twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jathi Ratnalu US collections: అమెరికాలో దుమ్మురేపుతున్న జాతిరత్నాలు... రికార్డు దిశగా కలెక్షన్లు

    |

    కంటెంట్, బడ్జెట్ పరంగా చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాతిరత్నాలు చిత్రం విదేశీ గడ్డపై భారీగా వసూళ్లను రాబడుతున్నది. ట్రేడ్ పండితులను, సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తూ కలెక్షన్లను నమోదు చేస్తున్నది. తొలి వారాంతంలో షాకింగ్‌గా వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం యూఎస్‌లో ఎంత కలెక్షన్లు రాబట్టిందంటే..

    తొలి రోజు ప్రీమియర్లతో

    తొలి రోజు ప్రీమియర్లతో

    అమెరికా బాక్సాఫీస్ వద్ద జాతి రత్నాలు తొలి ఆట నుంచే మంచి టాక్‌తో దూసుకెళ్తున్నది. ప్రీమియర్ల ద్వారా ఈ చిత్రం 133322 డాలర్లు వసూలు చేసింది. అలాగే గురువారం 97,803 డాలర్లు రాబట్టింది. దాంతో మొత్తంగా తొలి రోజు 231,135 డాలర్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలను షాక్ గురి చేసింది.

    రెండో రోజున కలెక్షన్ల హంగామా

    రెండో రోజున కలెక్షన్ల హంగామా

    ఇక తొలి రోజు తర్వాత జాతి రత్నాలు దూకుడు అంతే జోరుతో కొనసాగింది. శుక్రవారం రోజున 120 లోకేషన్లలో 152,500 డాలర్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం అమెరికా బాక్సాఫీస్ వద్ద రికార్డు క్రియేట్ చేయడానికి పరుగులు పెట్టిందనే అభిప్రాయాన్ని కలిగించింది.

    మూడో రోజున అదే జోరు

    మూడో రోజున అదే జోరు

    జాతి రత్నాలు చిత్రంలో హ్యూమర్, ఫన్నీ సీన్లు, కామెడీ అంశాలు ప్రేక్షకులకు ఎక్కడంతో శనివారం కూడా భారీగా వసూళ్లను రాబట్టింది. గురు, శుక్రవారం కంటే అత్యధికంగా కలెక్షన్లను వసూలు చేసింది. మూడో రోజున 192,071 డాలర్లు వసూలు చేసింది. దాంతో అమెరికాలో 573,933 డాలర్లు నమోదు చేసింది.

    హాఫ్ మిలియన్‌ కబ్ల్‌లో

    హాఫ్ మిలియన్‌ కబ్ల్‌లో

    లాక్‌డౌన్ తర్వాత అమెరికాలో తెలుగు చిత్రం భారీగా వసూళ్లు రాబట్టిన దాఖలాలు లేవు. కానీ జాతి రత్నాలు చిత్రం మూడు రోజుల్లోనే హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. త్వరలోనే ఈ సినిమా ఒక మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరడం ఖాయమనే వాదన ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.

    యూఎస్ బాక్సాఫీస్‌ వద్ద 5వ స్థానంలో

    యూఎస్ బాక్సాఫీస్‌ వద్ద 5వ స్థానంలో

    జాతి రత్నాలు చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. రోజు రోజుకు అంతకుమించిన కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నది. అమెరికా బాక్సాఫీస్ వద్ద 5వ స్థానంలో కొనసాగుతున్నది. మూడు రోజుల్లోనే 500k వసూళ్లను రాబట్టింది. ఇది సింప్లి రిమార్కబుల్ అని ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

    English summary
    Jathi Ratnalu US Box office collections: Jathi Ratnalu film written and directed by Anudeep KV. The film starring Naveen Polishetty, Faria Abdullah, Priyadarshi, and Rahul Ramakrishna. Produced by Nag Ashwin under the banner Swapna Cinema. The film released on 11 March 2021.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X