Jathi Ratnalu 4days Collections: టాలీవుడ్‌లో సంచలనం.. చరిత్ర సృష్టించిన ‘రత్నాలు’.. ఇదే ఫస్ట్ మూవీ!
'జాతి రత్నాలు'.. పేరుకు చిన్న సినిమా.. కానీ ప్రమోషన్ మాత్రం చాలా గ్రాండ్‌గా జరిగింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారు దర్శక నిర్మాతలు. ఇప్పుడదే బాగా ప్లస్ అయింది. ఫలితంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో గతంలో ఏ సినిమాకూ సాధ్యం కాని విధంగా కలెక్షన్లు అందుకుంటూ దూసుకుపోతోందీ చిత్రం. అంతేకాదు, ఎన్నో మైలురాళ్లను చేరుకుంటూ.. రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఫలితంగా నాలుగు రోజుల్లోనే అత్యధికంగా వసూళ్లు రాబట్టి సత్తాను నిరూపించుకుంది. 'జాతి రత్నాలు' బాక్సాఫీస్ రిపోర్టులు చూద్దాం పదండి!

నిజంగానే ‘జాతి రత్నాలు’ అనిపించుకున్నారు
యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన తాజా చిత్రం 'జాతి రత్నాలు'. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. కొత్త దర్శకుడు అనుదీప్ కేవీ రూపొందించిన ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా మారాడు. రాధన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ విజయంతో అంతా రత్నాలు అనిపించుకున్నారు.

షాకింగ్‌గా బిజినెస్.. ఎక్కడ? ఎంత? జరిగింది?
పలు కారణాల వల్ల 'జాతి రత్నాలు' మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్, కర్నాటక ప్లస్ ఓవర్సీస్ కలిపి రూ. 1.75 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.

నాలుగో రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?
నాలుగో రోజు 'జాతి రత్నాలు'కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.61 కోట్లు, సీడెడ్‌లో రూ. 68 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 71 లక్షలు, ఈస్ట్‌లో రూ. 27 లక్షలు, వెస్ట్‌లో రూ. 24 లక్షలు, గుంటూరులో రూ. 36 లక్షలు, కృష్ణాలో రూ. 32 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షలతో ఏపీ, తెలంగాణలో కలిపి ఆదివారం రూ. 5.33 కోట్లు షేర్, రూ. 8.22 కోట్లు గ్రాస్ వచ్చింది.

నాలుగు రోజులకు ఈ సినిమా ఎంత రాబట్టింది?
ప్రీమియర్స్ నుంచే మంచి టాక్‌తో సత్తా చాటిన 'జాతి రత్నాలు' తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఫలితంగా మొదటి రోజు రూ. 3.94 కోట్లు, రెండో రోజు రూ. 2.80 కోట్లు, మూడో రోజు రూ. 4.28 కోట్లు, నాలుగో రోజు రూ. 5.33 కోట్లు కలెక్ట్ చేసింది. తద్వారా నాలుగు రోజుల్లోనే రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 16.52 కోట్లు షేర్, రూ. 27 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ‘జాతి రత్నాలు’ కలెక్షన్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో కలిపి రూ. 11.19 కోట్లు షేర్ వసూలు చేసిన 'జాతి రత్నాలు'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 61 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 3.31 కోట్లు రాబట్టింది. దీంతో నాలుగు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 20.44 కోట్లు షేర్‌తో పాటు రూ. 34.60 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. తద్వారా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? లాభాలు ఏ రేంజ్‌లో?
ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 'జాతి రత్నాలు' సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకోవడంతో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.50 కోట్లుగా నమోదైంది. ఇక, నాలుగు రోజులకు రూ. 20.44 కోట్లు వసూలు అవడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేయడంతో పాటు అప్పుడే ఏకంగా రూ. 8.94 కోట్లు లాభాలను అందుకుని ఎన్నో రికార్డులను క్రియేట్ చేసేసింది.

టాలీవుడ్‌లోనే ఎకైక సినిమాగా చరిత్ర సృష్టించి
నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 5.33 కోట్లు వసూలు చేయడంతో 'జాతి రత్నాలు' అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. విడుదలైన నాలుగో రోజున ఎక్కువ కలెక్ట్ చేసిన మీడియం రేంజ్ చిత్రాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. తద్వారా 'ఇస్మార్ట్ శంకర్' పేరిట ఉన్న రూ. 4.81 కోట్ల రికార్డు కనుమరుగైంది. మూడో స్థానంలో 'ఉప్పెన' (రూ. 4.17 కోట్లు) ఉంది.


Click it and Unblock the Notifications











