిరా కృష్ణన్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ, రవి ప్రకాష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హార్రర్ మూవీకి రాజీవ్ రాజ్ సంగీతం అందించగా, సినిమాటోగ్రఫీని సమీర్ కళ్యాణి, ఆర్ట్ డైరెక్షన్‌ను సంధ్య శర్మ నిర్వహించారు.

ప్రీ-రిలీజ్ బిజినెస్
'జటాధర' టీజర్, ట్రైలర్ రిలీజ్‌ సమయంలోనే సినిమాపై హైప్ క్రియేట్ అయింది. సుధీర్ బాబు యాక్షన్ హీరోగా, సోనాక్షి సిన్హా బాలీవుడ్ స్టార్‌గా పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకర్షిస్తారన్న నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ. 6 కోట్ల వరకు జరిగినట్లు చెబుతున్నారు. పాన్ ఇండియా రిలీజ్ కావడంతో హిందీ మార్కెట్, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కలిపి సినిమా మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 15 కోట్ల వరకు వెళ్లిందని అంచనా. అయితే సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం రూ. 8 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టాల్సి ఉంది.

సినిమాపై తొలి స్పందన
సినిమా విడుదలైన తర్వాత మొదటి షో నుంచే మిశ్రమ స్పందన వస్తోంది. కథలో కొత్తదనం ఉన్నప్పటికీ, స్క్రీన్‌ప్లేలో పటుత్వం లేకపోవడం, సస్పెన్స్ లేకుండా స్టోరీ లైన్ ఉండటం ప్రేక్షకులను విసిగించింది. తాంత్రిక ఎలిమెంట్స్, విజువల్ ఎఫెక్ట్స్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. సుధీర్ బాబు తన వంతు కృషి చేశాడు. పాత్రలో లీనమయ్యాడు. కానీ బలమైన కథా బలం లేకపోవడంతో ఆయన నటన కూడా రిజల్ట్ ఇవ్వలేదు. సోనాక్షి సిన్హా పాత్రకు బలం లేకపోవడం ఆమె పాత్రను పెద్దగా గుర్తుంచుకోలేని విధంగా చేసింది. శిల్పా శిరోద్కర్, రాజీవ్ కనకాల పాత్రలకు సరైన ప్రాధాన్యత లేదు.

ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్
భారీ అంచనాలతో విడుదలైన 'జటాధర' మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం సినిమా ఫస్ట్ డే అన్ని భాషల్లో కలిపి సుమారు రూ 1 కోటి వరకు (ఇండియా నెట్) వసూలు చేసే అవకాశముంది. తెలుగు రాష్ట్రాల్లో సగటు ఆక్యుపెన్సీ 18 శాతం నుంచి 20 శాతం మధ్యలో ఉండగా, హిందీ మార్కెట్‌లో స్పందన చాలా తక్కువగా ఉంది. సినిమాకు వచ్చిన వర్డ్ ఆఫ్ మౌత్ మిశ్రమంగా ఉండటంతో సెకండ్ డే కలెక్షన్లు కూడా పెద్దగా పెరగే అవకాశం లేదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

ట్రేడ్ వర్గాల ప్రకారం, 'జటాధర' సినిమాకు మంచి థీమ్ ఉన్నప్పటికీ, అమలులో తడబడటం వల్ల ఫలితాన్ని కోల్పోయింది. కథ బలహీనంగా ఉండడం వల్ల సుధీర్ బాబు ఇమేజ్, సోనాక్షి సిన్హా క్రేజ్ కూడా బాక్సాఫీస్ రిజల్ట్ మార్చలేకపోయాయి. సినిమా కంటెంట్‌కు అనుగుణంగా ప్రమోషన్ స్ట్రాటజీ సరిగా లేకపోవడం కూడా మరో లోటుగా కనిపిస్తోంది. వీకెండ్‌లో పాజిటివ్ టాక్ రాకపోతే సినిమా రికవరీ సాధ్యమే కాదని ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి. వీకెండ్ కలెక్షన్లు కూడా ఆశించిన స్థాయిలో రాకపోతే సినిమా త్వరలోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X