Jathi Ratnalu 2 Weeks Collections: దారుణంగా పడిపోయిన కలెక్షన్లు.. ఒక రికార్డు ఈజీ.. ఇంకోటి కష్టమే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో విడుదలయ్యే చిత్రాల్లో కొన్నింటికి మాత్రమే ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన లభిస్తుంటుంది. అందులోనూ కొన్ని సినిమాలకైతే విశేషమైన ఆదరణ లభించడం ద్వారా భారీ విజయాలను సొంతం చేసుకుంటాయి. అలా చిన్న బడ్జెట్‌తో వచ్చి.. పెద్ద హిట్‌గా నిలిచిన చిత్రం 'జాతి రత్నాలు'. పేరున్న ఆర్టిస్టులు లేకున్నా.. కొత్త దర్శకుడైనా ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అదే సమయంలో అత్యధిక కలెక్షన్లు అందుకుంటూ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తోంది. ఇది విడుదలై రెండు వారాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ బాక్సాఫీస్ రిపోర్టు చేస్తే...

ఎరుపు చీరలో కనువిందు చేసిన జాక్వలైన్ ఫెర్నాండేజ్..

వాళ్లంతా ‘జాతి రత్నాలు'.. టాలీవుడ్‌లో హవా

వాళ్లంతా ‘జాతి రత్నాలు'.. టాలీవుడ్‌లో హవా

నవీన్ పోలిశెట్టి - ఫరియా అబ్దుల్లా జంటగా అనుదీప్ కేవీ రూపొందించిన చిత్రమే 'జాతి రత్నాలు'. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్‌పై 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించాడు. రాధన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. రెండు వారాల క్రితం విడుదలైన ఈ చిత్రం హవాను చూపిస్తూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

అంచనాలకు తగ్గట్లుగానే... ప్రీ బిజినెస్ ఎంత?

అంచనాలకు తగ్గట్లుగానే... ప్రీ బిజినెస్ ఎంత?

రిలీజ్‌కు ముందే 'జాతి రత్నాలు' మూవీ ప్రేక్షకులకు చేరువ అవడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. తద్వారా ఇది నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్, కర్నాటక ప్లస్ ఓవర్సీస్ కలిపి రూ. 1.75 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.

అంటీల కనిపించిన జాన్వీ కపూర్.. బొద్దుగా ముద్దుగుమ్మలా

14వ రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?

14వ రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?

14వ రోజు 'జాతి రత్నాలు' కలెక్షన్లు భారీగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 18 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 1.60 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2.10 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి బుధవారం రూ. 37 లక్షలు షేర్, రూ. 65 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది.

14 రోజులకు ఈ సినిమా ఎంత రాబట్టిందంటే?

14 రోజులకు ఈ సినిమా ఎంత రాబట్టిందంటే?

'జాతి రత్నాలు' 1వ రోజు రూ. 3.94 కోట్లు, 2వ రోజు రూ. 2.80 కోట్లు, 3వ రోజు రూ. 4.28 కోట్లు, 4వ రోజు రూ. 5.33 కోట్లు, 5వ రోజు రూ. 2.74 కోట్లు, 6వ రోజు రూ. 2.05 కోట్లు, 7వ రోజు రూ. 1.78 కోట్లు, 8వ రోజు రూ. 1.23 కోట్లు, 9వ రోజు రూ. 1.02, 10వ రోజు రూ. 1.37 కోట్లు, 11వ రోజు 2.15, 12వ రోజు రూ. 1.07 కోట్లు, 13వ రోజు రూ. 55 లక్షలు, 14వ రోజు రూ. 37 లక్షలతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 30.75 కోట్లు షేర్, రూ. 49.15 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

అమీరా దస్తర్ లేటేస్ట్ ఫోటో గ్యాలరీ... మరింత బ్యూటీ డోస్‌తో

ప్రపంచ వ్యాప్తంగా ‘జాతి రత్నాలు' వసూళ్లిలా

ప్రపంచ వ్యాప్తంగా ‘జాతి రత్నాలు' వసూళ్లిలా

తెలుగు రాష్ట్రాల్లో 14 రోజుల్లో రూ. 30.75 కోట్లు షేర్ వసూలు చేసిన 'జాతి రత్నాలు'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.52 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.90 కోట్లు రాబట్టింది. దీంతో పద్నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 36.17 కోట్లు షేర్‌తో పాటు రూ. 59.50 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. తద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిందీ చిత్రం.

Recommended Video

Naveen Polishetty ఎమోషనల్ కామెంట్స్ On Sushant Singh Rajput
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మొత్తం లాభాలెంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మొత్తం లాభాలెంత?

'జాతి రత్నాలు' బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.50 కోట్లుగా నమోదైంది. ఇక, 14 రోజులకు రూ. 36.17 కోట్లు వసూలు అవడంతో ఏకంగా రూ. 24.67 కోట్లు లాభాలను అందుకుంది. ఇంకో రూ. 33 లక్షలు వస్తే రూ. 25 కోట్ల లాభాల మార్కును చేరుతుంది. అలాగే. మరో రూ. 3.83 కోట్లు వస్తే నలభై కోట్ల క్లబ్‌లో చేరుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటి ఈజీ, మరోటి కష్టం అన్నట్లుగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X