Jawan Day 1 collections జవాన్ బాక్సాఫీస్ రికార్డుల సంచలనం.. షారుక్ మూవీకి కలెక్షన్ల కుంభవృష్టి ఎన్ని కోట్లంటే!
బాలీవుడ్ బాద్షా నటించిన జవాన్ చిత్రం అంచనాలు మించి బాక్సాఫీస్ జైత్రయాత్రను మొదలు పెట్టింది. ఫస్ట్ డే, ఫస్ట్ వీకెండ్ కోసం రికార్డు అడ్వాన్స్ బుకింగ్ కావడంతో రికార్డు కలెక్షన్లు నమోదు కావడానికి అవకాశం ఏర్పడింది. జవాన్ సినిమాకు అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రెస్సాన్స్ రావడంతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? స్క్రీన్ కౌంట్ ఎంత? అడ్వాన్స్ బుకింగ్, బాక్సాఫీస్ వివరాల్లోకి వెళితే..
జవాన్ బడ్జెట్ ఎంతంటే? :జవాన్ సినిమాను నయనతార, ప్రియమణి, విజయ్ సేతుపతి, సంజయ్ దత్, దీపిక పదుకోన్ లాంటి అగ్రతారలతో నిర్మించారు. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ భారీగా ఖర్చుతో తెరకెక్కించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లు అనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగిందని పేర్కొన్నారు.

దిల్ రాజుతోపాటు ఎవరెవరికీ అంటే? :జవాన్ హిందీ డిస్ట్రిబ్యూషన్‌ను పెన్ ఎంటర్‌టైన్‌మెంట్, తమిళంలో రెడ్ జెయింట్ మూవీస్ (సూర్య), తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు) కేరళలో శ్రీ గోకులమ్ మూవీస్, పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌వీఎస్, ఓవర్సీస్‌లో యష్ రాజ్ ఫిలింస్ రిలీజ్ చేసింది. ఈ సినిమాను కొన్ని చోట్ల అవుట్ రైట్‌గా హక్కులను తీసుకోగా, మరికొన్ని చోట్ల కమిషన్ బేస్ మీద సినిమాను రిలీజ్ చేశారు.
జవాన్ ప్రీ రిలీజ్ బిజినెస్, స్క్రీన్ కౌంట్ ఎంతంటే? :జవాన్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ఈ సినిమా హిందీ థియేట్రికల్ రైట్స్ 110 కోట్ల రూపాయలు, తెలుగు, తమిళ, ఓవర్సీస్ రైట్స్ మొత్తం కలిపి దాదాపు 190 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ 320 కోట్ల రూపాయలుగా నిర్ణయించారుు. ఇక ఈ సినిమాను ఇండియాలో 5000 స్క్రీన్లలో, ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మొత్తంగా 10 వేల స్క్రీన్లలో జవాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


ఓవర్సీస్‌లో జవాన్ కలెక్షన్లు:జవాన్ మూవీ ఓవర్సీస్‌లో భారీగా రేంజ్‌లో రిలీజ్ చేశారు. యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, దుబాయ్, యూరప్ తదితర దేశాల్లో పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగానే నమోదైంది. తొలి రోజు ఓవర్సీస్‌లో పఠాన్ మూవీ కంటే ఎక్కువగా వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా ఫస్ట్ డే ఓవర్సీస్‌లో 5 మిలియన్ డాలర్లు అంటే 40 కోట్ల రూపాయలకుపైగానే వసూలు చేసింది.

ఇండియాలో జవాన్ వసూళ్లు:జవాన్ ఇండియా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. హిందీ వెర్షన్‌కు దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. హిందీలో మొత్తంగా 74 కోట్ల రూపాయల షేర్, దాంతో ఈ సినిమా ఇండియాలో 88 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రిపోర్టు:జవాన్ తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు నమోదు చేసింది. ఈ సినిమా ఇండియాలో 85 కోట్లు, ఓవర్సీస్‌లో 38 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 129.6 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసింది. ఈ సినిమా థియేట్రికల్‌గా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 320 కోట్ల షేర్ సాధించాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications











