Jathi Ratnalu Closing collections: టాప్ -5కి చేరిన జాతి రత్నాలు.. తెలుగులో నాలుగో సినిమాగా రికార్డ్

తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. మరీ ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకునే సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకుంటున్నాయి. అందులో చిన్న సినిమాగా వచ్చి.. భారీ సక్సెస్‌ను అందుకున్న 'జాతి రత్నాలు' ఒకటి. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ సినిమా ఊహించని రీతిలో హిట్‌గా నిలిచింది. తద్వారా కలెక్షన్లను కూడా భారీగానే వసూలు చేసింది. దీంతో నిర్మాతపై లాభాల వర్షం కురిసింది. ఇక, ఈ సినిమా ముగింపు కలెక్షన్ల రిపోర్టుపై మీరూ ఓ లుక్కేయండి!

నిజమైన ‘జాతి రత్నాలు' అనేలా వచ్చారుగా

నిజమైన ‘జాతి రత్నాలు' అనేలా వచ్చారుగా

టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి - ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం 'జాతి రత్నాలు'. అనుదీప్ కేవీ రూపొందించిన ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్‌పై 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించాడు. రాధన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇది చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.

అంచనాలకు తగ్గట్లుగానే... ప్రీ బిజినెస్ ఎంత?

అంచనాలకు తగ్గట్లుగానే... ప్రీ బిజినెస్ ఎంత?

రిలీజ్‌కు ముందే 'జాతి రత్నాలు' మూవీ ప్రేక్షకులకు చేరువ అవడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. తద్వారా ఇది నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్, కర్నాటక ప్లస్ ఓవర్సీస్ కలిపి రూ. 1.75 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ, ఎంత రాబట్టిందంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ, ఎంత రాబట్టిందంటే?

'జాతి రత్నాలు' ఆరంభం నుంచే మంచి స్పందనతో దూసుకెళ్లింది. ఫలితంగా నైజాంలో రూ. 16 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.27 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.97 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.92 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.52 కోట్లు, గుంటూరులో రూ. 2.08 కోట్లు, కృష్ణాలో రూ. 1.85 కోట్లు, నెల్లూరులో రూ. 91 లక్షలతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 32.52 కోట్లు షేర్, రూ. 52.25 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఏ రేంజ్?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఏ రేంజ్?

ముగింపు సమయానికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 32.52 కోట్లు షేర్ వసూలు చేసిన 'జాతి రత్నాలు'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.72 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.28 కోట్లు రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.52 కోట్లు షేర్‌తో పాటు రూ. 64.20 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఫలితంగా ఎన్నో మైలురాళ్లను చేరుతూ ఊహించని రీతిలో రికార్డులను బద్దలు కొట్టేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వచ్చిన లాభమెంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వచ్చిన లాభమెంత?

'జాతి రత్నాలు' మూవీ రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.50 కోట్లుగా నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో ముగింపు సమయానికి రూ. 38.52 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇధి ఏకంగా రూ. 27.02 కోట్లు లాభాలను అందుకుంది. తద్వారా రూ. 27 కోట్ల లాభాల మార్కును చేరుకున్న చిత్రంగా రికార్డులకెక్కింది.

Recommended Video

Naveen Polishetty ఎమోషనల్ కామెంట్స్ On Sushant Singh Rajput
తెలుగులో నాలుగో సినిమాగా రికార్డు నమోదు

తెలుగులో నాలుగో సినిమాగా రికార్డు నమోదు

తెలుగులో ఎక్కువ లాభాలను అందుకున్న మీడియం చిత్రాల జాబితాలో రూ. 27.02 కోట్లతో 'జాతి రత్నాలు' నాలుగో స్థానంలో నిలిచింది. దీని కంటే ముందు 'గీత గోవిందం' రూ. 55.43 కోట్లతో మొదటి స్థానంలో, 'ఉప్పెన' రూ. 31.02 కోట్లతో రెండో స్థానంలో, 'ఫిదా' రూ. 30.50 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. 'ఇస్మార్ట్ శంకర్' రూ. 22.78 కోట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X