Don't Miss!
- News కావ్య మారన్ ఆస్తులు ఎంతో తెలుసా - ఒక్కరే వారసురాలు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Jathi Ratnalu 16 Days Collections: జాతి రత్నాలు ఖాతాలో మరో రికార్డు.. ఇకపై వాళ్లకు కష్టాలు తప్పవా!
సినిమాలో కంటెంట్ బాగుంటే బడా స్టార్లు ఉండనవసరం లేదు. పేరున్న దర్శకుడూ డీల్ చేయనవసరం లేదు. అన్ని పర్ఫెక్టుగా కుదిరితే ఎలాంటి సినిమాలైనా ప్రేక్షకుల ఆదరణతో సూపర్ డూపర్ హిట్ అవుతాయి. ఇప్పటికే ఈ తరహాలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఇలా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం 'జాతి రత్నాలు'. రెండు వారాల క్రితం విడుదలైన ఈ చిత్రం అప్పటి నుంచి హవాను చూపిస్తూనే ఉంది. ఫలితంగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేయడంతో పాటు కొన్ని మైలురాళ్లను కూడా అధిగమించింది. ఈ మూవీ బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!
సినిమాలోనే కాదు.. బయటా ‘జాతి రత్నాలే'
'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'తో భారీ విజయాన్ని అందుకున్న నవీన్ పోలిశెట్టి తాజాగా నటించిన చిత్రమే 'జాతి రత్నాలు'. అనుదీప్ కేవీ తెరకెక్కించిన ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్‌పై 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించాడు. రాధన్ మ్యూజిక్ ఇచ్చాడు.
అంచనాలకు తగ్గట్లుగానే... ప్రీ బిజినెస్ ఎంత?
రిలీజ్‌కు ముందే 'జాతి రత్నాలు' మూవీ ప్రేక్షకులకు చేరువ అవడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. తద్వారా ఇది నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్, కర్నాటక ప్లస్ ఓవర్సీస్ కలిపి రూ. 1.75 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.
16వ రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?
16వ రోజు 'జాతి రత్నాలు' కలెక్షన్లు మరింత తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1.80 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1.10 లక్షలు, వెస్ట్‌లో రూ. 80 వేలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1.10 లక్షలు, నెల్లూరులో రూ. 40 వేలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి శుక్రవారం రూ. 14 లక్షలు షేర్, రూ. 25 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది.
16 రోజులకు ఈ సినిమా ఎంత రాబట్టిందంటే?
'జాతి రత్నాలు' 1వ రోజు రూ. 3.94 కోట్లు, 2వ రోజు రూ. 2.80 కోట్లు, 3వ రోజు రూ. 4.28 కోట్లు, 4వ రోజు రూ. 5.33 కోట్లు, 5వ రోజు రూ. 2.74 కోట్లు, 6వ రోజు రూ. 2.05 కోట్లు, 7వ రోజు రూ. 1.78 కోట్లు, 8వ రోజు రూ. 1.23 కోట్లు, 9వ రోజు రూ. 1.02, 10వ రోజు రూ. 1.37 కోట్లు, 11వ రోజు 2.15, 12వ రోజు రూ. 1.07 కోట్లు, 13వ రోజు రూ. 55 లక్షలు, 14వ రోజు రూ. 37 లక్షలు, 15వ రోజు రూ. 24 లక్షలు, 16వ రోజు రూ. 14 లక్షలతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 31.13 కోట్లు షేర్, రూ. 49.76 కోట్ల గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ‘జాతి రత్నాలు' వసూళ్లిలా
తెలుగు రాష్ట్రాల్లో 16 రోజుల్లో రూ. 31.13 కోట్లు షేర్ వసూలు చేసిన 'జాతి రత్నాలు'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.55 కోట్లు, ఓవర్సీస్లో రూ. 3.96 కోట్లు రాబట్టింది. దీంతో పదహారు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 36.64 కోట్లు షేర్‌తో పాటు రూ. 60.35 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఫలితంగా ఎన్నో మైలురాళ్లను చేరుకుంటూ ఊహించని రీతిలో రికార్డులను బద్దలు కొట్టేసింది.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మొత్తం లాభాలెంత?
'జాతి రత్నాలు' బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.50 కోట్లుగా నమోదైంది. ఇక, 15 రోజులకు రూ. 36.45 కోట్లు వసూలు అవడంతో ఈ మూవీ ఏకంగా రూ. 25.14 కోట్లు లాభాలను అందుకుంది. తద్వారా రూ. 25 కోట్ల లాభాల మార్కును చేరుకున్న చిత్రంగా రికార్డులకెక్కింది. అలాగే మరో రూ. 3.36 కోట్లు వస్తే నలభై కోట్ల క్లబ్లో చేరుతుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అది కష్టమే అనుకోవచ్చు.