Jawan 18 Days Collections: సినీ చరిత్రలో షారూక్ రికార్డు.. ఇటు 500, అటు 1000 కోట్లు.. రాజమౌళికే షాక్
పేరుకు బాలీవుడ్ హీరోనే అయినా ఇటు ఇండియా వ్యాప్తంగా.. అటు చాలా దేశాల్లో ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను విస్తృతపరుచుకున్న హీరో షారూక్ ఖాన్. సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో సందడి చేస్తోన్న అతడు.. 'పఠాన్'తో బౌన్స్‌బ్యాక్ అయ్యాడు. ఈ ఉత్సాహంతోనే ఇటీవలే షారూక్ 'జవాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ జోనర్‌లో వచ్చిన ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా భారీ రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తుతూ రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'జవాన్' మూవీ 18 రోజుల కలెక్షన్ల రిపోర్టును చూద్దాం పదండి!
'జవాన్'గా మారిన స్టార్ హీరో:బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన యాక్షన్ సినిమానే 'జవాన్'. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీనికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చాడు. దీపిక పదుకొనే కీలక పాత్ర చేసింది. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు.

జవాన్ మూవీ బిజినెస్.. రిలీజ్:పవర్‌ఫుల్ కాంబోలో తెరకెక్కిన 'జవాన్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఫలితంగా ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే షారూక్ మూవీని ప్రపంచ వ్యాప్తంగా 10000లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు.

ఏ రోజు ఎంత వచ్చిందంటే?:అట్లీ - షారూక్ కలిసి చేసిన 'జవాన్' మూవీకి ఆరంభం నుంచే రెస్పాన్స్ కూడా దక్కుతోంది. ఇలా ఈ చిత్రం ఫస్ట్ వీక్‌లో రూ. 389.88 కోట్లు, 2వ వారంలో రూ. 128 కోట్లు నెట్‌ను కలెక్ట్ చేసింది. ఇలా 2 వారాల్లోనే ఇది వరల్డ్ వైడ్‌గా రూ. 518.88 కోట్లు నెట్‌ను రాబట్టింది. 15వ రోజు రూ. 8.10 కోట్లు, 16వ రోజు రూ. 7.61 కోట్లు, 17వ రోజు రూ. 12.25 కోట్లు నెట్ వసూలు చేసింది.

18వ రోజు ఎంత వచ్చిందంటే:షారూక్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు చేసిన 'జవాన్' మూవీకి అన్ని ఏరియాల్లోనూ భారీ వసూళ్లు లభిస్తున్నాయి. మూడో వీకెండ్‌లో మాత్రం ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. ఫలితంగా మూడో ఆదివారం అడ్వాంటేజ్‌తో 18వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 'జవాన్' మూవీ రూ. 14.50 కోట్లు నెట్, రూ. 28 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు:షారూఖ్ ఖాన్ నటించిన 'జవాన్' చిత్రాన్ని విదేశాల్లో అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీ అక్కడ మిలియన్ల డాలర్లను వసూలు చేస్తోంది. ఇక, 18 రోజులకు కలిపి ఇది 40.5 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 336 కోట్లు రాబట్టింది. ఇక, నార్త్ అమెరికాలో ఇది 13 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టింది. దీంతో RRR పేరిట ఉన్న 14.3 రికార్డుకు చేరువైంది.

18 రోజులకూ కలిపి ఎంతంటే:'జవాన్' మూవీకి 18 రోజులకూ కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 561 కోట్లు నెట్‌తో పాటు రూ. 1005 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. దీంతో ఒకే ఏడాది రెండు 1000 కోట్లు గ్రాస్ మూవీలతో వచ్చిన ఏకైక ఇండియన్ హీరోగా షారూక్ చరిత్రను సృష్టించాడు. అలాగే, 'జవాన్' మూవీకి వేగంగా రూ. 1000 కోట్లు గ్రాస్ వచ్చింది. ముఖ్యంగా హిందీలో మరో 5 కోట్లు వస్తే బాహుబలి 2కు షాక్ ఇస్తుంది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:షారూక్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది 18 రోజుల్లోనే రూ. 561 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు ఈ సినిమాకు ఇప్పటి వరకూ రూ. 261 కోట్లు లాభాలను కూడా వచ్చాయి.


Click it and Unblock the Notifications











