Jathi Ratnalu 10Days Collections: పది రోజులకే 50 కోట్లు.. ట్రేడ్ వర్గాలే షాకయ్యేలా.. టాప్ 5లో చేరిక!

'జాతి రత్నాలు'.. పేరుకు చిన్న సినిమానే.. కానీ ఎఫెక్ట్ మాత్రం సాలిడ్‌గా చూపిస్తోంది. ఆరంభం నుంచే సూపర్ హిట్ టాక్‌తో పాటు కలెక్షన్లనూ భారీ రేంజ్‌లో రాబడుతూ సత్తా చాటుతోందీ మూవీ. పోటీగా ఎన్ని సినిమాలు ఉన్నా.. మొదటి రోజు నుంచి అదిరిపోయే వసూళ్లను రాబడుతూ ఎన్నో మైలురాళ్లను చేరుకుంటోంది. అదే సమయంలో ఊహకే అందని రీతిలో రికార్డులను క్రియేట్ చేస్తోంది. తద్వారా భారీ స్థాయిలో లాభాలనూ సాధిస్తోంది. టాలీవుడ్‌ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తూ దూసుకుపోతోన్న ఈ మూవీ పది రోజుల కలెక్షన్లు రిపోర్టును ఒకసారి చూద్దాం పదండి!

పొట్టి బట్టలతో టాలీవుడ్ పాపులర్ యాంకర్ ఫోటోషూట్ (ఫొటోలు)

కొత్త వాళ్లే.. కానీ నిజమైన ‘జాతి రత్నాలు' వీళ్లు

కొత్త వాళ్లే.. కానీ నిజమైన ‘జాతి రత్నాలు' వీళ్లు

అనుదీప్ కేవీ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'జాతి రత్నాలు'. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించాడు. రాధన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. కొత్త వాళ్లైనా సత్తా చాటడంతో ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఫలితంగా కలెక్షన్లూ మంచిగా వస్తున్నాయి.

పెరిగిన అంచనాలు... ప్రీ బిజినెస్ ఎక్కడ? ఎంత?

పెరిగిన అంచనాలు... ప్రీ బిజినెస్ ఎక్కడ? ఎంత?

వినూత్న ప్రమోషన్, టీజర్, ట్రైలర్ కారణంగా 'జాతి రత్నాలు' మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తద్వారా ఇది నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్, కర్నాటక ప్లస్ ఓవర్సీస్ కలిపి రూ. 1.75 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.

పదో రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?

పదో రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?

పదో రోజు కూడా 'జాతి రత్నాలు' మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 74 లక్షలు, సీడెడ్‌లో రూ. 21 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 13 లక్షలు, ఈస్ట్‌లో రూ. 8 లక్షలు, వెస్ట్‌లో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 7.10 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి శనివారం రూ. 1.37 కోట్లు షేర్, రూ. 2 కోట్లు గ్రాస్ వచ్చింది.

పది రోజులకు ఈ సినిమా ఎంత రాబట్టింది?

పది రోజులకు ఈ సినిమా ఎంత రాబట్టింది?

'జాతి రత్నాలు' అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. ఫలితంగా 1వ రోజు రూ. 3.94 కోట్లు, 2వ రోజు రూ. 2.80 కోట్లు, 3వ రోజు రూ. 4.28 కోట్లు, 4వ రోజు రూ. 5.33 కోట్లు, 5వ రోజు రూ. 2.74 కోట్లు, 6వ రోజు రూ. 2.05 కోట్లు, 7వ రోజు రూ. 1.78 కోట్లు, 8వ రోజు రూ. 1.23 కోట్లు, 9వ రోజు రూ. 1.02, 10వ రోజు రూ. 1.37 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 26.71 కోట్లు షేర్, రూ. 42.30 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ‘జాతి రత్నాలు' కలెక్షన్లు ఎలా?

ప్రపంచ వ్యాప్తంగా ‘జాతి రత్నాలు' కలెక్షన్లు ఎలా?

తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల్లో రూ. 26.71 కోట్లు షేర్ వసూలు చేసిన 'జాతి రత్నాలు'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.31 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.63 కోట్లు రాబట్టింది. దీంతో పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.55 కోట్లు షేర్‌తో పాటు రూ. 51.80 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. తద్వారా ఈ శుక్రవారం విడుదలైన కొత్త సినిమాలకూ సైతం భారీ దెబ్బను కొట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మొత్తం లాభాలు ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మొత్తం లాభాలు ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 'జాతి రత్నాలు' సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకోవడంతో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.50 కోట్లుగా నమోదైంది. ఇక, పది రోజులకు రూ. 31.55 కోట్లు వసూలు అవడంతో బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను పూర్తి చేయడంతో పాటు అప్పుడే ఏకంగా రూ. 20.05 కోట్లు లాభాలను అందుకుని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

ట్రేడ్ వర్గాలే షాకయ్యేలా.. టాప్ 5లో చేరిక

ట్రేడ్ వర్గాలే షాకయ్యేలా.. టాప్ 5లో చేరిక

పది రోజుల ప్రయాణంలో 'జాతి రత్నాలు' మూవీ రూ. 50 కోట్ల (గ్రాస్) మైలురాయిని చేరుకుంది. అలాగే, రూ. 30 కోట్ల షేర్ మార్కును అందుకుంది. వీటితో పాటు లాభాల్లోనూ రూ. 20 కోట్లను దాటేసింది. ఈ క్రమంలోనే ఎక్కువ లాభాలను అందుకున్న మీడియం రేంజ్ చిత్రాల జాబితాలో ఐదో స్థానానికి చేరింది. ఇందులో ఫస్ట్ ప్లేస్‌లో 'గీత గోవిందం', రెండో స్థానంలో 'ఉప్పెన' ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X