Jathi Ratnalu 13 Days Collections: సగానికి సగం పడిపోయిన కలెక్షన్లు.. ఇంకో 80 లక్షలు వస్తే రికార్డే!

గత ఏడాదితో పోల్చుకుంటే 2021 ఆరంభంలోనే ఎన్నో విజయాలు తెలుగు సినీ ఇండస్ట్రీకి కొత్త ఊపును తెచ్చి పెడుతున్నాయి. అందులో కొన్ని చిత్రాలు భారీ స్థాయిలో కలెక్షన్లు అందుకుని బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో మహా శివరాత్రి కానుకగా వచ్చిన 'జాతి రత్నాలు' ఒకటి. ఆరంభం నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేస్తుంది. దీంతో ఎన్నో రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ క్రమంలోనే మరో మైలురాయికి చేరువైంది. ఈ మూవీ బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!

బీచ్‌లో శివానీ నారాయణ్ గ్లామరస్ ఫోటోషూట్..

టాలీవుడ్ ‘జాతి రత్నాలు'.. సూపర్ రెస్పాన్స్

టాలీవుడ్ ‘జాతి రత్నాలు'.. సూపర్ రెస్పాన్స్

టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'జాతి రత్నాలు'. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను అనుదీప్ కేవీ తెరకెక్కించాడు. దీన్ని 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించాడు. రాధన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

అంచనాలకు తగ్గట్లుగానే... ప్రీ బిజినెస్ ఎంత?

అంచనాలకు తగ్గట్లుగానే... ప్రీ బిజినెస్ ఎంత?


రిలీజ్‌కు ముందే 'జాతి రత్నాలు' మూవీ ప్రేక్షకులకు చేరువ అవడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. తద్వారా ఇది నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్, కర్నాటక ప్లస్ ఓవర్సీస్ కలిపి రూ. 1.75 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.

13వ రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?

13వ రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?


13వ రోజు 'జాతి రత్నాలు' కలెక్షన్లు భారీగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 28 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2.40 లక్షలు, కృష్ణాలో రూ. 2.70 లక్షలు, నెల్లూరులో రూ. 1.10 లక్షలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి మంగళవారం రూ. 55 లక్షలు షేర్, రూ. 90 లక్షలు గ్రాస్ వచ్చింది.

13 రోజులకు ఈ సినిమా ఎంత రాబట్టిందంటే?

13 రోజులకు ఈ సినిమా ఎంత రాబట్టిందంటే?


'జాతి రత్నాలు' అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. ఫలితంగా 1వ రోజు రూ. 3.94 కోట్లు, 2వ రోజు రూ. 2.80 కోట్లు, 3వ రోజు రూ. 4.28 కోట్లు, 4వ రోజు రూ. 5.33 కోట్లు, 5వ రోజు రూ. 2.74 కోట్లు, 6వ రోజు రూ. 2.05 కోట్లు, 7వ రోజు రూ. 1.78 కోట్లు, 8వ రోజు రూ. 1.23 కోట్లు, 9వ రోజు రూ. 1.02, 10వ రోజు రూ. 1.37 కోట్లు, 11వ రోజు 2.15, 12వ రోజు రూ. 1.07 కోట్లు, 13వ రోజు రూ. 55 లక్షలతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 30.38 కోట్లు షేర్, రూ. 48.50 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ‘జాతి రత్నాలు' వసూళ్లిలా

ప్రపంచ వ్యాప్తంగా ‘జాతి రత్నాలు' వసూళ్లిలా


తెలుగు రాష్ట్రాల్లో 13 రోజుల్లో రూ. 30.38 కోట్లు షేర్ వసూలు చేసిన 'జాతి రత్నాలు'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.47 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.85 కోట్లు రాబట్టింది. దీంతో పదమూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 35.70 కోట్లు షేర్‌తో పాటు రూ. 58.70 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. తద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిందీ చిత్రం.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మొత్తం లాభాలెంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మొత్తం లాభాలెంత?

ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 'జాతి రత్నాలు' సినిమా రూ. 10.80 కోట్ల వరకూ బిజినెస్ చేయడంతో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.50 కోట్లుగా నమోదైంది. ఇక, పదమూడు రోజులకు రూ. 35.70 కోట్లు వసూలు అవడంతో ఏకంగా రూ. 24.20 కోట్లు లాభాలను అందుకుని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంటే ఇంకో రూ. 80 లక్షలు వస్తే రూ. 25 కోట్ల మార్క్ అందుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X