Jathi Ratnalu 9Days Collections: ఆ సినిమాలకు దెబ్బ కొట్టిన జాతి రత్నాలు.. అరుదైన రికార్డు సొంతం!
చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాలను అందుకున్న చిత్రాలు తెలుగులో చాలానే ఉన్నాయి. టాక్ పరంగా, కలెక్షన్ల పరంగా సత్తా చాటి ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాయి. ఇప్పుడా జాబితాలోకే వచ్చి చేరింది 'జాతి రత్నాలు' మూవీ. పెద్ద స్టార్లు లేకపోయినా.. పేరున్న దర్శకుడు కాకపోయినా ప్రేక్షకుల ఆదరణను అందుకోవడంలో ఈ మూవీ సక్సెస్ అయింది. ఈ కారణంగానే భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతూ ఎన్నో మైలురాళ్లను చేరుకుని రికార్డులను బద్దలు కొట్టింది. ఇలా 9వ రోజు కూడా సత్తా చాటుతూ మిగిలిన చిత్రాలకు దెబ్బేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!

అలా వచ్చిన ‘జాతి రత్నాలు'... కొత్త వాళ్ల సత్తా
అనుదీప్ కేవీ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'జాతి రత్నాలు'. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించాడు. రాధన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. కొత్త వాళ్లైనా సత్తా చాటడంతో ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఫలితంగా కలెక్షన్లూ మంచిగా వస్తున్నాయి.

పెరిగిన అంచనాలు... ప్రీ బిజినెస్ ఎక్కడ? ఎంత?
వినూత్న ప్రమోషన్, టీజర్, ట్రైలర్ కారణంగా 'జాతి రత్నాలు' మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తద్వారా ఇది నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్, కర్నాటక ప్లస్ ఓవర్సీస్ కలిపి రూ. 1.75 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.

ఎనిమిదో రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?
తొమ్మిదో రోజు కూడా 'జాతి రత్నాలు' మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 68 లక్షలు, సీడెడ్‌లో రూ. 11 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి శుక్రవారం రూ. 1.02 కోట్లు షేర్, రూ. 1.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఎనిమిది రోజులకు ఈ సినిమా ఎంత రాబట్టింది?
'జాతి రత్నాలు' అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. ఫలితంగా 1వ రోజు రూ. 3.94 కోట్లు, 2వ రోజు రూ. 2.80 కోట్లు, 3వ రోజు రూ. 4.28 కోట్లు, 4వ రోజు రూ. 5.33 కోట్లు, 5వ రోజు రూ. 2.74 కోట్లు, 6వ రోజు రూ. 2.05 కోట్లు, 7వ రోజు రూ. 1.78 కోట్లు, 8వ రోజు రూ. 1.23 కోట్లు, 9వ రోజు రూ. 1.02 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 25.34 కోట్లు షేర్, రూ. 40.30 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ‘జాతి రత్నాలు' కలెక్షన్లు ఎలా?
తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది రోజుల్లో రూ. 25.34 కోట్లు షేర్ వసూలు చేసిన 'జాతి రత్నాలు'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.28 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.52 కోట్లు రాబట్టింది. దీంతో 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 30.14 కోట్లు షేర్‌తో పాటు రూ. 49.65 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. తద్వారా ఈ శుక్రవారం విడుదలైన కొత్త సినిమాలకూ సైతం భారీ దెబ్బను కొట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మొత్తం లాభాలు ఎంత?
ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 'జాతి రత్నాలు' సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకోవడంతో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఏడు రోజులకు రూ. 30.14 కోట్లు వసూలు అవడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేయడంతో పాటు అప్పుడే ఏకంగా రూ. 18.64 కోట్లు లాభాలను అందుకుని బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications











