Jatadhara Day 4 Collections: జటాధార డిజాస్టర్ కలెక్షన్స్.. సుధీర్ బాబు మూవీకి 4వ రోజు ఎన్ని కోట్లంటే?
Jatadhara Collections: టాలీవుడ్ యాక్షన్ హీరో సుధీర్ బాబు డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అలా ఆయన తాజా చిత్రం 'జటాధర (Jatadhara)' తో నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తొలిసారి తెలుగు సినిమాలో నటించడం సినిమాపై మరింత హైప్ తెచ్చింది. అయితే విడుదల అనంతరం సినిమా మిశ్రమ స్పందనను అందుకుంది. ఈ నేపథ్యంలో జటాధార మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 4 వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో హారర్, మిస్టరీ, ఆధ్యాత్మిక అంశాలు మిళితమై ఉన్నాయి. దర్శకులు వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ కథను విభిన్నంగా చూపించే ప్రయత్నం చేశారు. విజువల్‌గా సినిమా ఆకట్టుకున్నా, కథనం బలహీనంగా ఉండడంతో ప్రేక్షకులు పూర్తిగా కనెక్ట్ కాలేకపోయారు. సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి అందించిన విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలం చేకూర్చినా, స్క్రీన్‌ప్లే స్లోగా సాగిందన్న విమర్శలు వచ్చాయి.

సుధీర్ బాబు యాక్షన్ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. సోనాక్షి సిన్హా గ్లామర్, ప్రెజెన్స్ బాగున్నా ఆమెకు తగిన స్క్రీన్ టైమ్ లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. ఇతర పాత్రలు చేసిన శిల్పా శిరోద్కర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ, శుభలేఖ సుధాకర్ పాత్రలు పరిమిత స్థాయిలోనే నిలిచాయి. ఇక ట్రేడ్ రిపోర్టుల ప్రకారం.. సినిమా తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.6 కోట్ల బిజినెస్ చేసింది. ఓటీటీ, శాటిలైట్ హక్కులు కలిపి మొత్తం రూ.15 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. కానీ సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ అయిన రూ.8 కోట్ల గ్రాస్ చేరుకోవాలి.
'జటాధర (Jatadhara)' సినిమా భారీ అంచనాలతో విడుదలైన బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. విడుదలైన ఫస్ట్ వీకెండ్ లో కూడా వసూళ్లు చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. మొదట రోజు నుండి ఊహించినంత రన్ ఇవ్వకపోవడంతో ట్రేడ్ వర్గాలు కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. శుక్రవారం విడుదలైన 'జటాధర' తొలి రోజు ఇండియా నెట్ కలెక్షన్ రూ. 1.07 కోట్లు వసూలు చేసింది. అందులో తెలుగు వెర్షన్ రూ. 0.85 కోట్లు, హిందీ వెర్షన్ రూ. 0.22 కోట్లు కలెక్ట్ చేసింది. రెండో రోజు (శనివారం) కూడా అదే స్థాయిలో కొనసాగి మరో రూ. 1.07 కోట్లు రాబట్టింది. మూడో రోజు (ఆదివారం) కొంత పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు కాస్త పెరిగి రూ. 1.17 కోట్లకు చేరాయి. దీంతో మూడు రోజుల కలిపి మొత్తం వసూళ్లు సుమారు రూ.3.31 కోట్లకు చేరుకున్నాయి.
మూడవ రోజు ఆదివారం తెలుగు వెర్షన్‌కు 18.92% ఆక్యుపెన్సీ నమోదవ్వగా, హిందీ వెర్షన్‌కు 9.68% ఆక్యుపెన్సీ వచ్చింది. ఉదయం షోలలో 12.21% ఉండగా, మధ్యాహ్నం షోలలో 17.42% వరకు పెరిగింది. సాయంత్రం, రాత్రి షోలలో కాస్త మెరుగుదల కనిపించినప్పటికీ, సోమవారం (Day 4) రోజు మాత్రం ఆక్యుపెన్సీ చాలా తగ్గిపోయింది.దీంతో ఈ సినిమా కలెక్షన్లు ఘోరంగా పడిపోయాయి.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, నాలుగో రోజు జటాధర మూవీ రూ. 0.40 లక్షల నుంచి రూ. 0.5 లక్షల వరకు మాత్రమే వసూలు చేసే అవకాశముందనీ అంచనా. దీని వలన నాలుగు రోజుల కలిపి మొత్తం వసూళ్లు రూ.3.80 కోట్ల వరకూ చేరుకునే అవకాశముందని అంచనా. ఇదిలాఉంటే.. విడుదలైన మూడు రోజుల్లోనే సినిమా రూ.4.62 కోట్ల వసూళ్లు సాధించిందని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు.
సినిమా కథ, నేపథ్యం, విజువల్ ప్రెజెంటేషన్, సుధీర్ బాబు యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయానే చెప్పాలి. దీంతో కలెక్షన్ పరంగా సినిమా పెద్ద స్థాయిలో రాణించలేదు. సోనాక్షి సిన్హా గ్లామర్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కాన్సెప్ట్‌ను ప్రశంసించినా, స్క్రీన్‌ప్లే స్లోగా ఉందనే విమర్శలు ఉన్నాయి. అయితే, డిఫరెంట్ కాన్సెప్ట్, సుధీర్ బాబు యాక్టింగ్ కొత్తగా ఉందంటూ క్రిటిక్స్ కామెంట్స్ చేశారు.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, మౌత్ టాక్ కాస్త మెరుగుపడితే రెండో వారం వసూళ్లు కొంత పుంజుకునే అవకాశం ఉంది. కానీ ప్రస్తుత ట్రెండ్ ప్రకారం 'జటాధర' కలెక్షన్లు "స్టేబుల్ బట్ స్లో" కేటగిరీలోనే ఉన్నాయి. దీని బట్టి చూస్తే.. ఈ సినిమా రెండో వీకెండ్ ముగిసే సరికి రూ. 5 కోట్ల దాకా అయినా వసులు చేస్తుందా? అనే సందేహం కూడా వ్యక్తమవుతుంది.


Click it and Unblock the Notifications











