Don't Miss!
- News హైదరాబాదు వాసులకు కూల్ న్యూస్.. పలు జిల్లాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు..!
- Sports ఛాంపియన్‌లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
Jathi Ratnalu 15 Days Collections: మరింత పడిపోయిన కలెక్షన్లు.. ఇంకో 5 లక్షలు వస్తే మరో రికార్డు!
డైరెక్టర్ కొత్తే.. పైగా పేరున్న స్టార్లు కూడా లేరు.. అయినప్పటికీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం 'జాతి రత్నాలు'. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి.. పెద్ద హిట్ అయిన ఈ సినిమా విజయవంతంగా రెండు వారాలను పూర్తి చేసుకుంది. అదే సమయంలో ఎన్నో రికార్డులు బద్దలు కొడుతూ.. మైలురాళ్లను చేరుకుంది. తద్వారా టాలీవుడ్ హిస్టరీలోనే బెస్ట్ మూవీల్లో ఒకటిగా నిలిచింది. ఆరంభం నుంచే సత్తా చాటుతూ వచ్చిన 'జాతి రత్నాలు'.. రెండు మూడు రోజులుగా డౌన్ అయిపోయింది. ఇక, ఈ మూవీకి 15 రోజుల్లో వచ్చిన మొత్తం కలెక్షన్లు చూద్దాం పదండి!
టాలీవుడ్ ‘జాతి రత్నాలు’.. అంతా కలిసి సత్తా
నవీన్ పోలిశెట్టి హీరోగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'జాతి రత్నాలు'. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన ఈ సినిమాను అనుదీప్ కేవీ రూపొందించాడు. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించాడు. రాధన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. అనుభవం లేకున్నా భారీ హిట్ కొట్టి నిజమైన జాతి రత్నాలు అనిపించారు.
అంచనాలకు తగ్గట్లుగానే... ప్రీ బిజినెస్ ఎంత?
రిలీజ్‌కు ముందే 'జాతి రత్నాలు' మూవీ ప్రేక్షకులకు చేరువ అవడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. తద్వారా ఇది నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్, కర్నాటక ప్లస్ ఓవర్సీస్ కలిపి రూ. 1.75 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.
15వ రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?
15వ రోజు 'జాతి రత్నాలు' కలెక్షన్లు భారీగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 10 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 1.20 లక్షలు, గుంటూరులో రూ. 1.60 లక్షలు, కృష్ణాలో రూ. 1.80 లక్షలు, నెల్లూరులో రూ. 60 వేలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి గురువారం రూ. 24 లక్షలు షేర్, రూ. 36 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది.
15 రోజులకు ఈ సినిమా ఎంత రాబట్టిందంటే?
'జాతి రత్నాలు' 1వ రోజు రూ. 3.94 కోట్లు, 2వ రోజు రూ. 2.80 కోట్లు, 3వ రోజు రూ. 4.28 కోట్లు, 4వ రోజు రూ. 5.33 కోట్లు, 5వ రోజు రూ. 2.74 కోట్లు, 6వ రోజు రూ. 2.05 కోట్లు, 7వ రోజు రూ. 1.78 కోట్లు, 8వ రోజు రూ. 1.23 కోట్లు, 9వ రోజు రూ. 1.02, 10వ రోజు రూ. 1.37 కోట్లు, 11వ రోజు 2.15, 12వ రోజు రూ. 1.07 కోట్లు, 13వ రోజు రూ. 55 లక్షలు, 14వ రోజు రూ. 37 లక్షలు, 15వ రోజు రూ. 24 లక్షలతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 30.99 కోట్లు షేర్, రూ. 49.51 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ‘జాతి రత్నాలు’ వసూళ్లిలా
తెలుగు
రాష్ట్రాల్లో
15
రోజుల్లో
రూ.
30.99
కోట్లు
షేర్
వసూలు
చేసిన
'జాతి
రత్నాలు'..
కర్నాటక
ప్లస్
రెస్టాఫ్
ఇండియాలో
రూ.
1.53
కోట్లు,
ఓవర్సీస్లో
రూ.
3.93
కోట్లు
రాబట్టింది.
దీంతో
పదిహేను
రోజుల్లో
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
36.45
కోట్లు
షేర్‌తో
పాటు
రూ.
60
కోట్లు
గ్రాస్‌ను
కలెక్ట్
చేసింది.
ఫలితంగా
ఎన్నో
మైలురాళ్లను
చేరుకుంటూ
ఊహించని
రీతిలో
రికార్డులను
బద్దలు
కొట్టేసింది.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మొత్తం లాభాలెంత?
'జాతి రత్నాలు' బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.50 కోట్లుగా నమోదైంది. ఇక, 15 రోజులకు రూ. 36.45 కోట్లు వసూలు అవడంతో ఈ మూవీ ఏకంగా రూ. 24.95 కోట్లు లాభాలను అందుకుంది. ఇంకో రూ. 5 లక్షలు వస్తే రూ. 25 కోట్ల లాభాల మార్కును చేరుతుంది. అదే జరిగితే అరుదైన రికార్డు ఈ మూవీ సొతం అవుతుంది. అలాగే మరో రూ. 3.55 కోట్లు వస్తే నలభై కోట్ల క్లబ్లో చేరుతుంది.