twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jathi Ratnalu 11Days Collections: భారీగా పెరిగిన కలెక్షన్లు.. రూ. 33 లక్షలు వస్తే ఆ రికార్డు ఔట్!

    |

    గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో విడుదలైన తెలుగు సినిమాలు.. భారీ స్థాయిలో ప్రేక్షకుల స్పందనను అందుకుంటూ దూసుకుపోతున్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చిన 'క్రాక్', 'రెడ్' సహా పలు చిత్రాలతో పాటు గత నెలలో విడుదలైన 'ఉప్పెన' ఎన్నో రికార్డులను తిరగరాసేలా ఫలితాలను అందుకున్నాయి. ఇప్పుడా జాబితాలోనే చేరింది 'జాతి రత్నాలు' సినిమా. పేరున్న వాళ్లు లేకపోయినా ట్రెండ్ సెట్ చేస్తూ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తుందీ మూవీ. దీంతో నిర్మాతకు కలెక్షన్ల పంట పండిస్తోంది. ఇంతటి ప్రభావాన్ని చూపిస్తున్న ఈ చిత్రం 11 రోజుల వసూళ్ల రిపోర్టు ఇదే!

    ఈవెంట్లో సీఎం సీఎం అంటూ ఫాన్స్ కేకలు: ఎన్టీఆర్ సీరియస్ (ఫొటోలు)

    వాళ్లంతా కలిసి ‘జాతి రత్నాలు'లా వచ్చారుగా

    వాళ్లంతా కలిసి ‘జాతి రత్నాలు'లా వచ్చారుగా

    టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి.. ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం 'జాతి రత్నాలు'. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించాడు. రాధన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. కొత్త వాళ్లైనా సత్తా చాటడంతో ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఫలితంగా కలెక్షన్లూ విశేషంగా రాణిస్తూ దూసుకెళ్తోంది.

    అంచనాలకు తగ్గట్లుగానే... ప్రీ బిజినెస్ ఎంత?

    అంచనాలకు తగ్గట్లుగానే... ప్రీ బిజినెస్ ఎంత?

    రిలీజ్‌కు ముందే 'జాతి రత్నాలు' మూవీ ప్రేక్షకులకు చేరువ అవడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. తద్వారా ఇది నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్, కర్నాటక ప్లస్ ఓవర్సీస్ కలిపి రూ. 1.75 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.

    నితిన్ నా తమ్ముడు లాంటి వాడు..త్రివిక్రమ్ భావోద్వేగం..రంగ్ దే ప్రీ రిలీజ్ ఈవెంట్ (గ్యాలరీ)

    11వ రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?

    11వ రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?

    11వ రోజు 'జాతి రత్నాలు' కలెక్షన్లు భారీగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.12 కోట్లు, సీడెడ్‌లో రూ. 38 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 21 లక్షలు, ఈస్ట్‌లో రూ. 11 లక్షలు, వెస్ట్‌లో రూ. 5.60 లక్షలు, గుంటూరులో రూ. 10.60 లక్షలు, కృష్ణాలో రూ. 11 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఆదివారం రూ. 2.15 కోట్లు షేర్, రూ. 3.58 కోట్లు గ్రాస్ వచ్చింది.

    11 రోజులకు ఈ సినిమా ఎంత రాబట్టిందంటే?

    11 రోజులకు ఈ సినిమా ఎంత రాబట్టిందంటే?

    'జాతి రత్నాలు' అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. ఫలితంగా 1వ రోజు రూ. 3.94 కోట్లు, 2వ రోజు రూ. 2.80 కోట్లు, 3వ రోజు రూ. 4.28 కోట్లు, 4వ రోజు రూ. 5.33 కోట్లు, 5వ రోజు రూ. 2.74 కోట్లు, 6వ రోజు రూ. 2.05 కోట్లు, 7వ రోజు రూ. 1.78 కోట్లు, 8వ రోజు రూ. 1.23 కోట్లు, 9వ రోజు రూ. 1.02, 10వ రోజు రూ. 1.37 కోట్లు, 11వ రోజు 2.15 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 28.76 కోట్లు షేర్, రూ. 45.90 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

    ప్రపంచ వ్యాప్తంగా ‘జాతి రత్నాలు' వసూళ్లిలా

    ప్రపంచ వ్యాప్తంగా ‘జాతి రత్నాలు' వసూళ్లిలా

    తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల్లో రూ. 28.76 కోట్లు షేర్ వసూలు చేసిన 'జాతి రత్నాలు'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.42 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.78 కోట్లు రాబట్టింది. దీంతో పదకొండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 33.96 కోట్లు షేర్‌తో పాటు రూ. 55.90 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. తద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి మరీ దూసుకెళ్తోంది.

    బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మొత్తం లాభాలెంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మొత్తం లాభాలెంత?

    ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 'జాతి రత్నాలు' సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకోవడంతో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.50 కోట్లుగా నమోదైంది. ఇక, పదకొండు రోజులకు రూ. 33.96 కోట్లు వసూలు అవడంతో బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను పూర్తి చేయడంతో పాటు అప్పుడే ఏకంగా రూ. 22.46 కోట్లు లాభాలను అందుకుని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

    ఇంకో రూ. 33 లక్షలు వస్తే ఆ రికార్డు బద్దలే

    ఇంకో రూ. 33 లక్షలు వస్తే ఆ రికార్డు బద్దలే

    పదకొండు రోజుల్లో 'జాతి రత్నాలు' మూవీ రూ. 33.96 కోట్లు వసూలు చేసి రూ. 22.46 కోట్లు లాభాలను అందుకోవడంతో పలు రికార్డులు బద్దలయ్యాయి. ఎక్కువ లాభాలను అందుకున్న మీడియం రేంజ్ చిత్రాల జాబితాలో ఇప్పటికే ఐదో స్థానానికి చేరిన ఈ చిత్రం.. మరో రూ. 33 లక్షలు వసూలు చేస్తే నాలుగో స్థానానికి చేరుతుంది. దీంతో ఇస్మార్ట్ శంకర్ ఐదుకు పడిపోతుంది.

    English summary
    Jathi Ratnalu is an upcoming Indian Telugu-language comedy-drama film written and directed by Anudeep KV. The film starring Naveen Polishetty, Faria Abdullah, Priyadarshi, and Rahul Ramakrishna is produced by Nag Ashwin under the banner Swapna Cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X