Jawan 13 Days Collections: జవాన్ మరో సంచలనం.. అన్ని వందల కోట్లు.. ఏ సినిమా కొట్టని రికార్డు గురూ ఇది

ఇండియన్ సినిమాపై చాలా మంది హీరోలు ఓ రేంజ్‌లో ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ ఒకడు. ఎన్నో ఏళ్లుగా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్న ఆయన.. ఈ మధ్య కాలంలో మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. దీనికితోడు 'పఠాన్'తో సంచలనం సృష్టించాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'జవాన్' మూవీతో వచ్చాడు. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయి స్పందన లభిస్తోంది. వీక్ డేస్‌లో మాత్రం మళ్లీ స్లో అవుతోంది. మరి 'జవాన్' మూవీ 13 రోజుల బాక్సాఫీస్ రిపోర్టను మీరే చూడండి!

'జవాన్‌'గా ఎంటరైన బాద్‌షా:ఇండియన్ స్టార్ హీరో షారూక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీనే 'జవాన్'. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీపిక పదుకొనే గెస్ట్ రోల్‌ చేసింది. దీనికి అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్ ఇచ్చాడు.

Jawan Movie 13 Days Worldwide Box Office Collections.. Become Fastest 500 Crore Net Film

జవాన్ మూవీ బిజినెస్.. రిలీజ్:క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'జవాన్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఫలితంగా ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే షారూక్ మూవీని ప్రపంచ వ్యాప్తంగా 10000లకు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు.

Jawan Movie 13 Days Worldwide Box Office Collections.. Become Fastest 500 Crore Net Film

ఏ రోజు ఎంత వచ్చిందంటే?:షారూక్ ఖాన్ హీరోగా అట్లీ తీసిన 'జవాన్' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో ఆడియెన్స్ రెస్పాన్స్ కూడా దక్కుతోంది. ఇలా ఈ చిత్రం వారంలో రూ. 368.38 కోట్లు నెట్ రాబట్టింది. అయితే, 8వ రోజు రూ. 21.6 కోట్లు, 9వ రోజు రూ. 19.10 కోట్లు, 10వ రోజు రూ. 31.80, 10వ రోజు రూ. 31.80 కోట్లు, 11వ రోజు రూ. 36.85 కోట్లు, 12వ రోజు రూ. 16.25 కోట్లు నెట్ వసూలు చేసుకుంది.

Jawan Movie 13 Days Worldwide Box Office Collections.. Become Fastest 500 Crore Net Film

13వ రోజు ఎంత వచ్చిందంటే:షారూక్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతిలు నటించిన 'జవాన్' మూవీకి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. మధ్యలో కాస్త స్లో అయినా రెండో ఆదివారం మాత్రం ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. మళ్లీ వీక్‌ డేస్‌లో తేలిపోతోంది. ఫలితంగా 13వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 'జవాన్' మూవీ రూ. 14 కోట్లు నెట్, రూ. 25 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది.

Jawan Movie 13 Days Worldwide Box Office Collections.. Become Fastest 500 Crore Net Film

ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు:బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉండడంతో 'జవాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో అత్యధిక స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీ అక్కడ మిలియన్ల డాలర్లను వసూలు చేస్తోంది. ఇక, 13 రోజులకు కలిపితే ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 39 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 324.59 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది.

Jawan Movie 13 Days Worldwide Box Office Collections.. Become Fastest 500 Crore Net Film

13 రోజులకూ కలిపి ఎంతంటే:ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'జవాన్' మూవీకి ఓవరాల్‌గా మంచి రెస్పాన్సే వచ్చిందని చెప్పుకోవాలి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం 13 రోజులకూ కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 507.88 కోట్లు నెట్‌తో పాటు రూ. 900 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా వేగంగా రూ. 900 కోట్లు గ్రాస్, 500 కోట్లు నెట్ రాబట్టిన ఏకైక హిందీ చిత్రంగా నిలిచింది.

Jawan Movie 13 Days Worldwide Box Office Collections.. Become Fastest 500 Crore Net Film

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:షారూక్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది 13 రోజుల్లోనే రూ. 507.88 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు ఈ సినిమాకు ఇప్పటి వరకూ రూ. 207.88 కోట్లు లాభాలను కూడా వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X