Jatadhara Closing Collections: జటాధర మూవీ క్లోజింగ్ కలెక్షన్లు.. సుధీర్ బాబు సినిమాకు లాభమెంత? నష్టమెంత?
తెలుగు సినిమా రంగంలో నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కీలక పాత్రల్లో నటించిన చిత్రం జటాధర. మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలుజీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు.
సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రంలో శిల్పా శిరోద్కర్ కీలక పాత్ర పోషించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదలైంది. గత 7 రోజులుగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని ఈ సినిమా సాధించింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? థియేట్రికల్ రన్‌లో ఈ సినిమాకు ఎంత లాభం, ఎంత నష్టం? అనే వివరాల్లోకి వెళితే..

జటాధర సినిమా విషయానికి వస్తే.. హిందీలో టాప్ యాక్టర్లు నటించడం, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్ భారీగా చేయడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ భారీగానే జరిగింది. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషన్ల ఖర్చులనీ కలిపితే.. 16 కోట్ల రూపాయల మేర బడ్జెట్ అయింది. ఈ సినిమాకు సుమారుగా 8 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆంధ్రా, తెలంగాణ థియేట్రికల్ రైట్ స్ 6 కోట్ల రూపాయలు, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
జటాధర సినిమా టీజర్లు, ట్రైలర్లు ఈ సినిమాపై క్యురియాసిటీని కలుగుజేశాయి. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 350 స్క్రీన్లలో విడుదల చేశారు. నార్త్ ఇండియాలో 100, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ సినిమా 16 కోట్ల గ్రాస్, 8 కోట్ల నెట్ కలెక్షన్లతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
ఇక థియేటర్‌లోకి వచ్చిన ఈ సినిమా తొలి ఆట నుంచే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నది. సాధారణ ప్రేక్షకులను, సినీ విమర్శకులను మెప్పించలేకపోవడం కలెక్షన్లపై ప్రభావం పడంది. ఈ సినిమా ఇండియాలో తొలి రోజు 1.5 కోట్ల గ్రాస్, 2వ రోజు 80 లక్షల రూపాయల గ్రాస్, 3వ రోజు 1.5 కోట్ల గ్రాస్, 4వ రోజు 40 లక్షల గ్రాస్, 6వ రోజు 40 లక్షల గ్రాస్, 7వ రోజు 40 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ సినిమా వసూళ్లను ఏరియాల వారీగా పరిశీలిస్తే.. నైజాంలో 85 లక్షల రూపాయలు, ఆంధ్రాలో 1.10 కోటి రూపాయలు, సీడెడ్‌లో 35 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా మొత్తంగా 2.30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కర్ణాటక, హిందీ, ఓవర్సీస్‌లో కలిపి 50 లక్షల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 3.5 కోట్ల రూపాయలు నెట్, 7.45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీ పూర్తిగా క్లోజ్ అయినట్టే అని ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి. దాంతో ఈ సినిమా సుమారుగా 5 కోట్ల రూపాయల నెట్, 10.5 కోట్ల గ్రాస్ నష్టంతో ముగిసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











