Jawan 11 Days Collections: షారూక్ శివ తాండవం.. అప్పుడే 800 కోట్లు పైనే.. సినీ చరిత్రలోనే తొలి సినిమా
బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్.. ఈ పేరు ఇండియన్ సినిమాలో పెద్ద సంచలనం. అంతలా ఈ స్టార్ హీరో దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. అయితే చాలా కాలం పాటు ఈ బడా హీరో విజయాలను మాత్రం సొంతం చేసుకోలేదు. ఈ పరిస్థితుల్లో 'పఠాన్' చిత్రంతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ ఉత్సాహంతోనే ఇటీవలే 'జవాన్' మూవీతో వచ్చాడు. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా రెండో ఆదివారం కుమ్మేసింది. మరి 'జవాన్' మూవీ 11 రోజుల బాక్సాఫీస్ రిపోర్టను మీరే చూడండి మరి!
'జవాన్'గా బాలీవుడ్ బాద్‌షా:బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన తాజా చిత్రమే 'జవాన్'. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీపిక పదుకొనే గెస్ట్ రోల్‌లో కనిపించింది. దీనికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని ఇచ్చాడు.

జవాన్ మూవీ బిజినెస్.. రిలీజ్:షారూఖ్ డుయల్ రోల్ చేసిన 'జవాన్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఫలితంగా ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే షారూక్ మూవీని ప్రపంచ వ్యాప్తంగా 10000లకు పైగా థియేటర్లలో తీసుకు వచ్చారు.
ఏ రోజు ఎంత వచ్చిందంటే?:షారూక్ ఖాన్ - అట్లీ కాంబోలో వచ్చిన 'జవాన్' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో ఆడియెన్స్ రెస్పాన్స్ కూడా దక్కుతోంది. ఫలితంగా ఈ సినిమాకు కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. ఇలా ఈ చిత్రం వారంలో రూ. 368.38 కోట్లు నెట్ రాబట్టింది. అయితే, 8వ రోజు రూ. 21.6 కోట్లు, 9వ రోజు రూ. 19.10 కోట్లు, 10వ రోజు రూ. 31.80 నెట్ వసూలు చేసుకుని సత్తా చాటుకుంది.

11వ రోజు ఎంత వచ్చిందంటే:షారూక్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు చేసిన 'జవాన్' మూవీకి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. మధ్యలో కాస్త స్లో అయినా రెండో ఆదివారం మాత్రం ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టి సత్తా చాటుకుంది. ఫలితంగా 11వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 'జవాన్' మూవీ రూ. 36.52 కోట్లు నెట్, రూ. 70 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు:బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే 'జవాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో అత్యధిక స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీ అక్కడ మిలియన్ల డాలర్లను వసూలు చేస్తోంది. ఇక, 11 రోజులకు కలిపితే ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 34 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 282.52 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది.

11 రోజులకూ కలిపి ఎంతంటే:సందేశాత్మక కథతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'జవాన్' మూవీకి ఓవరాల్‌గా మంచి రెస్పాన్సే వచ్చిందని చెప్పుకోవాలి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం 11 రోజులకూ కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 490.46 కోట్లు నెట్‌తో పాటు రూ. 870 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా వేగంగా రూ. 800 కోట్లు గ్రాస్ రాబట్టిన ఏకైక హిందీ చిత్రంగా రికార్డు నమోదైంది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:షారూక్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది 11 రోజుల్లోనే రూ. 490.46 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు ఈ సినిమాకు ఇప్పటి వరకూ రూ. 190.46 కోట్లు లాభాలను కూడా వచ్చాయి.


Click it and Unblock the Notifications











