Jawan Day 5 Collections జవాన్‌ కలెక్షన్లపై మండే భారీ దెబ్బ.. అయినా మరో రికార్డుకు చేరువగా షారుక్!

జవాన్ మూవీ కలెక్షన్ల జైత్రయాత్ర బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్నది. షారుక్ ఖాన్, అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తున్నది. కేవలం నాలుగు రోజుల్లోనే బాలీవుడ్ అత్యధిక కలెక్షన్ల రికార్డులను అధిగమించి సునామీ వేగంతో దూసుకెళ్తున్నది. ఈ చిత్రం 4 రోజుల్లో 520 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే 5వ రోజు బాక్సాఫీస్ వద్ద జవాన్ పరిస్థితి ఏమిటంటే?

జవాన్ చిత్రం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ఇండియాలో 75 కోట్ల రూపాయలు, రెండో రోజు 53.23 కోట్ల రూపాయలు మూడో రోజు 77.83 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక నాలుగో రోజు తొలి మూడు రోజుల కంటే ఆదివారం రికార్డు వసూళ్లు సాధించింది. నాలుగో రోజు 80 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 290 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.

Jawan Day 5 expected Collections worldwide: shah Rukh Heading towards 600 crores

ఇక జవాన్ చిత్రం మూడు భాషల్లో సాధించిన వివరాల్లోకి వెళితే.. తోలి రోజు హిందీలో 65 కోట్లకుపైగా, తమిళంలో 5.5 కోట్లు, తెలుగులో 4 కోట్ల రూపాయలు రాబట్టింది. రెండో రోజు హిందీలో 46 కోట్లకుపైగా, తమిళంలో 3.87 కోట్లు, తెలుగులో 3.13 కోట్ల రూపాయలు రాబట్టింది. మూడో రోజు హిందీలో 69 కోట్లకుపైగా, తమిళంలో 5.3 కోట్లు, తెలుగులో 3.77 కోట్ల రూపాయలు రాబట్టింది. నాలుగు రోజు హిందీలో 71 కోట్లకుపైగా, తమిళంలో 5 కోట్లు, తెలుగులో 3.47 కోట్ల రూపాయలు రాబట్టింది.

Jawan Day 5 expected Collections worldwide: shah Rukh Heading towards 600 crores

జవాన్ సినిమా ఓవర్సీస్‌లో దుమ్ము రేపే కలెక్షన్లను రాబట్టింది. ఉత్తర అమెరికా అంటే.. అమెరికా, కెనడాలో, అలాగే యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తదితర దేశాల్లో భీభత్సమైన కలెక్షన్లను నమోదు చేసింది. ఈ సినిమా నాలుగు రోజుల్లో ఈ చిత్రం 117 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 343 కోట్ల గ్రాస్ సాధించింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా 520 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Jawan Day 5 expected Collections worldwide: shah Rukh Heading towards 600 crores

జవాన్ సినిమా సాగించిన నాలుగు రోజుల జైత్రయాత్రకు కొంత బ్రేక్ పడింది. అన్ని సినిమాలకు లిట్మస్ టెస్ట్‌గా మారే సోమవారం రోజు నాలుగు రోజుల ట్రెండ్‌ను బాక్సాఫీస్ వద్ద కొనసాగించలేకపోయింది. ఈ చిత్రం 30 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం 320 కోట్ల రూపాయలు వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 40 నుంచి 45 కోట్ల కలెక్షన్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Jawan Day 5 expected Collections worldwide: shah Rukh Heading towards 600 crores

ఐదో రోజు జవాన్ చిత్రం మొత్తంగా 560 నుంచి 575 కోట్ల మధ్య వసూళ్లను నమోదు చేయవచ్చు. దాంతో ఈ సినిమా అతి తక్కువ సమయంలో 600 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరిన సినిమాగా రికార్డు కెక్కనున్నది. ఈ చిత్రం త్వరలోనే 1000 కోట్లను దాటుతుందా? అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X