Jathi Ratnalu collections: యూఎస్‌లో కొనసాగుతున్న హవా.. అరుదైన రికార్డుకు చేరువలో..

నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కాంబినేషన్‌లో నాగ్ అశ్విన్ నిర్మాతగా నూతన దర్శకుడు ఆనుదీప్ కేవీ రూపొందించిన చిత్రం జాతి రత్నాలు రెండోవారంలో కూడా మంచి వసూళ్లను సాధిస్తున్నది. గత వారం కొద్ది రోజులుగా విడుదలైన అన్ని చిత్రాల పోటీని ఎదుర్కొని భారీ కలెక్షన్లను సాధించింది. అయితే ఈ చిత్రం ఓవర్సీస్ కలెక్షన్లు రికార్డు దిశగా పరుగులు పెడుతున్నాయి. ఆ వివారాల్లోకి వెళితే..

9 రోజున కూడా వసూళ్ల హవా

9 రోజున కూడా వసూళ్ల హవా


జాతి రత్నాలు సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. 9వ రోజున నైజాంలో రూ.68 లక్షలు, సీడెడ్‌లో రూ.11 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.8 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 4 లక్షలు, పశ్చిమ గోదావరి రూ.2 లక్షలు, గుంటూరు జిల్లాలో రూ.4 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.4 లక్షలు, నెల్లూరు జిల్లాలో రూ.1 లక్ష వసూలు చేసింది.

9 రోజుల కలెక్షన్లు

9 రోజుల కలెక్షన్లు

జాతి రత్నాలు చిత్రం తొమ్మిది రోజుల్లో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్ల నికర కలెక్షన్లు, సుమారు 50 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. నైజాంలో ఈ చిత్రం రూ.12.29 కోట్లు, సీడెడ్‌లో రూ.3.05 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.3.31 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 1.53 కోట్లు, పశ్చిమ గోదావరి రూ.1. 27 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ.1.70 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.1.44 కోట్లు, నెల్లూరు జిల్లాలో 75 లక్షలు వసూలు చేసింది.

యూఎస్ బాక్సాఫీస్ వద్ద ధమాకా

యూఎస్ బాక్సాఫీస్ వద్ద ధమాకా

ఇక అమెరికా బాక్సాఫీస్ వద్ద జాతి రత్నాలు ధమాకా వసూళ్లును రాబడుతున్నది. 1 రోజున 132,844 డాలర్లు, 2 రోజున 95,451, 3వ రోజున 53,567 డాలర్లు, 4 రోజున 192,071 డాలర్లు, ఐదో రోజున 126,115 డాలర్లు, 6 రోజున 28,293, 7వ రోజున 34,823, 8 రోజున 19,697 డాలర్లు, 9వ రోజున 17,415 డాలర్లు, శుక్రవారం 52,782 డాలర్లు రాబట్టింది. దాంతో ఓవరాల్‌గా 853,058 డాలర్లు అంటే రూ.6.22 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరనున్నది.

జాతి రత్నాలు ప్రీ రిలీజ్ బిజినెస్

జాతి రత్నాలు ప్రీ రిలీజ్ బిజినెస్


జాతి రత్నాలు ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు విషయానికి వస్తే.. నైజాం హక్కులను రూ.3 కోట్లు, సీడెడ్ హక్కులను రూ.1.4 కోట్లు, ఆంధ్రా రూ.5 కోట్ల మేర బిజినెస్‌తో మొత్తంగా రూ.9.6 కోట్ల బిజినెస్‌ను నమోదు చేసింది. కర్ణాటక, ఓవర్సీస్ కలిపితే రూ.1.6 కోట్లు మేర బిజినెస్ చేసింది. దాంతో మొత్తంగా 11 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

18 కోట్లకుపైగా లాభంతో

18 కోట్లకుపైగా లాభంతో


జాతి రత్నాలు మూవీ రూ.11.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన ముందు ఉన్న వసూళ్ల లక్ష్యాన్ని సునాయసంగా అధిగమించంది. ఇప్పటికే రూ.18 కోట్లకుపైగా లాభంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొన్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X