Jathi Ratnalu day 1 collections: షాకిస్తోన్న ‘జాతి రత్నాలు’ కలెక్షన్లు.. అప్పుడే ఫినీష్ అయ్యేలా
ఏదైనా సినిమా విడుదల అవుతుందంటే.. అందులో చేసింది చిన్న హీరోనా? పెద్ద స్టారా? అని చూసే రోజులు పోయాయి. కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఆ ధైర్యంతోనే ఇప్పటి తరం హీరోలు, దర్శక నిర్మాతలు ముందడుగు వేయగలుగుతున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చినా భారీ స్థాయిలో ట్రెండ్ అయిన వాటిలో 'జాతి రత్నాలు' ఒకటి. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల వివరాలు షాక్‌కు గురి చేస్తున్నాయి.

టాలీవుడ్‌లోనే తొలిసారి... ట్రెండ్ సెట్ చేసేశారు
ఏదైనా సినిమా వస్తుందంటే దానికి పబ్లిసిటీ ఎంత ఎక్కువ చేస్తే.. అంతగా ప్రేక్షకుల్లోకి వెళ్తుంది. అందుకు అనుగుణంగానే 'జాతి రత్నాలు' మూవీ ప్రమోషన్ కూడా జరిగింది. అయితే, అన్నింటికి మించి ఈ సినిమా వినూత్నంగా ఆలోచించి చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ కారణంగానే విడుదలకు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తద్వారా ఆదరణ లభిస్తోంది.

షాకింగ్‌గా బిజినెస్.. ఎక్కడ? ఎంత? జరిగింది?
పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌ల కారణంగా 'జాతి రత్నాలు'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్, కర్నాటక ప్లస్ ఓవర్సీస్ కలిపి రూ. 1.75 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.

ఎవరి నోట విన్నా అదే మాట... అంతటా హవా
'జాతి రత్నాలు' సినిమా గురువారం గ్రాండ్‌గా రిలీజ్ అయింది. దాదాపు ఏడు వందలకు పైగా థియేటర్లలో ఇది ప్రదర్శితం అవుతోంది. అది కూడా అన్ని చోట్లా హౌస్‌ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. ప్రీమియర్స్ నుంచే దీనికి మంచి టాక్ రావడంతో స్పందన ఎక్కవ కనిపిస్తోంది. నిన్న మరో మూడు సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ.. 'జాతి రత్నాలు' చిత్రానిదే హవా కనిపిస్తోంది.

మొదటి రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?
మొదటి రోజు 'జాతి రత్నాలు'కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. తద్వారా నైజాంలో రూ. 1.42 కోట్లు, సీడెడ్‌లో రూ. 57 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 45 లక్షలు, ఈస్ట్‌లో రూ. 38 లక్షలు, వెస్ట్‌లో రూ. 28.30 లక్షలు, గుంటూరులో రూ. 39 లక్షలు, కృష్ణాలో రూ. 24.80 లక్షలు, నెల్లూరులో రూ. 20 లక్షలతో రెండు రాష్ట్రాల్లో రూ. 3.94 కోట్లు షేర్, రూ. 6.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ‘జాతి రత్నాలు' కలెక్షన్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రీతిలో రూ. 3.94 కోట్లు షేర్ వసూలు చేసిన 'జాతి రత్నాలు'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 8 లక్షలు రాబట్టింది. దీంతో మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.84 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.40 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. చిన్న సినిమాగా వచ్చి ఈ రేంజ్ కలెక్షన్లు సాధించడంతో అంతా షాకైపోతున్నారు.

సగానికి సగం వచ్చేశాయి.. వీకెండ్‌లోనే కంప్లీట్
ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 'జాతి రత్నాలు' సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకోవడంతో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.50 కోట్లుగా నమోదైంది. ఇక, మొదటి రోజే రూ. 4.84 కోట్లు వసూలు అవడంతో టార్గెట్ చేరుకోవాలంటే ఇంకా రూ. 6.66 కోట్లు వసూలు చేయాలి. ప్రస్తుతం ఉన్న ఊపును బట్టి చూస్తే ఆదివారం కల్లా అది ఫినీష్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











