For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jathiratnalu, Vakeel Saab's collections.. అమెరికాలో జైత్రయాత్ర. మిగితా చిత్రాల కలెక్షన్లు ఎంతంటే..

    |

    గత ఐదు దశాబ్దాల కాలంలో ఎన్నడూలేని గడ్డు పరిస్థితిని తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్నది. కరోనావైరస్ కారణంగా ప్రేక్షకులు థియేటర్‌కు రాలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో సినిమా కలెక్షన్లు వెలవెల పోయాయి. అయితే కాస్తలో కొన్ని సినిమాలు మాత్రం ప్రతికూల పరిస్థితులను ఎదురించి బాక్సాఫీస్ వద్ద మోత మోగించాయి. 2021లో అమెరికాలో టాలీవుడ్ సినిమాలు సాధించిన వసూళ్లు ఇవే...

    వెండితెరపై లిప్‌లాక్స్.. శృంగార సన్నివేశాల్లో మునిగి తేలిన తారలు

    టాలీవుడ్ ఇండస్ట్రీ స్పూర్తిగా

    టాలీవుడ్ ఇండస్ట్రీ స్పూర్తిగా

    లాక్‌డౌన్ తర్వాత దేశంలో ఏ సినిమా పరిశ్రమకు కూడా దక్కని ఆదరణ టాలీవుడ్‌కు దక్కింది. దేశంలోని అన్ని సినిమా పరిశ్రమలు రిలీజ్‌లకు వెనుకాడుతుంటే టాలీవుడ్ చిత్రాలు దేశవ్యాప్తంగా సంచలన విజయాలు సాధించాయి. ఇతర సినిమా పరిశ్రమలకు స్పూర్తిగా నిలిచాయి.

    అమెరికాలో తెలుగు చిత్రాల హవా

    అమెరికాలో తెలుగు చిత్రాల హవా

    ముఖ్యంగా చిన్న చిత్రంగా రిలీజ్ అయిన జాతి రత్నాలు చిత్రం అమెరికా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను కుమ్మేసింది. రిలీజైన మొదటి ఆట నుంచే భారీగా వసూళ్లను సాధించింది. చివరకు జాతి రత్నాలు చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద 1.05 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.

    వకీల్ సాబ్ వసూళ్లు ఎంతంటే..

    వకీల్ సాబ్ వసూళ్లు ఎంతంటే..

    జాతి రత్నాలు సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ ఆ రేంజ్‌ వసూళ్లను సాధించింది. తొలుత వకీల్ సాబ్ కలెక్షన్లు రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ.. ఆ తర్వాత కరోనావైరస్ పరిస్థితులు విజృంభించడంతో అంతగా రాబట్టలేకపోయింది. ఇప్పటి వరకు వకీల్ సాబ్ చిత్రం 750k డాలర్లను వసూలు చేసింది.

    మాస్టర్, రంగ్ దే, ఉప్పెన కలెక్షన్లు

    మాస్టర్, రంగ్ దే, ఉప్పెన కలెక్షన్లు

    జాతి రత్నాలు, వకీల్ సాబ్ చిత్రాల తర్వాత పలు చిత్రాలు మంచి టాక్ సొంతం చేసుకొన్నప్పటికి భారీగా కలెక్షన్లను రాబట్టలేకపోయాయి. అందులో.. విజయ్ నటించిన మాస్టర్ చిత్రం 440k డాలర్లు, నితిన్ నటించిన రంగ్ దే చిత్రం 341k డాలర్లు, వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన చిత్రం 223k డాలర్లు, రవి తేజ నటించిన క్రాక్ మూవీ 131k డాలర్లు,ధనుష్ నటించిన కర్ణన్ చిత్రం 125k డాలర్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

    చెక్, వైల్డ్ డాగ్, నాంది, జాంబిరెడ్డి వసూళ్లు

    చెక్, వైల్డ్ డాగ్, నాంది, జాంబిరెడ్డి వసూళ్లు

    ఇక రిలీజ్‌కు ముందు మంచి క్రేజ్‌ను సంపాదించుకొన్న కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ సందడి చేయలేకపోయాయి. నితిన్ నటించిన చెక్ చిత్రం 80k డాలర్లు, వైల్డ్ డాగ్ 75k డాలర్లు, నాంది 70k డాలర్లు, జాంబిరెడ్డి 63k డాలర్లు, శ్రీకారం 50k డాలర్లు, రెడ్, సుల్తాన్ 48k డాలర్లు సంపాదించాయి. ఈ చిత్రాలు నష్టాలతోనే ముగియడం గమనార్హం.

    English summary
    Jathiratnalu, Vakeel Saab's registered good numbers at Us box office collections. Even pandeminc situtions, few movies performed well in box office. Master, Range De, Uppena are gets moderate collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X