Jathi Ratnalu 6 Days collections: జాతి రత్నాలు రికార్డు కలెక్షన్లు.. 6 రోజుల్లో ఎంత లాభం వచ్చిందంటే!

బడా బడా స్టార్లు లేరు.. పెద్ద దర్శకుడూ కాదు.. నిర్మాత కూడా కొత్తే.. అయితేనేం భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుని బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది 'జాతి రత్నాలు' మూవీ. పేరున్న సినిమా కాకున్నా ప్రేక్షకులను థియేటర్లలోకి రాబట్టడంతో పాటు రెండు గంటల పాటు కడుపుబ్బా నవ్విస్తోన్న ఈ చిత్రం ఊహకందని కలెక్షన్లతో దూసుకుపోతోంది. తద్వారా ఎన్నో రికార్డులను బద్దలు కొడుతోంది. రోజులు మారుతున్నా.. కలెక్షన్లు రేంజ్ మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ సినిమాకు ఆరో రోజు కూడా మంచి ఆదరణే లభించింది. ఇక, ఈ మూవీ బాక్సాఫీస్ రిపోర్టును పరిశీలిస్తే...

టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిన ‘జాతి రత్నాలు'

టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిన ‘జాతి రత్నాలు'

'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' తన సత్తాను నిరూపించుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ కేవీ తెరకెక్కించిన చిత్రం 'జాతి రత్నాలు'. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా మారాడు. రాధన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ చిత్రం ట్రెండ్ సెట్ చేసింది.

అంచనాలకు తగ్గట్లే బిజినెస్... ఎక్కడ? ఎంత?

అంచనాలకు తగ్గట్లే బిజినెస్... ఎక్కడ? ఎంత?

వినూత్న ప్రమోషన్, టీజర్, ట్రైలర్ కారణంగా 'జాతి రత్నాలు' మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తద్వారా ఇది నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్, కర్నాటక ప్లస్ ఓవర్సీస్ కలిపి రూ. 1.75 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.

ఆరో రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?

ఆరో రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?

నాలుగో రోజు కూడా 'జాతి రత్నాలు' మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.24 కోట్లు, సీడెడ్‌లో రూ. 22 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 21 లక్షలు, ఈస్ట్‌లో రూ. 9.80 లక్షలు, వెస్ట్‌లో రూ. 7.40 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో ఏపీ, తెలంగాణలో కలిపి మంగళవారం రూ. 2.05 కోట్లు షేర్, రూ. 3.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఆరు రోజులకు ఈ సినిమా ఎంత రాబట్టింది?

ఆరు రోజులకు ఈ సినిమా ఎంత రాబట్టింది?

'జాతి రత్నాలు' తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఫలితంగా మొదటి రోజు రూ. 3.94 కోట్లు, రెండో రోజు రూ. 2.80 కోట్లు, మూడో రోజు రూ. 4.28 కోట్లు, నాలుగో రోజు రూ. 5.33 కోట్లు, ఐదో రోజు రూ. 2.74 కోట్లు, ఆరో రోజు రూ. 2.05 కోట్లు కలెక్ట్ చేసింది. తద్వారా ఆరు రోజుల్లోనే రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 21.31 కోట్లు షేర్, రూ. 34.30 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ‘జాతి రత్నాలు' కలెక్షన్లు

ప్రపంచ వ్యాప్తంగా ‘జాతి రత్నాలు' కలెక్షన్లు

తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజుల్లో కలిపి రూ. 21.31 కోట్లు షేర్ వసూలు చేసిన 'జాతి రత్నాలు'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.40 కోట్లు రాబట్టింది. దీంతో ఆరు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 25.81 కోట్లు షేర్‌తో పాటు రూ. 43 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. తద్వారా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.

 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 'జాతి రత్నాలు' సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకోవడంతో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఆరు రోజులకు రూ. 25.81 కోట్లు వసూలు అవడంతో బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను పూర్తి చేయడంతో పాటు అప్పుడే ఏకంగా రూ. 14.31 కోట్లు లాభాలను అందుకుని ఎన్నో రికార్డులను క్రియేట్ చేసేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X