Jathi Ratnalu 1st Week Collections: ఊహించని విధంగా ‘జాతి రత్నాలు’ కలెక్షన్లు.. వారానికే అంత లాభమా!
ఇటీవలి కాలంలో హాస్య ప్రధానమైన సినిమాలు అంతగా రావడం లేదు. ఆ తరహా చిత్రాల్లో నటించే హీరోల్లో ప్రయోగాత్మక కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఇలాంటి సమయంలో చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ.. విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న చిత్రమే 'జాతి రత్నాలు'. మహా శివరాత్రి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ స్పందనతో దూసుకుపోతోంది. ఫలితంగా కలెక్షన్లనూ అదే స్థాయిలో అందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా మొదటి వారం బాక్సాఫీస్ రిపోర్టును ఒకసారి పరిశీలించండి!

భారీ విజయాన్ని అందుకున్న ‘జాతి రత్నాలు’
టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి - ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'జాతి రత్నాలు'. అనుదీప్ కేవీ తెరకెక్కించిన సినిమాలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ద్వారా 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా మారాడు. రాధన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుని సత్తా చాటింది.

అంచనాలకు తగ్గట్లే బిజినెస్... ఎక్కడ? ఎంత?
వినూత్న ప్రమోషన్, టీజర్, ట్రైలర్ కారణంగా 'జాతి రత్నాలు' మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తద్వారా ఇది నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్, కర్నాటక ప్లస్ ఓవర్సీస్ కలిపి రూ. 1.75 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.

ఏడో రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?
ఏడో రోజు కూడా 'జాతి రత్నాలు' మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 21 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 17 లక్షలు, ఈస్ట్‌లో రూ. 7 లక్షలు, వెస్ట్‌లో రూ. 5.40 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 6.70 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో ఏపీ, తెలంగాణలో కలిపి బుధవారం రూ. 1.78 కోట్లు షేర్, రూ. 2.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

వారం రోజులకు ఈ సినిమా ఎంత రాబట్టింది?
'జాతి రత్నాలు' తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఫలితంగా మొదటి రోజు రూ. 3.94 కోట్లు, రెండో రోజు రూ. 2.80 కోట్లు, మూడో రోజు రూ. 4.28 కోట్లు, నాలుగో రోజు రూ. 5.33 కోట్లు, ఐదో రోజు రూ. 2.74 కోట్లు, ఆరో రోజు రూ. 2.05 కోట్లు, ఏడో రోజు రూ. 1.78 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 23.09 కోట్లు షేర్, రూ. 36.90 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ‘జాతి రత్నాలు’ కలెక్షన్లు
తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజుల్లో కలిపి రూ. 23.09 కోట్లు షేర్ వసూలు చేసిన 'జాతి రత్నాలు'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.18 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.43 కోట్లు రాబట్టింది. దీంతో మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 27.70 కోట్లు షేర్‌తో పాటు రూ. 46 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. తద్వారా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసి సక్సెస్‌ఫుల్‌గా రెండో వారంలోకి ఎంటర్ అయింది.
Recommended Video

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?
ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 'జాతి రత్నాలు' సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకోవడంతో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఏడు రోజులకు రూ. 27.70 కోట్లు వసూలు అవడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేయడంతో పాటు అప్పుడే ఏకంగా రూ. 16.20 కోట్లు లాభాలను అందుకుని బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications











