Jawan Overseas Collections:అమెరికాలో 100 కోట్లతో దంగల్ రికార్డు బ్రేక్. వరల్డ్‌వైడ్ జవాన్‌కు ఎన్ని కోట్లంటే?
ఇండియన్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం ఓవర్సీస్‌లో కలెక్షన్ల సునామీని కొనసాగిస్తున్నది. ఈ చిత్రం ఇప్పటికే రికార్డు వసూళ్లను సాధించింది. అయితే ఈ సినిమా ఓవర్సీస్‌లో అరుదైన చరిత్రను సృష్టించింది. ఈ చిత్రం దంగల్ వసూళ్లను అధిగమించింది. , పఠాన్ రికార్డును బ్రేక్ చేసేందుకు సిద్దంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ రికార్డుల వివరాల్లోకి వెళితే..
జవాన్ చిత్రం ఉత్తర అమెరికాలో అంటే యూఎస్, కెనడాలో బాక్సాఫీస్ ప్రభంజనం కొనసాగించింది. ఈ సినిమా గత 13 రోజుల్లో 12.6 మిలియన్ డాలర్ల వసూళ్లను అంటే ఉత్తర అమెరికాలోనే ఈ చిత్రం 105 కోట్లకుపైగా రూపాయలను రాబట్టింది. దాంతో ఈ సినిమా దంగల్ సాధించిన లైఫ్ టైమ్ కలెక్షన్లను 13 రోజుల్లోనే అధిగమించింది.

ఇక ఉత్తర అమెరికాలో అమీర్ ఖాన్ నటించిన దంగల్ రికార్డులను తిరగరాసింది. ఆ తర్వాత వచ్చిన షారుక్ ఖాన్ చిత్రం పఠాన్ ఆ సినిమా రికార్డులను అధిగమించింది. దంగల్ 12.3 మిలియన్ డాలర్లు వసూలు చేస్తే పఠాన్ చిత్రం అత్యధికంగా 17.4 మిలియన్లు రాబట్టింది. ప్రస్తుతం జవాన్ చిత్రం 13 రోజుల్లో 12.6 మిలియన్లు రాబట్టింది.

ఇక ఓవర్సీస్‌లో ఇతర దేశాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. యూఏఈలో ఈ చిత్రం 7 మిలియన్ డాలర్లు అంటే.. 58 కోట్లకుపైగా, మిగితా అరబ్ కంట్రీలో 5 మిలియన్లు అంటే 4 కోట్ల రూపాయలు, యూకే, ఐర్లాండ్ దేశాల్లో 2.3 మిలియన్ పౌండ్స్ అంటే 24 కోట్లకుపైగా రూపాయలు, మలేషియాలో 7.5 కోట్లు, సింగపూర్‌లో 6 కోట్లు, జర్మనీలో 5 కోట్ల రూపాయలు, న్యూజిలాండ్‌లో 4 కోట్ల రూపాయలు, మిగితా దేశాల్లో 31 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
జవాన్ చిత్రం ఓవర్సీస్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో సుమారుగా 310 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాదాపు 36 మిలియన్ల డాలర్లను బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. ఇంకా మరో రెండు వారాలు బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలిచే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక జవాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం 14 రోజు నాటికి ఈ సినిమా 913 కోట్ల రూపాయలను వసూలు చేసింది. మూడో వారాంతం ముగిసే నాటికి ఈ సినిమా 1000 క్లబ్‌లో చేరే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











