Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Jathi Ratnalu 19 Days Collections: మరో ఘనతను అందుకున్న మూవీ.. నిన్నటికి ఎంత లాభం వచ్చిందంటే!
తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవలి కాలంలో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య ఎన్నో చిత్రాలు ఘన విజయాలు అందుకున్నాయి. అందులో కొన్నైతే భారీ స్థాయిలో లాభాలను అందుకుని సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాయి. అలాంటి వాటిలో 'జాతి రత్నాలు' ఒకటి. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న ఇది ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. తద్వారా టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఇలాంటి ఈ సినిమా సోమవారం మరో అరుదైన ఘనతను అందుకుంది. మొత్తంగా ఈ మూవీ బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!
నటీనటులు.. డైరెక్టర్.. నిర్మాత ‘జాతి రత్నాలు'
టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి - ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం 'జాతి రత్నాలు'. అనుదీప్ కేవీ రూపొందించిన ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్‌పై 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించాడు. రాధన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇది చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.
అంచనాలకు తగ్గట్లుగానే... ప్రీ బిజినెస్ ఎంత?
రిలీజ్‌కు ముందే 'జాతి రత్నాలు' మూవీ ప్రేక్షకులకు చేరువ అవడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. తద్వారా ఇది నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్, కర్నాటక ప్లస్ ఓవర్సీస్ కలిపి రూ. 1.75 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.
19వ రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?
19వ రోజు 'జాతి రత్నాలు' కలెక్షన్లు మరోసారి బాగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 11 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1.20 లక్షలు, కృష్ణాలో రూ. 1.40 లక్షలు, నెల్లూరులో రూ. 60 వేలతో రెండు రాష్ట్రాల్లో కలిపి సోమవారం రూ. 25 లక్షలు షేర్, రూ. 40 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది.
19 రోజులకు ఈ సినిమా ఎంత రాబట్టిందంటే?
'జాతి రత్నాలు' 1వ రోజు రూ. 3.94 కోట్లు, 2వ రోజు రూ. 2.80 కోట్లు, 3వ రోజు రూ. 4.28 కోట్లు, 4వ రోజు రూ. 5.33 కోట్లు, 5వ రోజు రూ. 2.74 కోట్లు, 6వ రోజు రూ. 2.05 కోట్లు, 7వ రోజు రూ. 1.78 కోట్లు, 8వ రోజు రూ. 1.23 కోట్లు, 9వ రోజు రూ. 1.02, 10వ రోజు రూ. 1.37 కోట్లు, 11వ రోజు 2.15, 12వ రోజు రూ. 1.07 కోట్లు, 13వ రోజు రూ. 55 లక్షలు, 14వ రోజు రూ. 37 లక్షలు, 15వ రోజు రూ. 24 లక్షలు, 16వ రోజు రూ. 14 లక్షలు, 17వ రోజు రూ. 23 లక్షలు, 18వ రోజు రూ. 42 లక్షలు, 19వ రోజు రూ. 25 లక్షలతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 32.03 కోట్లు షేర్, రూ. 51.03 కోట్ల గ్రాస్ రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ‘జాతి రత్నాలు' వసూళ్లిలా
తెలుగు
రాష్ట్రాల్లో
19
రోజుల్లో
రూ.
31.78
కోట్లు
షేర్
వసూలు
చేసిన
'జాతి
రత్నాలు'..
కర్నాటక
ప్లస్
రెస్టాఫ్
ఇండియాలో
రూ.
1.60
కోట్లు,
ఓవర్సీస్లో
రూ.
4.14
కోట్లు
రాబట్టింది.
దీంతో
19
రోజుల్లో
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
37.77
కోట్లు
షేర్‌తో
పాటు
రూ.
62.60
కోట్లు
గ్రాస్‌ను
వసూలు
చేసింది.
ఫలితంగా
ఎన్నో
మైలురాళ్లను
చేరుకుంటూ
ఊహించని
రీతిలో
రికార్డులను
బద్దలు
కొట్టేసింది.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మొత్తం లాభాలెంత?
'జాతి రత్నాలు' బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.50 కోట్లుగా నమోదైంది. ఇక, 19 రోజులకు రూ. 37.77 కోట్లు వసూలు అవడంతో ఈ మూవీ ఏకంగా రూ. 26.27 కోట్లు లాభాలను అందుకుంది. తద్వారా రూ. 26 కోట్ల లాభాల మార్కును చేరుకున్న చిత్రంగా రికార్డులకెక్కింది. అలాగే మరో రూ. 2.23 కోట్లు వస్తే నలభై కోట్ల క్లబ్లో చేరుతుంది. ఇదే జరిగితే మరో రికార్డు క్రియేట్ అవుతుంది.