Jatadhara Day 3 Collections: బాక్సాఫీస్ వద్ద జటాధార ఘోరంగా.. సుధీర్ బాబు మూవీ కలెక్షన్ల పరిస్థితి ఏమిటంటే?

Jatadhara Collections: టాలీవుడ్ యాక్షన్ హీరో సుధీర్ బాబు ఎప్పటిలాగే ఈసారి కూడా విభిన్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన తాజా చిత్రం 'జటాధర (Jatadhara)' నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఆసక్తిని రేకెత్తించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తొలిసారి తెలుగు సినిమాలో నటించడం వల్ల సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే, విడుదలైన తర్వాత సినిమా మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో జటాధార మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 3 వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

'జటాధర' కథ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ జానర్‌లో సాగుతుంది. ధన పిశాచి, ఆధ్యాత్మిక శక్తులు, తాంత్రిక సాధన, పురాణ గాధలు వంటి అంశాలను కలిపి ఒక విభిన్నమైన వాతావరణాన్ని దర్శకులు వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ సృష్టించారు. హారర్, మిస్టరీ, స్పిరిచువల్ ఎలిమెంట్స్ ఉన్నా ఈ సినిమా విజువల్‌గా ఆకట్టుకున్నా, కథనం కొంత బలహీనంగా ఉందన్న అభిప్రాయం ప్రేక్షకులలో ఉంది. సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి అందించిన విజువల్స్ సినిమా యొక్క హారర్ టోన్‌ను స్ట్రాంగ్ గా నిలబెట్టాయి. రాజీవ్ రాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాల్లో థ్రిల్లింగ్ ఫీల్ ఇచ్చినా, మొత్తం సినిమా మీద పూర్తి ఇంపాక్ట్ చూపించలేకపోయింది.

Jatadhara Day 3 expected Box office Collections World wide Sudheer Babu Horror Thriller Collection Slow Growth

ఇక సినిమాలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హాలతో పాటు శిల్పా శిరోద్కర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ, శుభలేఖ సుధాకర్, రవి ప్రకాష్ తదితరులు నటించారు. కానీ వారికి సరైన స్క్రీన్ టైమ్ దక్కలేదని అభిమానులు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేశ్ కేఆర్ బన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మించారు. హారర్ సినిమాలకు భారత మార్కెట్‌లో ఎప్పుడూ డిమాండ్ ఉన్నప్పటికీ, ఈ సినిమా కంటెంట్ యావరేజ్ గా ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

'జటాధర' టీజర్‌, ట్రైలర్‌ విడుదల సమయంలోనే మంచి హైప్ క్రియేట్ అయింది. సుధీర్ బాబు యాక్షన్ ఇమేజ్‌, సోనాక్షి సింహా బాలీవుడ్ క్రేజ్‌ రెండూ కలిపి పాన్‌ ఇండియా స్థాయిలో బజ్‌ను పెంచాయి. అందుకే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ట్రేడ్ రిపోర్టుల ప్రకారం, ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.6 కోట్ల బిజినెస్ చేసింది. పాన్‌ ఇండియా మార్కెట్, ఓటీటీ, శాటిలైట్‌ హక్కులు కలిపి మొత్తంగా దాదాపు రూ.15 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. అయితే, ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ పాయింట్ రూ.8 కోట్ల గ్రాస్ గా అంచనా వేయబడింది.

షాకింగ్ కలెక్షన్స్
ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. 'జటాధర (Jatadhara)' సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి రోజు డిజాస్టర్ కలెక్షన్స్ నమోదు చేసింది. తొలి రోజు 'జటాధర' ఇండియా నెట్ కలెక్షన్ రూ. 1.07 కోట్లు కాగా, అందులో తెలుగు వెర్షన్ రూ. 0.85 కోట్లు, హిందీ వెర్షన్ రూ. 0.22 కోట్లు వసూలు చేసింది. ఇక రెండో రోజు (శనివారం) కలెక్షన్లు అదే తీరులో ఉన్నాయి. ఇక రెండో రోజు రూ.1.07 కోట్లు వసూలు చేసింది. దీంతో రెండు రోజుల్లో మొత్తం కలెక్షన్ రూ.2.14 కోట్లకు చేరింది.

ఇక మూడవ రోజు (Day 3) అంచనాల ప్రకారం, తెలుగు వెర్షన్‌లో ఈ సినిమాకి 18.92 శాతం ఆక్యుపెన్సీ, హిందీ వెర్షన్‌లో 9.68 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై కాస్త పాజిటివ్ టాక్ క్రియేట్ అయినట్టు తెలుస్తోంది. ఉదయం షోలలో 12.21 శాతం ఆక్యుపెన్సీ ఉండగా, మధ్యాహ్నం షో 17.42 శాతం వరకు పెరిగింది. ఇక ఫస్ట్, సెకండ్ షోలకు ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద, మూడవ రోజున ఈ సినిమా సుమారు రూ. 1 కోటి వరకూ వసూళ్లు సాధించే అవకాశముందని అంచనా. దీంతో ఇప్పటివరకు మొత్తం కలెక్షన్ రూ.3.5 కోట్లకు చేరుకోకున్నది.

రోజురోజుకు సినిమాపై మౌత్ టాక్ మారుతున్నట్టు తెలుస్తోంది. సినిమా కథ, నేపథ్యం, విజువల్స్, సుధీర్ బాబు యాక్షన్, సోనాక్షి సింహా గ్లామర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. క్రిటిక్స్ కూడా సినిమాకు "వివిధమైన కాన్సెప్ట్, బలమైన ప్రదర్శన" అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి, 'జటాధర' సినిమా బాక్సాఫీస్ వద్ద స్ధిరమైన కలెక్షన్స్ అందుకుంటుంది. దీంతో ఈ వీకెండ్‌లో వసూళ్లు మరింత పెరగవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.మొత్తానికి, 'జటాధర' సుధీర్ బాబు కెరీర్‌లో ఒక డిఫరెంట్ ఎఫర్ట్‌గా నిలిచినా, కలెక్షన్ పరంగా మాత్రం సాధారణ స్థాయిలోనే ఆగిపోయినట్లు కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X