Jawan 13th Day expected Collections బాలీవుడ్‌లో జవాన్ మరో అరుదైన రికార్డు.. 1000 కోట్లకు చేరువగా షారుక్!

పాన్ ఇండియా మూవీగా రిలీజైన బాలీవుడ్ చిత్రం జవాన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తూనే ఉంది. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 7వ తేదీన రిలీజైన ఈ చిత్రం రికార్డు వసూళ్లతో దూసుకెళ్తున్నది. షారుక్ ఖాన్, అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రంలో నయనతార, దీపిక పదుకోన్, విజయ్ సేతుపతి నటించడం తెలిసిందే. ఈ సినిమా 12 రోజుల్లో ఏ రేంజ్ కలెక్షన్లు వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..

జవాన్ చిత్రం తొలి వారాంతంలోనే రికార్డు వసూళ్లు రాబట్టింది. తొలి రోజు 75 కోట్ల రూాపయలు, రెండో రోజు 53 కోట్ల రూపాయలు, మూడో రోజు 78 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 80 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలివారాంతంలో 286 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలివారాంతంలో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రంగా తెరకెక్కింది.

Jawan 13th Day expected Collections Worldwide

జవాన్ చిత్రం తొలివారం ముగిసే సరికి భారీ వసూళ్లను నమోదు చేసింది. తొలివారం 390 కోట్ల రూపాయలు రాబట్టింది. హిందీ వెర్షన్ 348 కోట్లు, తమిళంలో 24 కోట్లు, తెలుగులో 18 కోట్ల రూపాయలు వసూలు చేసింది. షారుక్ ఖాన్ కెరీర్‌లోనే తొలివారం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది.

జవాన్ చిత్రం రెండో వారాంతంలో ఘనమైన వసూళ్లను సాధించింది. జవాన్ చిత్రం రెండోవారంలో ఇప్పటి వరకు అంటే.. నాలుగు రోజుల్లో 116 కోట్లు రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలిచింది. తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్ కొంత మెరుగ్గా వసూళ్లను రాబడుతున్నది. హిందీ వెర్షన్‌కు భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి.

Jawan 13th Day expected Collections Worldwide

ఇక జవాన్ చిత్రం ఓవర్సీస్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్నది. గత 12 రోజుల్లో ఈ చిత్రం 35 మిలియన్ల డాలర్లు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. ఉత్తర అమెరికా అంటే అమెరికా, కెనడాలో 12 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఈ చిత్రం సుమారుగా 300 కోట్ల రూపాయలు ఓవర్సీస్‌లో వసూలు చేసింది.

Shah Rukh Khan movie joined in 900 crores club

ప్రపంచవ్యాప్తంగా జవాన్ చిత్రం సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ చిత్రం 500 కోట్ల షేర్, సుమారు 600 కోట్ల రూపాయాలు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 12 రోజుల్లో సుమారుగా 900 కోట్ల రూపాయాలు రాబట్టింది. 13వ రోజు ఈ సినిమా మరో 30 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా 100 కోట్లకు చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X