‘బాహుబలి’ రికార్డును బ్రేక్ చేసిన ‘జాతి రత్నాలు’: అల్లు అర్జున్, మహేశ్ బాబు తర్వాత ఈ హీరోదే ఘనత!

ఈ మధ్య కాలంలో తెలుగులో ఎన్నో రకాల సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మన్ననలు అందుకుని సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. అలాంటి వాటిలో గత వారం విడుదలైన 'జాతి రత్నాలు' ఒకటి. మహా శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకోవడంతో పాటు భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు సినీ చరిత్రలోనే భారీ హిట్‌గా నిలిచిన 'బాహుబలి' సినిమా రికార్డును 'జాతి రత్నాలు' బ్రేక్ చేసింది. తద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆ వివరాలు మీకోసం!

 అలా వచ్చిన ‘జాతి రత్నాలు'.. సూపర్ హిట్

అలా వచ్చిన ‘జాతి రత్నాలు'.. సూపర్ హిట్

టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి - ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'జాతి రత్నాలు'. అనుదీప్ కేవీ తెరకెక్కించిన సినిమాలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ద్వారా 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా మారాడు. రాధన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుని సత్తా చాటింది.

 బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ మూడు రోజుల్లోనే కంప్లీట్

బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ మూడు రోజుల్లోనే కంప్లీట్

ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 'జాతి రత్నాలు' సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకోవడంతో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.50 కోట్లుగా నమోదైంది. ఇక, మొదటి మూడు రోజులకు రూ. 14.47 కోట్లు వసూలు అవడంతో బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను కేవలం మూడు రోజుల్లోనే ఫినీష్ చేసేసిందీ చిత్రం. అంతేకాదు, భారీ స్థాయిలో లాభాలను కూడా అందుకుంది.

వారం రోజులకు ఈ సినిమా ఎంత రాబట్టింది?

వారం రోజులకు ఈ సినిమా ఎంత రాబట్టింది?

'జాతి రత్నాలు' తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఫలితంగా మొదటి రోజు రూ. 3.94 కోట్లు, రెండో రోజు రూ. 2.80 కోట్లు, మూడో రోజు రూ. 4.28 కోట్లు, నాలుగో రోజు రూ. 5.33 కోట్లు, ఐదో రోజు రూ. 2.74 కోట్లు, ఆరో రోజు రూ. 2.05 కోట్లు, ఏడో రోజు రూ. 1.78 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 23.09 కోట్లు షేర్, రూ. 36.90 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

‘బాహుబలి' రికార్డు బ్రేక్ చేసిన ‘జాతి రత్నాలు'

‘బాహుబలి' రికార్డు బ్రేక్ చేసిన ‘జాతి రత్నాలు'

నైజాం ఏరియాలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న థియేటర్లకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అక్కడే ఎక్కవ కలెక్షన్లు వస్తుంటాయి. ఈ క్రమంలోనే 'బాహుబలి: ది కంక్లూజన్' క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో తొలి వారం రూ.36 లక్షల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పుడా రికార్డును 'జాతి రత్నాలు' బ్రేక్ చేసింది. ఈ సినిమా వారం రోజుల్లో రూ.38.63 లక్షల గ్రాస్‌‌ను అందుకుని సత్తా చాటింది.

 బాహుబలిని వెనక్కి నెట్టిన ఆ రెండు చిత్రాలు

బాహుబలిని వెనక్కి నెట్టిన ఆ రెండు చిత్రాలు

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో 'బాహుబలి' క్రియేట్ చేసిన రికార్డు.. గత ఏడాదే బద్దలైపోయింది. 2020లో విడుదలైన 'అల.. వైకుంఠపురములో' రూ.40.83 లక్షల గ్రాస్‌ రాబట్టి నెంబర్ స్థానంలో ఉండగా.. అప్పుడు వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' రూ.40.76 లక్షలు వసూలు చేసి రెండో స్థానంలో ఉంది. దీంతో బాహుబలి మూడో స్థానానికి పడిపోవడం గమనార్హం.

 మూడో స్థానానికి చేరుకున్న నవీన్ కొత్త మూవీ

మూడో స్థానానికి చేరుకున్న నవీన్ కొత్త మూవీ

ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో మొదటి వారం ఎక్కువ గ్రాస్‌ను రాబట్టిన చిత్రాల జాబితాలో 'బాహుబలి' సినిమా మూడో స్థానంలో ఉంది. దీన్ని వెనక్కి నెడుతూ 'జాతి రత్నాలు' సత్తా చాటింది. దీంతో అల్లు అర్జున్ (అల.. వైకుంఠపురములో).. మహేశ్ బాబు (సరిలేరు నీకెవ్వరు) తర్వాత స్థానాన్ని దక్కించుకున్న హీరోగా నవీన్ పోలిశెట్టి అరుదైన ఘనతను దక్కించుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X