Jathi Ratnalu 3days Collections: టార్గెట్ ఫినీష్.. ఉప్పెనకు షాక్.. మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు!
లాక్‌డౌన్ తర్వాత గ్రాండ్‌గానే మొదలైంది తెలుగు సినిమా. 2020లా కాకుండా ఈ ఏడాది టాలీవుడ్‌కు బాగా కలిసొచ్చేలానే ఉంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు విజయాలను అందుకోవడంతో పాటు కలెక్షన్ల పంట పడించాయి. ఇక, ఈ శుక్రవారం విడుదలైన 'జాతి రత్నాలు' కూడా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. కేవలం మూడు రోజుల్లోనే టార్గెట్‌ను ఫినీష్ చేసిన ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. అదే సమయంలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన మొట్టమొదటి ఇండియన్ సినిమానూ ఇది అరుదైన ఘనతను అందుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!
చీరకట్టు అందాలతో అనసూయ భరద్వాజ్: స్టేజీపై డాన్స్ (ఫొటోలు)

టాలీవుడ్‌లో ‘జాతి రత్నాలు' అనిపించుకునేలా
'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' వంటి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నటించిన చిత్రం 'జాతి రత్నాలు'. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. కొత్త దర్శకుడు అనుదీప్ కేవీ రూపొందించిన ఈ చిత్రం ద్వారా మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా మారాడు. రాధన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

షాకింగ్‌గా బిజినెస్.. ఎక్కడ? ఎంత? జరిగింది?
పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌ల కారణంగా 'జాతి రత్నాలు'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్, కర్నాటక ప్లస్ ఓవర్సీస్ కలిపి రూ. 1.75 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.

మూడో రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?
మూడో రోజు 'జాతి రత్నాలు'కు భారీ ప్రభావాన్ని చూపింది. ఫలితంగా నైజాంలో రూ. 1.88 కోట్లు, సీడెడ్‌లో రూ. 52 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 64 లక్షలు, ఈస్ట్‌లో రూ. 26 లక్షలు, వెస్ట్‌లో రూ. 24 లక్షలు, గుంటూరులో రూ. 32 లక్షలు, కృష్ణాలో రూ. 29 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి శనివారం రూ. 4.28 కోట్లు షేర్, రూ. 7.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

మూడు రోజులకు ఈ సినిమా ఎంత రాబట్టింది?
మొదటి రోజే మంచి టాక్‌తో సత్తా చాటిన 'జాతి రత్నాలు' తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఫలితంగా మొదటి రోజు రూ. 3.94 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం రూ. 2.80 కోట్లు రాబట్టింది. ఇక, మూడో రోజు ఏకంగా రూ. 4.28 కోట్లు కలెక్ట్ చేసింది. తద్వారా మూడు రోజుల్లోనే రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 11.19 కోట్లు షేర్, రూ. 19.05 కోట్ల గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ‘జాతి రత్నాలు' కలెక్షన్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో కలిపి రూ. 11.19 కోట్లు షేర్ వసూలు చేసిన 'జాతి రత్నాలు'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 48 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.80 కోట్లు రాబట్టింది. దీంతో మూడు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.47 కోట్లు షేర్‌తో పాటు రూ. 23.50 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. తద్వారా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇప్పటికి ఎంతంటే?
ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 'జాతి రత్నాలు' సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకోవడంతో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.50 కోట్లుగా నమోదైంది. ఇక, మూడు రోజులకు రూ. 14.47 కోట్లు వసూలు అవడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కేవలం మూడు రోజుల్లోనే ఫినీష్ చేసేసిందీ చిత్రం. అంతేకాదు, అప్పుడే ఏకంగా రూ. 2.97 కోట్లు లాభాలను అందుకుంది.

మొదటి ఇండియన్ సినిమాగా సరికొత్త రికార్డు
మూడో రోజు అనూహ్యంగా కలెక్షన్లు సాధించిన 'జాతి రత్నాలు' ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడం ద్వారా ఈ ఏడాది ఏడో హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత అమెరికాలో హాఫ్ మిలియన్ మార్కును దాటేసి.. లాక్‌డౌన్ తర్వాత ఈ రేంజ్ కలెక్షన్లు అందుకున్న తొలి సినిమాగా రికార్డు సాధించింది. దీంతో ఇప్పటి వరకూ 'ఉప్పెన' పేరిట ఉన్న ఘనత కనుమరుగైంది.

ఆ చిత్రాల జాబితాలో నాలుగో స్థానం సొంతం
ఇక, మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 4.28 కోట్లు వసూలు చేయడంతో 'జాతి రత్నాలు' అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. విడుదలైన మూడో రోజున ఎక్కువ కలెక్ట్ చేసిన చిత్రాల జాబితాలో ఇది నాలుగో స్థానంలో నిలిచింది. దీని కంటే ముందు 'ఉప్పెన' (రూ. 8.26 కోట్ల) ఇస్మార్ట్ శంకర్ (రూ. 4.32 కోట్లు), భీష్మ (రూ. 4.31 కోట్ల) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











