Jawan Advance Booking రిలీజ్‌కు ముందే జవాన్ రికార్డు..3 లక్షల టిక్కెట్ల అమ్మకాలు.. పఠాన్, గదర్ 2 హాంఫట్!!
ఇండియన్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ అయ్యేందుకు సిద్దమైంది. నయనతార, విజయ్ సేతుపతి, యోగిబాబు తదితరులు నటించిన ఈ చిత్రంలో దీపిక పదుకోన్ కీలక పాత్రల్లో నటించారు. తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు పెంచింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..
ఇండియాలో జవాన్ మూవీ తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ రచ్చ రచ్చ చేస్తున్నాయి. పీవీఆర్, ఐనాక్స్, సినిపోలీస్‌లో భారీగా టికెట్ల అమ్మకాలు జరిగాయి. పీవీఆర్‌లో 90 వేల టికెట్స్, ఐనాక్స్ 60 వేల టికెట్స్, సిని పోలీస్‌లో 30 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. చైన్ మల్టీప్లెక్స్‌లో 1.75 లక్షల టికెట్లు, దేశవ్యాప్తంగా 3 లక్షలకుపైగా టికెట్స్ అమ్ముడుపోయాయి.

ఇండియాలో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ భారీగా కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు 3.10 లక్షల టికెట్లు అమ్ముడుపోగా.. వాటి ద్వారా 10.12 కోట్ల రూపాయల కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఇంకా నాలుగు రోజులు ఉన్నాయి కాబట్టి.. ఇంకా ఈ కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.
తమిళనాడులో జవాన్ సినిమాకు భారీగా ఆదరణ లభిస్తున్నది. చెన్నైలో ఈ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నది. చెన్నైలో 2300 టికెట్లు అమ్ముడు పోయాయి. దాదాపు తమిళనాడులో 30 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. వాటి అమ్మకాల ద్వారా తమిళనాడులో 60 లక్షల రూపాయలు, చెన్నైలో 50 లక్షల రూపాయలు వసూలు అయ్యాయి.
షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రానికి హైదరాబాద్‌లో అభిమానులు పొటెత్తుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్ బాక్సాఫీస్ వద్ద రాకింగ్‌గా ఉంది. తొలి రోజు హైదరాబాద్‌లో 300 షోలు ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేయగా.. ఇప్పటికే 55 శాతం అక్యుపెన్సీ నమోదైంది. ఇప్పటికే 1.5 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదు చేసింది.

జవాన్ చిత్రానికి యూకేలో భారీ రెస్పాన్స్ కనిపిస్తున్నది. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి స్పందన లభిస్తున్నది. యూకేలో మూడు చైన్ థియేటర్స్‌లో 204 లోకేషన్లలో 638 షోలకు 12000 టికెట్స్ బుక్ అయ్యాయి. హిందీలో 9500 టికెట్లు, తెలుగు 1300 టికెట్లు, తమిళం 500 టికెట్లు అమ్మడం జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

దక్షిణాదికి చెందిన సీనియర్ మేనేజర్ వెంకట్ ప్రసాద్ మాట్లాడుతూ '''జవాన్' సినిమాకు వస్తున్న స్పందన చాలా గొప్పగా ఉంది. 8 షోస్ కు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయితే కొన్ని గంటల్లోనే అన్ని టికెట్స్ అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకు మరే హిందీ సినిమాకు కానంత వేగంగా అడ్వాన్స్ బుకింగ్స్ అవుతుంది" అన్నారు. ఇండియా వైడ్ అడ్వాన్స్ బుకింగ్ పరిశీలిస్తే.. పఠాన్, గదర్ 2 సినిమాల అడ్వాన్స్ బుకింగ్ రికార్డులను జవాన్ తిరగరాస్తున్నది.


Click it and Unblock the Notifications











