జాతి రత్నాలు ఫస్ట్ డే కలెక్షన్ల అంచనా.. వసూళ్లు ఎలా ఉన్నాయంటే..
ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా స్వప్న సినిమా బ్యానర్‌పై నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన జాతి రత్నాలు చిత్రం మహాశివరాత్రి పండుగ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లకు మంచి రెస్సాన్స్ రావడంతో రిలీజ్‌కు ముందు మంచి బజ్ ఏర్పడింది. దాంతో జాతి రత్నాలు చిత్రానికి మోస్తారు కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలకు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే...

మహాశివరాత్రి పండుగ రోజున
మహాశివరాత్రి పండుగ జాతి రత్నాలు సినిమాకు కలిసి వచ్చేందుకు ఉపయోగపడిందనే చెప్పవచ్చు. సెలవు దినం కావడం విడుదలకు ముందు మంచి రెస్పాన్స్ రావడంతో ఓపెనింగ్ బుకింగ్స్ భారీగా నమోదయ్యాయి. దాంతో మీడియం రేంజ్ సినిమాలతో పోల్చితే తొలి రోజు ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద భారీ గణాంకాలు నమోదయ్యే ఛాన్స్ ఉంది.

సినిమా ఫస్టాఫ్ గురించి టాక్
ఇక జాతి రత్నాలు సినిమా విషయానికి వస్తే సినిమా ఫస్టాఫ్ బ్రహ్మండంగా ఉందనే టాక్ నెలకొని ఉంది. అయితే సెకండాఫ్ విషయానికి వస్తే నాటు కొట్టుడు.. మితీ మీరిన హస్యం అపహాస్యం అయిందనే మాట వినిపిస్తుంది. ఈ టాక్ కాస్త సినిమాకు మైనస్ అయింది.

సెకండాఫ్ పరమ బోర్.. వెకిలి కామెడీతో
జాతి రత్నాలు మూవీ సెకండాఫ్‌కు వస్తే.. లాజిక్స్ లేకుండా రొటీన్ సీన్లతో కాస్త బోర్ కొట్టించారనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వస్తున్నది. వెకిలి కామెడీ కాస్త డోస్ పెరిగిందనే టాక్ ఉంది. సెకండాఫ్ మరింత బెటర్‌గా రూపొందించడానికి ఛాన్స్ ఉన్నా దాని జార విడుచుకొన్నారనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

అంచనాలు మించిన జాతి రత్నాలు బిజినెస్
ఇక జాతి రత్నాలు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే క్రేజీగా నంబర్లు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 11 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశించాలంటే కనీసం రూ.11.5 కోట్ల బిజినెస్‌ను నమోదు చేయాల్సి ఉందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

సుమారు 4 కోట్లు రాబట్టే అవకాశం
తాజా ట్రేడ్ రిపోర్టు వేసిన అంచనా ప్రకారం.. జాతి రత్నాలు చిత్రం తొలి ఆట నుంచే భారీ కలెక్షన్లను రాబడుతున్నట్టు సమాచారం. తొలి రోజు అంచనా ప్రకారం ఈ చిత్రం రూ.3.5 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను సాధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ కలెక్షన్లు మీడియా రేంజ్ సినిమాల్లో అత్యుత్తమ వసూళ్లుగా భావించడానికి ఛాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











