Jawan Day 2 Box office Report 200 కోట్లకు చేరువగా జవాన్.. షారుక్ ఖాన్ కలెక్షన్ల సునామీ!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తూ నటించిన చిత్రం జవాన్. తొలి రోజు ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ఈ సినిమా తొలి రోజు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రెండో రోజు కూడా కలెక్షన్లను భారీగా నమోదు చేయడానికి సిద్దమైంది. జవాన్ మూవీ రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
షారుక్ ఖాన్ నటించి మూవీ జవాన్ తొలి రోజు రికార్డులను వసూళ్లను నమోదు చేసింది. గతంలో ఇంతకు ముందు లేని విధంగా హిందీ వెర్షన్ ఇండియాలో 74 కోట్ల షేర్, 88 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. హిందీలో 65.5 కోట్లు, తమిళంలో 5.3 కోట్ల షేర్, తెలుగులో 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 74.5 కోట్లు షేర్ వసూళ్లను నమోదు చేసింది.

ఓవర్సీస్‌లో తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఆస్ట్రేలియాలో 2.1 కోట్లు, న్యూజిలాండ్ 40 లక్షలు, జర్మనీలో 1.30 కోట్లు, యూకేలో 2.16 కోట్లు వసూళ్లను రాబట్టింది. దాంతో ఓవర్సీస్‌లో 38 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. యూకే,యూఎస్ఏ, దుబాయ్ దేశాల్లో భారీ వసూళ్లను నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద తొలి రోజు 129.6 కోట్ల వసూళ్లను సాధించింది.
జవాన్ చిత్రం రెండో రోజు కూడా భారీ వసూళ్ల రాబట్టే దిశగా బాక్సాఫీస్ జర్నీని కొనసాగిస్తున్నది. ఈ చిత్రం రెండో రోజు కూడా ప్రతికూల పరిస్తితులను అధిగమించి భారీ ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అంటే తమిళం, తెలుగు, హిందీలో సుమారుగా 50 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

జవాన్ సినిమా రెండో రోజు కూడా భారీగా కలెక్షన్లను నమోదు చేసింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరగడంతోపాటు కరెంట్ బుకింగ్ కూడా ఊపందుకొన్నది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 50 నుంచి 55 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్ట వచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం 10 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
ఇక రెండో రోజు జవాన్ కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే.. ఇప్పటికే ఈ చిత్రం 129.6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు 50 నుంచి 60 కోట్ల మధ్య కలెక్షన్లు నమోదు చేసే ఛాన్స్ ఉంది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 190 కోట్ల రూపాయలకు అటు ఇటుగా కలెక్షన్లను నమోదుచేయవచ్చని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











