‘ఉప్పెన’ను వెనక్కి తన్నేసి చరిత్ర సృష్టించిన జాతిరత్నాలు.. మొట్టమొదటి సినిమా అదే!

జాతిరత్నాలు సినిమా గురించి వినని తెలుగు ప్రేక్షకులెవ్వరూ ఉండరు. మౌత్ టాక్‌తో సినిమా రోజురోజుకూ పుంజుకుంటూనే ఉంది. రెండు వారాలు అవుతున్నా కూడా జాతిరత్నాలు హవా మాత్రం తగ్గడం లేదు. కలెక్షన్లు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో.. ప్రమోషన్స్ కూడా అంతేస్థాయిలో చేసుకుంటూ పోతోంది చిత్రయూనిట్. అలా జాతి రత్నాలు సినిమా ఇప్పుడు సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇది ఈ ఏడాదిలోనే అతి గొప్ప విషయం.

జాతిరత్నాలు రచ్చ..

జాతిరత్నాలు రచ్చ..

జాతి రత్నాలు సినిమాపై మొదటి నుంచి మంచి పాజిటివిటీనే ఏర్పడింది. టీజర్, ట్రైలర్, చిట్టీ సాంగ్‌తో మంచి బజ్ ఏర్పడింది. దానికి తోడు సినిమాపై అదిరిపోయే మౌత్ టాక్ వచ్చింది. రెండు గంటల విపరీతంగా నవ్వుకునే సినిమా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ రాలేదంటూ జనాలంతా జాతిరత్నాలు సినిమాకు ఓటేశారు.

బికినీలో మౌనీ రాయ్.. స్విమ్మింగ్ పూల్‌లో జలకాలట

కలెక్షన్లలో సునామీ..

కలెక్షన్లలో సునామీ..

గత రెండు వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో జాతి రత్నాలు హవా కొనసాగుతూనే ఉంది. గత వారం నాలుగు చిత్రాలు లైన్‌లోకి వచ్చినా కూడా ఒక్కటంటే ఒక్కటి హిట్ కాలేదు. దీంతో మళ్లీ జాతి రత్నాలు హవా పుంజుకుంది. అలా రెండు వారాల నుంచి జాతిరత్నాలు దూసుకుపోతూనే ఉంది.

యాబై కోట్ల గ్రాస్..

యాబై కోట్ల గ్రాస్..

జాతి రత్నాలు ఈ రెండు వారాల్లో దాదాపు యాభై కోట్ల గ్రాస్‌కు చేరుకుంది. ఈ పద్నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జాతి రత్నాలు 49.15కోట్లు కొల్లగొట్టింది. మొత్తంగా 30.75 కోట్ల నెట్ షేర్‌ను వసూళ్లు చేసింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో జాతి రత్నాలు తన సత్తా చాటింది.

ఓవర్సీస్ మార్కెట్..

ఓవర్సీస్ మార్కెట్..


కరోనా వల్ల ఈ ఏడాది ఓవర్సీస్ మార్కెట్‌లో మన సినిమాలేవీ అంతగా ఆడటం లేదు. ఎందుకంటే అంతటా కరోనా భయం నెలకొని ఉంది. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ కూడా అక్కడ వన్ మిలియన్ మార్క్‌ను చేరుకోలేకపోయింది. కానీ జాతి రత్నాలు మాత్రం ఆ ఫీట్‌ను అందుకుని చరిత్ర సృష్టించింది.

Recommended Video

Naveen Polishetty ఎమోషనల్ కామెంట్స్ On Sushant Singh Rajput
మొట్టమొదటి సినిమా..

మొట్టమొదటి సినిమా..

ఈ ఏడాదిలో ఓవర్సీస్‌లో వన్ మిలియన్ మార్క్‌ను రాబట్టిన చిత్రంగా జాతి రత్నాలు నిలిచింది. ఈ లెక్కన ఉప్పెన సినిమాను కూడా జాతిరత్నాలు వెనక్కి నెట్టేసింది. మొట్టమొదటి వన్ మిలియన్ డాలర్ల చిత్రంగా జాతి రత్నాలు నిలవడంతో చిత్రయూనిట్ గాల్లో తేలిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X