Jathi Ratnalu 18 Days Collections: అనూహ్యంగా పెరిగిన ‘జాతి రత్నాలు’ వసూళ్లు.. మరో రికార్డుకు చేరువ

'జాతి రత్నాలు'.. దాదాపు మూడు వారాలుగా తెలుగు బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తున్న చిత్రమిది. ఆరంభంలో ఏమాత్రం అంచనాలు లేవు. కానీ, టీజర్, ట్రైలర్ ఎప్పుడైతే వచ్చాయో.. అప్పటి నుంచి ఈ సినిమా గురించే అందరూ మాట్లాడుకున్నారు. దీనికితోడు ప్రమోషన్ పీక్స్‌లోకి వెళ్లడంతో ఈ మూవీపై బజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని నమోదు చేసింది. తద్వారా భారీగా కలెక్షన్లనూ రాబడుతూ సత్తా చాటుతోంది. ఇక, ఆదివారం మరోసారి పుంజుకుని మైలురాయికి చేరువైంది. ఆ వివరాలు మీకోసం!

భిన్న భంగిమలు.. నైనా గంగూలి అందాల విందు అదరహో

వాళ్లందరూ నిజమైన ‘జాతి రత్నాలు' అనేలా

వాళ్లందరూ నిజమైన ‘జాతి రత్నాలు' అనేలా

టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి - ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం 'జాతి రత్నాలు'. అనుదీప్ కేవీ రూపొందించిన ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్‌పై 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించాడు. రాధన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇది చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.

అంచనాలకు తగ్గట్లుగానే... ప్రీ బిజినెస్ ఎంత?

అంచనాలకు తగ్గట్లుగానే... ప్రీ బిజినెస్ ఎంత?

రిలీజ్‌కు ముందే 'జాతి రత్నాలు' మూవీ ప్రేక్షకులకు చేరువ అవడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. తద్వారా ఇది నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్, కర్నాటక ప్లస్ ఓవర్సీస్ కలిపి రూ. 1.75 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.

బికినీలో అందాల ఆరబోత.. జారా ఎస్మిన్ రచ్చ

18వ రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?

18వ రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?

18వ రోజు 'జాతి రత్నాలు' కలెక్షన్లు మరోసారి పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 18 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 1.80 లక్షలు, గుంటూరులో రూ. 2.30 లక్షలు, కృష్ణాలో రూ. 2.60 లక్షలు, నెల్లూరులో రూ. 1.20 లక్షలతో రెండు రాష్ట్రాల్లో కలిపి ఆదివారం రూ. 42 లక్షలు షేర్, రూ. 75 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది.

18 రోజులకు ఈ సినిమా ఎంత రాబట్టిందంటే?

18 రోజులకు ఈ సినిమా ఎంత రాబట్టిందంటే?

'జాతి రత్నాలు' 1వ రోజు రూ. 3.94 కోట్లు, 2వ రోజు రూ. 2.80 కోట్లు, 3వ రోజు రూ. 4.28 కోట్లు, 4వ రోజు రూ. 5.33 కోట్లు, 5వ రోజు రూ. 2.74 కోట్లు, 6వ రోజు రూ. 2.05 కోట్లు, 7వ రోజు రూ. 1.78 కోట్లు, 8వ రోజు రూ. 1.23 కోట్లు, 9వ రోజు రూ. 1.02, 10వ రోజు రూ. 1.37 కోట్లు, 11వ రోజు 2.15, 12వ రోజు రూ. 1.07 కోట్లు, 13వ రోజు రూ. 55 లక్షలు, 14వ రోజు రూ. 37 లక్షలు, 15వ రోజు రూ. 24 లక్షలు, 16వ రోజు రూ. 14 లక్షలు, 17వ రోజు రూ. 23 లక్షలు, 18వ రోజు రూ. 42 లక్షలతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 31.78 కోట్లు షేర్, రూ. 50.90 కోట్ల గ్రాస్‌ వచ్చింది.

పొట్టి బట్టల్లో రచ్చ.. ఆహానా కుమ్రా పిక్స్ వైరల్

ప్రపంచ వ్యాప్తంగా ‘జాతి రత్నాలు' వసూళ్లిలా

ప్రపంచ వ్యాప్తంగా ‘జాతి రత్నాలు' వసూళ్లిలా

తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల్లో రూ. 31.78 కోట్లు షేర్ వసూలు చేసిన 'జాతి రత్నాలు'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.58 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.10 కోట్లు రాబట్టింది. దీంతో పద్దెనిమిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 37.46 కోట్లు షేర్‌తో పాటు రూ. 62 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఫలితంగా ఎన్నో మైలురాళ్లను చేరుకుంటూ ఊహించని రీతిలో రికార్డులను బద్దలు కొట్టేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మొత్తం లాభాలెంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మొత్తం లాభాలెంత?

'జాతి రత్నాలు' బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.50 కోట్లుగా నమోదైంది. ఇక, 18 రోజులకు రూ. 37.46 కోట్లు వసూలు అవడంతో ఈ మూవీ ఏకంగా రూ. 25.96 కోట్లు లాభాలను అందుకుంది. తద్వారా రూ. 25 కోట్ల లాభాల మార్కును చేరుకున్న చిత్రంగా రికార్డులకెక్కింది. అలాగే మరో రూ. 2.54 కోట్లు వస్తే నలభై కోట్ల క్లబ్‌లో చేరుతుంది. ఇదే జరిగితే మరో రికార్డు క్రియేట్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X