Jathi Ratnalu 8Days Collections: రికార్డుకు చేరువలో ‘జాతి రత్నాలు’.. మొత్తం వచ్చిన లాభాలు ఎంతంటే!

ఏ భాషలోనైనా హాస్య ప్రధానమైన చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. తెలుగులో ఈ తరహాలో వచ్చే సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో మూవీలు కామెడీ ప్రధానంగా వచ్చి రికార్డులు క్రియేట్ చేశాయి. ఇప్పుడా జాబితాలోకే వచ్చి చేరిన చిత్రం 'జాతి రత్నాలు'. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇది.. భారీ స్థాయిలో స్పందనను అందుకుంటూ దూసుకుపోతోంది. తద్వారా కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్లను సాధిస్తోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌ను సైతం దాటేసి లాభాల బాట పట్టింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా 8 రోజుల రిపోర్టు మీకోసం!

జాతి రత్నాలు సక్సెస్ మీట్: నవీన్ పోలిశెట్టి హ్యాపీ (ఫొటోలు)

టాలీవుడ్ ‘జాతి రత్నాలు'.. సూపర్ డూపర్ హిట్

టాలీవుడ్ ‘జాతి రత్నాలు'.. సూపర్ డూపర్ హిట్

నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జాతి రత్నాలు'. అనుదీప్ కేవీ తెరకెక్కించిన సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ద్వారా 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా మారాడు. రాధన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. కామెడీతో కబుపుబ్బా నవిస్తూ సందడి చేస్తోన్న ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది.

పెరిగిన అంచనాలు... ప్రీ బిజినెస్ ఎక్కడ? ఎంత?

పెరిగిన అంచనాలు... ప్రీ బిజినెస్ ఎక్కడ? ఎంత?

వినూత్న ప్రమోషన్, టీజర్, ట్రైలర్ కారణంగా 'జాతి రత్నాలు' మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తద్వారా ఇది నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్, కర్నాటక ప్లస్ ఓవర్సీస్ కలిపి రూ. 1.75 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.

హీరో కార్తికేయ లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్.. చావు కబురు చల్లగా సక్సెస్‌పై కన్నేసిన యువ హీరో (ఫొటోలు)

ఎనిమిదో రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?

ఎనిమిదో రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?

ఎనిమిదో రోజు కూడా 'జాతి రత్నాలు' మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 76 లక్షలు, సీడెడ్‌లో రూ. 15 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 13 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 4.80 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో ఏపీ, తెలంగాణలో కలిపి గురువారం రూ. 1.23 కోట్లు షేర్, రూ. 1.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఎనిమిది రోజులకు ఈ సినిమా ఎంత రాబట్టింది?

ఎనిమిది రోజులకు ఈ సినిమా ఎంత రాబట్టింది?

'జాతి రత్నాలు' అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఫలితంగా మొదటి రోజు రూ. 3.94 కోట్లు, రెండో రోజు రూ. 2.80 కోట్లు, మూడో రోజు రూ. 4.28 కోట్లు, నాలుగో రోజు రూ. 5.33 కోట్లు, ఐదో రోజు రూ. 2.74 కోట్లు, ఆరో రోజు రూ. 2.05 కోట్లు, ఏడో రోజు రూ. 1.78 కోట్లు, ఎనిమిదో రోజు రూ. 1.23 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 24.32 కోట్లు షేర్, రూ. 38.80 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

అదిరిపోయేలా టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి ఇల్లు: ఇన్సైడ్ (ఫొటోస్)

ప్రపంచ వ్యాప్తంగా ‘జాతి రత్నాలు' కలెక్షన్లు ఎలా?

ప్రపంచ వ్యాప్తంగా ‘జాతి రత్నాలు' కలెక్షన్లు ఎలా?

తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది రోజుల్లో రూ. 24.32 కోట్లు షేర్ వసూలు చేసిన 'జాతి రత్నాలు'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.23 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.48 కోట్లు రాబట్టింది. దీంతో 8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 29.03 కోట్లు షేర్‌తో పాటు రూ. 48 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. తద్వారా యాభై కోట్ల మార్కుకు చేరువైంది. అలాగే, షేర్ కూడా ముప్పై కోట్లకు దగ్గరైంది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మొత్తం లాభాలు ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మొత్తం లాభాలు ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 'జాతి రత్నాలు' సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకోవడంతో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఏడు రోజులకు రూ. 29.03 కోట్లు వసూలు అవడంతో బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను పూర్తి చేయడంతో పాటు అప్పుడే ఏకంగా రూ. 17.53 కోట్లు లాభాలను అందుకుని బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X