Jathi Ratnalu 12 Days collections: జాతి రత్నాలు బాక్సాఫీస్ జైత్రయాత్ర.. కొనసాగుతున్న కలెక్షన్ల సునామీ
టాలీవుడ్‌లో రికార్డులు తిరగరాస్తున్న జాతి రత్నాలు చిత్రం రెండోవారంలో కూడా బాక్సాఫీస్ వద్ద ధమాకా సృష్టిస్తున్నది. విడుదలైన అన్ని కేంద్రాల వద్ద నిలకడగా వసూళ్లను సాధిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్‌లో జైత్రయాత్రను కొనసాగిస్తున్న ఈ చిత్రం 12వ రోజున ఏ మేరకు కలెక్షన్లను సాధించిందంటే...

జాతి రత్నాలు 12వ రోజు కలెక్షన్లు
జాతి రత్నాలు చిత్రం 12వ రోజున కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో 61 లక్షలు, సీడెడ్‌లో 18 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.9 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 4 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 3 లక్షలు, గుంటూరు జిల్లాలో రూ.5 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.5.4 లక్షలు, నెల్లూరు జిల్లాలో రూ.2 లక్షల వసూళ్లను నమోదు చేసింది. మొత్తంగా ఈ చిత్రం 12వ రోజున కోటి రూపాయల నికర వసూళ్లు, రూ.1.7 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

12 రోజుల నైజాం, ఏపీ వసూళ్లు
నైజాం, ఏపీల్లో జాతి రత్నాలు రోజువారీ కలెక్షన్లను పరిశీలిస్తే... తొలి రోజున రూ.3.94 కోట్లు, రెండో రోజున రూ.2.97 కోట్లు, మూడో రోజున రూ.4.28 కోట్లు, నాలుగో రోజున రూ.5.33 కోట్లు, ఐదో రోజున రూ.2.74 కోట్లు, ఆరో రోజున రూ.2.05 కోట్లు, ఏడో రోజున రూ.1.78 కోట్లు, ఎనిమిదో రోజున రూ.1.23 కోట్లు, తొమ్మిదో రోజున రూ.1.02 కోట్లు, పదో రోజున రూ.1.37 కోట్లు, పదకొండో రోజున రూ.2.15 కోట్లు, పన్నెండో రోజున రూ.1.07 కోట్లు సాధించింది.

యూఎస్‌లో కలెక్షన్ల హోరు
ఇక యూఎస్ బాక్సాఫీస్ వద్ద జాతిరత్నాలు చిత్రానికి మంచి రెస్పాన్స్ కనిపిస్తున్నది. ఆదివారం సెలవు రోజున 44787 డాలర్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 971,152 అమెరికన్ డాలర్లు నమోదు చేసింది. అంటే దాదాపు 7 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. సోమవారం సాధించే కలెక్షన్లతో ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. లాక్‌డౌన్ తర్వాత ఒక మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా ఘనతను సాధిస్తుంది.

12 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లు
ఇక 12 రోజుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఇలా నమోదయ్యాయి. నైజాం, ఏపీలో కలిసి రూ.29.83 కోట్లు నికరంగా, రూ.47.60 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కర్ణాటక, మిగితా రాష్ట్రాల్లో రూ.1.45 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్‌లో రూ.7 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం నికరంగా రూ.35 కోట్లు, గ్రాస్‌గా రూ.57.70 కోట్లు నమోదు చేసింది.
Recommended Video

24 కోట్ల రికార్డు లాభంతో
జాతి రత్నాలు చిత్రం రూ.11.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అయితే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ఈ చిత్రం విడుదలైన కొద్ది రోజుల్లోనే లాభాల్లోకి వచ్చేసింది. ప్రస్తుతం సుమారు రూ.24 కోట్లకుపైగా లాభంతో జైత్రయాత్రను బాక్సాఫీస్ వద్ద కొనసాగిస్తున్నది.


Click it and Unblock the Notifications











