Jatadhara Day 6 Collections: బాక్సాఫీస్ వద్ద ‘జటాధర' పరిస్థితేంటీ? 6వ రోజు కలెక్షన్స్ ఎంత?
Jatadhara Collections: టాలీవుడ్ యాక్షన్ హీరో సుధీర్ బాబు తాజాగా నటించిన 'జటాధర (Jatadhara)' నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తొలిసారిగా తెలుగు తెరపై కనిపించడం సినిమాకు భారీ క్రేజ్ తెచ్చింది. అయితే విడుదల తర్వాత సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో జటాధార మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 6 వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
'జటాధర'ను సూపర్ నేచురల్ త్రిల్లర్ గా తెరకెక్కించారు. హారర్,మిస్టరీ, ఆధ్యాత్మికత అంశాలను కలిపి దర్శకులు వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ విభిన్నమైన ప్రయత్నం చేశారు. సినిమాకు ఉన్న విజువల్స్, సెట్ డిజైన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టెక్నికల్‌గా మెప్పించాయి. అయితే కథనం నెమ్మదిగా సాగడం, ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం వల్ల ప్రేక్షకులపై పూర్తి ఇంపాక్ట్ చూపలేకపోయింది. సుధీర్ బాబు తన పాత్రలో ఫిజికల్ ఫిట్‌నెస్, యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆకట్టుకున్నాడు. సోనాక్షి సిన్హా గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నా ఆమెకు తగిన స్క్రీన్ టైమ్ ఇవ్వకపోవడం అభిమానులను కొంత నిరాశకు గురి చేసింది.

ఇతర నటీనటులు శిల్పా శిరోద్కర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ, శుభలేఖ సుధాకర్ తమ పాత్రల్లో సహజంగా నటించినా, వారికి వచ్చిన స్క్రీన్ స్పేస్ చాలా పరిమితంగా ఉందని అభిప్రాయం. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, సినిమా తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 6 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే ప్రీ-రిలీజ్ దశలోనే ఓటీటీ, శాటిలైట్ హక్కులు కలిపి రూ. 15 కోట్ల డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. అయితే సినిమాకు బ్రేక్‌ఈవెన్ పాయింట్ రూ. 8 కోట్లు చేరుకోవాలి. ప్రస్తుతం సినిమా ఆ దిశగా మోస్తరు స్థాయిలోనే కొనసాగుతోంది.
'జటాధర (Jatadhara)' సినిమా భారీ అంచనాలతో విడుదలైన బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూప లేకపోతుంది. విడుదలైన ఫస్ట్ వీకెండ్ లో కూడా వసూళ్లు చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. మొదట రోజు నుండి ఊహించినంత రన్ ఇవ్వకపోవడంతో ట్రేడ్ వర్గాలు కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. శుక్రవారం విడుదలైన 'జటాధర' తొలి రోజు ఇండియా నెట్ కలెక్షన్ రూ. 1.07 కోట్లు వసూలు చేసింది. అందులో తెలుగు వెర్షన్ రూ. 0.85 కోట్లు, హిందీ వెర్షన్ రూ. 0.22 కోట్లు కలెక్ట్ చేసింది.
ఇక రెండో రోజు (శనివారం) కూడా అదే స్థాయిలో కొనసాగి మరో రూ. 1.07 కోట్లు రాబట్టింది. 3వ రోజు (ఆదివారం)రూ. 1.17 కోట్లు వసూలు చేసింది. ఇక 4వ రోజు నుంచి కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. నేషనల్ వైడ్ గా కేవలం రూ. 55 లక్షలు వసూలు చేయగా, ఇక 5వ రోజు 60 లక్షలు వసూళ్లు చేసింది. దీంతో నాలుగు రోజులకు కలిపి మొత్తం వసూళ్లు సుమారు రూ.4.41 కోట్లకు చేరుకున్నాయి.ఇదిలాఉంటే.. విడుదలైన 4 రోజుల్లోనే సినిమా రూ.5.30 కోట్ల వసూళ్లు సాధించిందని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించడం గమన్హారం.
ఇక 6వ రోజు (బుధవారం) కూడా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఉదయం షోలలో 11.16 శాతం ఉండగా, మధ్యాహ్నం షోలలో 13.25 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. సాయంత్రం,రాత్రి షోలకు ఇదే పరిస్థితి ఉండే అవకాశముంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ఐదో రోజు జటాధర మూవీ రూ. 0.50 లక్షల నుంచి రూ.55 లక్షల వరకు మాత్రమే వసూలు చేసే అవకాశముందనీ అంచనా. ఈ లెక్కన చూస్తే..6 రోజుల మొత్తం వసూళ్లు రూ.4.5 కోట్లకు చేరువ అయ్యే అవకాశం ఉంది.
మొత్తం మీద, సుధీర్ బాబు - సోనాక్షి సిన్హా కాంబినేషన్ కొత్తదనాన్ని చూపించినా, కథనం ఆకట్టుకునే విధంగా లేకపోవడం వల్ల "జటాధర" ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేక పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, మౌత్‌టాక్ మెరుగుపడితే రెండో వీకెండ్ లో వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 'జటాధర' కలెక్షన్లు క్రమంగా పడిపోతున్నాయి.ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కలెక్షన్లు పెరగడం కష్టమే అంటున్నారు ట్రేడ్ వర్గాలు.


Click it and Unblock the Notifications











