Jatadhara Day 5 Collections: పడిపోయిన జటాధర కలెక్షన్స్.. బ్రేక్‌ఈవెన్‌ కావాలంటే ఇంకా ఎన్ని కోట్లు రావాలి?

Jatadhara Collections: టాలీవుడ్ యాక్షన్ హీరో సుధీర్ బాబు ప్రతి సినిమాలో కొత్త కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు. తాజాగా ఆయన నటించిన 'జటాధర (Jatadhara)' సినిమా నవంబర్ 7న విడుదలైంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తొలిసారి తెలుగు తెరపై కనిపించడం సినిమాకు భారీ హైప్ తీసుకువచ్చింది. అయితే విడుదల అనంతరం సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో జటాధార మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 5 వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

'జటాధర'ను సూపర్‌నేచురల్ త్రిల్లర్ గా తెరకెక్కించారు. హారర్‌, మిస్టరీ, ఆధ్యాత్మిక అంశాలను కలిపి దర్శకులు వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ కథను విభిన్నంగా చూపించే ప్రయత్నం చేశారు. విజువల్స్, సెట్ డిజైన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా, కథనం స్లోగా సాగడం, ఎమోషనల్ కనెక్షన్‌ లేకపోవడం వల్ల సినిమాకు పూర్తి స్థాయి ఇంపాక్ట్ రాలేదన్న విమర్శలు వచ్చాయి. సుధీర్ బాబు తన పాత్రలో మరోసారి తన ఫిజికల్ ఫిట్నెస్, యాక్షన్ సీన్స్తో ఆకట్టుకున్నాడు. సోనాక్షి సిన్హా గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నా, ఆమెకు తగిన స్క్రీన్ టైమ్ లేకపోవడం ఫ్యాన్స్‌కి కొంత నిరాశ కలిగించింది.

Jatadhara Day 5 expected Box office Collections World wide

ఇతర నటీనటుల్లో శిల్పా శిరోద్కర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ, శుభలేఖ సుధాకర్ తమ పాత్రలలో సహజంగా నటించారు, కానీ వారి పాత్రలు పరిమితంగానే ఉన్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రేడ్ రిపోర్టుల ప్రకారం, సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 6 కోట్ల వరకూ బిజినెస్ చేసింది. ప్రీ-రిలీజ్ దశలోనే ఓటీటీ, శాటిలైట్ హక్కులు కలిపి మొత్తం రూ. 15 కోట్ల డీల్ క్లోజ్‌ అయినట్లు సమాచారం. అయితే సినిమా బ్రేక్‌ఈవెన్ పాయింట్‌ అయిన రూ. 8 కోట్ల గ్రాస్ చేరుకోవాలి. ప్రస్తుతం ఈ టార్గెట్ దిశగా సినిమా మోస్తరు స్థాయిలోనే కొనసాగుతోంది.

'జటాధర (Jatadhara)' సినిమా భారీ అంచనాలతో విడుదలైన బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూప లేకపోతుంది. విడుదలైన ఫస్ట్ వీకెండ్ లో కూడా వసూళ్లు చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. మొదట రోజు నుండి ఊహించినంత రన్ ఇవ్వకపోవడంతో ట్రేడ్ వర్గాలు కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. శుక్రవారం విడుదలైన 'జటాధర' తొలి రోజు ఇండియా నెట్ కలెక్షన్ రూ. 1.07 కోట్లు వసూలు చేసింది. అందులో తెలుగు వెర్షన్ రూ. 0.85 కోట్లు, హిందీ వెర్షన్ రూ. 0.22 కోట్లు కలెక్ట్ చేసింది.

రెండో రోజు (శనివారం) కూడా అదే స్థాయిలో కొనసాగి మరో రూ. 1.07 కోట్లు రాబట్టింది. మూడో రోజు (ఆదివారం)రూ. 1.17 కోట్లకు చేరాయి. అయితే, నాలుగో రోజు వర్కింగ్ డే కావడంతో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. నేషనల్ వైడ్ గా కేవలం 42 లక్షలు మాత్రమే వసూళ్లు చేసింది. దీంతో నాలుగు రోజులకు కలిపి మొత్తం వసూళ్లు సుమారు రూ.3.81 కోట్లకు చేరుకున్నాయి.

ఇక ఐదో రోజు (మంగళవారం) కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఉదయం షోలలో 13.21% ఉండగా, మధ్యాహ్నం షోలలో 15.42% వరకు పెరిగింది. సాయంత్రం, రాత్రి షోలలో కాస్త మెరుగుదల కనిపించినప్పటికీ, మంగళవారం (Day 5) రోజు మాత్రం ఆక్యుపెన్సీ చాలా పడిపోయిందనే చెప్పాలి. దీంతో ఈ సినిమా కలెక్షన్లు ఘోరంగా పడిపోయాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఐదో రోజు జటాధర మూవీ రూ. 0.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు మాత్రమే వసూలు చేసే అవకాశముందనీ అంచనా. ఈ లెక్కన చూస్తే.. 5 రోజుల మొత్తం వసూళ్లు రూ.4 కోట్లకు చేరువ అయ్యే అవకాశం ఉంది. ఇదిలాఉంటే.. విడుదలైన 4 రోజుల్లోనే సినిమా రూ.5.30 కోట్ల వసూళ్లు సాధించిందని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు.

'జటాధర' సినిమా కథ, కథనం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. సోనాక్షి సిన్హా గ్లామర్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, కాన్సెప్ట్‌ మెచ్చుకున్నా, స్క్రీన్‌ప్లే స్లోగా ఉండటం సినిమాకి మైనస్‌గా మారింది. అయితే సుధీర్ బాబు నటన, కొత్త కాన్సెప్ట్‌పై క్రిటిక్స్‌ పాజిటివ్ కామెంట్స్ చేశారు. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, మౌత్‌టాక్ మెరుగుపడితే రెండో వారం వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 'జటాధర' కలెక్షన్లు క్రమంగా పడిపోతున్నాయి.ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కలెక్షన్లు పెరగడం కష్టమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X