Jawan Day 4 collections జవాన్ ఆల్ టైమ్ రికార్డు.. సునామీని మించి కలెక్షన్లు.. 4 రోజుల్లో 500 కోట్లు!

బాలీవుడ్ బాద్షా, సూపర్ స్టార్ షారుక్ ఖాన్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తున్నది. తొలి రోజు రికార్డు కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం మూడో రోజు కూడా బాలీవుడ్‌లో ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. గత మూడు రోజుల్లో 350 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది. ఇలాంటి సునామీని క్రియేట్ చేస్తున్న జవాన్ చిత్రం 4వ రోజు సాధించిన కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

300 కోట్లు.. 10000 స్క్రీన్లు:జవాన్ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత గౌరీ ఖాన్ సుమారు 300 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ సినిమాను దాదాపు 10000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమా 300 కోట్ల రూపాయల షేర్ సాధిస్తే బ్రేక్ ఈవెన్ సాధించినట్టు అవుతున్నది.

Jawan Day 4 expected Collections worldwide: Shah Rukh Khans Movie joins 500 crores club

4వ రోజు మల్టీప్లెక్స్‌లో:జవాన్ చిత్రం 4వ రోజు నేషనల్ చైన్ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో భారీగా కలెక్షన్లను రాబట్టింది. గత మూడు రోజుల్లో నేషనల్ మల్టీ ప్లెక్స్ స్క్రీన్లలో 29.96, రెండో రోజు 22.75 కోట్లు, మూడో రోజు 32.67 కోట్లు వసూలు చేసింది. 4వ రోజు పీవీఆర్, ఐనాక్స్‌ మల్టిప్లెక్స్ చైన్ స్క్రీన్లలో ఆదివారం 24 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సినీ పోలీస్ స్క్రీన్లలో 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఓవర్సీస్, ఉత్తర అమెరికాలో :జవాన్ చిత్రం ఓవర్సీస్‌లో దుమ్మురేపే కలెక్షన్లు నమోదు చేస్తున్నది. 4వ రోజు ఈ చిత్రం ఉత్తర అమెరికాలోనే 6 మిలియన్ డాలర్లు రాబట్టింది. తొలి రోజు $1,371,345, రెండో రోజు, $1,765,564, మూడో రోజు $2,420,935 డాలర్లు వసూలు చేసింది. నాలుగో రోజు 605,208 డాలర్లకుపైగా వసూలు చేసింది. గత నాలుగు రోజుల్లో 20 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 170 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Jawan Day 4 expected Collections worldwide: Shah Rukh Khans Movie joins 500 crores club

ఇండియాలో జవాన్ కలెక్షన్లు:ఇండియాలో జవాన్ చిత్రం భారీగా వసూళ్లను సాధిస్తున్నది. హిందీ వెర్షన్ తోలి రోజు 70 కోట్ల రూపాయలు, రెండో రోజు ఈ చిత్రం 55 కోట్లు, మూడో రోజు 77 కోట్ల రూపాయలు, వసూలు చేసింది. తెలుగు, తమిళ భాషల్లో 26 కోట్ల రూపాయలు కలెక్షన్లను వసూలు చేసింది. మొత్తంగా ఈ చిత్రం మూడు భాషల్లో 206 కోట్ల రూపాయలు రాబట్టింది.

జవాన్ 3వ రోజు రికార్డు కలెక్షన్లు:ఇక జవాన్ నాలుగో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. గత మూడు రోజుల్లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలిపి 291 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో కలెక్షన్లు కలిపి ఈ సినిమా 350 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మూడో రోజు 144 కోట్ల రూపాయలు వసూలు చేయడం బాలీవుడ్ చరిత్రలో రికార్డుగా మారింది.

Jawan Day 4 expected Collections worldwide: Shah Rukh Khans Movie joins 500 crores club

జవాన్ 4వ రోజు కలెక్షన్లు:అలాగే జవాన్ చిత్రం మూడో రోజుల కంటే 4వ రోజు కలెక్షన్లు సాధించబోతున్నది. 4వ రోజు హిందీ వెర్షన్ 75 కోట్ల రూపాయలు, తెలుగు, తమిళంలో 10.5 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా మూడు భాషల్లో 85 కోట్ల రూపాయలు వసూలు చేయనున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 4వ రోజు ఈ సినిమా దాదాపు 150 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Jawan Day 4 expected Collections worldwide: Shah Rukh Khans Movie joins 500 crores club

500 కోట్ల క్లబ్‌లో జవాన్:జవాన్ చిత్రం కలెక్షన్ల ప్రవాహానికి ఇప్పట్లో అడ్డుకట్టపడే అవకాశం కల్పించడం లేదు. ఈ చిత్రం 5 రోజుల్లో 500 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. సోమవారం కూడా అదే జోష్‌ను కొనసాగించే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ సినిమాకు సోమవారం అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరగడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X