Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Jathiratnalu 20 days collections: క్లైమాక్స్ కు చేరుకున్న కలెక్షన్స్.. ఇక సినిమా పనైపోయినట్లే
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది కొన్ని సినిమాలు సరికొత్త ట్రెండ్ సెట్ చేశాయి.. ముఖ్యంగా జాతిరత్నాలు పెట్టినపెట్టుబడికి భారీ స్థాయిలో లాభాలను అందించింది. నవీన్ పొలిశెట్టి హీరోగా స్వప్న సినిమాస్ లో నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాను అనుదీప్ తెరకెక్కించాడు. ఇక సినిమా 4 వారానికి కూడా చేరుకుంటోంది. ఈ క్రమంలో కలెక్షన్స్ కూడా తగ్గుతున్నాయి. అలాగే మరికొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కూడా రాబోతున్నాయి. ఇక 20వ రోజు సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి బాక్సాఫీస్ వద్ద క్లోజింగ్ కు చేరువలో ఉన్నట్లు అర్ధమవుతోంది.
జాతిరత్నాలు సినిమాకు 20వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన షేర్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాం 6లక్షలు, సీడెడ్ 2లక్షలు, ఉత్తరాంధ్ర 2లక్షలు, ఈస్ట్ 1లక్ష, వెస్ట్ 0.4లక్షలు, గుంటూరు 0.6లక్షలు, కృష్ణ 0.7లక్షలు, నెల్లూరు 0.2లక్షలు.. తెలుగు రాష్ట్రాల్లో 20 రోజుల్లో వచ్చిన మొత్తం షేర్ 0.13కోట్లు. గ్రాస్ 0.22కోట్లు
ఇక వరల్డ్ వైడ్ గా 20 రోజుల్లో జాతిరత్నాలు 37.92కోట్ల షేర్ ను వసులు చేసింది. గ్రాస్ కలెక్షన్స్ 62.86కోట్ల వరకు వెళ్లినట్లు సమాచారం. చూస్తుంటే ఈ ఇయర్ లో బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ అందుకున్న సినిమాల్లో జాతిరత్నాలు టాప్ లో ఉండేలా కనిపిస్తోంది. సినిమాను పది కోట్ల బడ్జెట్ లోపే తెరకెక్కించినట్లు సమాచారం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 11.5కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రంగంలోకి దిగింది. ఇక ఇప్పటివరకు అందుకున్న కలెక్షన్స్ తో సినిమా 26.42కోట్ల వరకు ప్రాఫిట్స్ లో ఉంది. ఇక 20వ రోజు వచ్చిన కలెక్షన్స్ తో సినిమా కలెక్షన్స్ పరంగా క్లోజింగ్ కు దగ్గరలో ఉన్నట్లు అర్ధమవుతోంది.