twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jathi Ratnalu 25 Days Collections: టార్గెట్ 11.50 కోట్లు.. వచ్చింది అంత.. ఆ రికార్డును చేరకుండానే!

    |

    చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు దేనినైనా బాగుంటే ఆదరిస్తున్నారు. లేదంటే రిజెక్ట్ చేస్తున్నారు. ఈ కారణంగానే కంటెంట్ బాగున్న సినిమాలే సూపర్ సక్సెస్ అవుతున్నాయి. సరికొత్తగా చేసిన చిత్రాలే విజయాల బాట పడుతున్నారు. ఇలాగే ఇటీవలి కాలంలో భారీ హిట్ అయిన చిత్రం 'జాతి రత్నాలు'. గత నెలలో విడుదలైన ఈ మూవీ ఊహించని రీతిలో విజయాన్ని అందుకుంది. కలెక్షన్లనూ అదే రీతిలో వసూలు చేసింది. నిన్నటితో ఈ చిత్రం 25 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బాక్సాఫీస్ రిపోర్టును పరిశీలిస్తే...

    ‘జాతి రత్నాలు’కు నిజమైన అర్థం చెబుతూనే

    ‘జాతి రత్నాలు’కు నిజమైన అర్థం చెబుతూనే

    టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి - ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం 'జాతి రత్నాలు'. అనుదీప్ కేవీ రూపొందించిన ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్‌పై 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించాడు. రాధన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇది చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.

    అంచనాలకు తగ్గట్లుగానే... ప్రీ బిజినెస్ ఎంత?

    అంచనాలకు తగ్గట్లుగానే... ప్రీ బిజినెస్ ఎంత?

    రిలీజ్‌కు ముందే 'జాతి రత్నాలు' మూవీ ప్రేక్షకులకు చేరువ అవడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. తద్వారా ఇది నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్, కర్నాటక ప్లస్ ఓవర్సీస్ కలిపి రూ. 1.75 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.

    25 రోజులకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత రాబట్టింది?

    25 రోజులకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత రాబట్టింది?


    25 రోజులకు 'జాతి రత్నాలు' మంచి స్పందనతో రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 15.96 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.26 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.95 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.92 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.52 కోట్లు, గుంటూరులో రూ. 2.08 కోట్లు, కృష్ణాలో రూ. 1.84 కోట్లు, నెల్లూరులో రూ. 91 లక్షలతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 32.44 కోట్లు షేర్, రూ. 52.05 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

    ప్రపంచ వ్యాప్తంగా ‘జాతి రత్నాలు’ వసూళ్లిలా

    ప్రపంచ వ్యాప్తంగా ‘జాతి రత్నాలు’ వసూళ్లిలా

    తెలుగు రాష్ట్రాల్లో 25 రోజుల్లో రూ. 32.44 కోట్లు షేర్ వసూలు చేసిన 'జాతి రత్నాలు'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.71 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.25 కోట్లు రాబట్టింది. దీంతో 25 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.40 కోట్లు షేర్‌తో పాటు రూ. 63.85 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఫలితంగా ఎన్నో మైలురాళ్లను చేరుతూ ఊహించని రీతిలో రికార్డులను బద్దలు కొట్టేసింది.

    బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మొత్తం లాభాలెంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మొత్తం లాభాలెంత?


    'జాతి రత్నాలు' మూవీ రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.50 కోట్లుగా నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా 25 రోజులకు రూ. 38.40 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇధి ఏకంగా రూ. 26.90 కోట్లు లాభాలను అందుకుంది. తద్వారా రూ. 26 కోట్ల లాభాల మార్కును చేరుకున్న చిత్రంగా రికార్డులకెక్కింది.

    ఆ రికార్డును చేరకుండానే.. ముగింపు దిశగా

    ఆ రికార్డును చేరకుండానే.. ముగింపు దిశగా


    'జాతి రత్నాలు' మూవీ దాదాపు మూడు వారాల పాటు హవాను చూపించింది. మధ్యలో ఎన్ని సినిమాలు విడుదలైనా సత్తా చాటుతూనే వచ్చింది. ఫలితంగా భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.40 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇది నలభై కోట్ల మార్కును కూడా చేరుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఆ మైలురాయికి రూ. 1.60 కోట్ల దూరంలోనే నిలిచిపోయింది.

    English summary
    Jathi Ratnalu is an upcoming Indian Telugu-language comedy-drama film written and directed by Anudeep KV. The film starring Naveen Polishetty, Faria Abdullah, Priyadarshi, and Rahul Ramakrishna is produced by Nag Ashwin under the banner Swapna Cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X