Jawan 1st Week Collections: చరిత్ర సృష్టించిన జవాన్.. వారంలోనే 665 కోట్లా.. ఇండియాలో తొలి సినిమాగా!
ప్రత్యేకమైన శైలి నటనతో దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీ ప్రియులను, అభిమానులను అలరిస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్. అయితే, చాలా ఏళ్ల పాటు విజయాన్ని అందుకోలేకపోయిన అతడు.. 'పఠాన్'తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు 'జవాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీకి ఆరంభం నుంచే అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'జవాన్' మూవీ మొదటి వారంలో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!
జవాన్‌గా ఎంటరైన షారూక్ ఖాన్:బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన సినిమానే 'జవాన్'. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీపిక పదుకొనే స్పెషల్ రోల్‌లో కనిపించింది. ఈ సినిమాకు అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించాడు.

జవాన్ సినిమా బిజినెస్.. రిలీజ్:క్రేజీ కాంబోలో రూపొందిన వచ్చిన 'జవాన్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని వరల్డ్ వైడ్‌గా 10000లకు పైగా థియేటర్లలో రిలీజ్ చేసుకున్నారు.
ఏ రోజు ఎంత వసూలైందంటే:అట్లీ దర్శకత్వంలో షారూక్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి స్పందన వస్తూనే ఉంది. ఫలితంగా మొదటి రోజు ఈ సినిమా రూ. 75 కోట్లు నెట్ రాబట్టగా.. రెండో రోజు రూ. 53.23 కోట్లు, మూడో రోజు రూ. 77.83 కోట్లు, నాలుగో రోజు రూ. 80.10 కోట్లు, ఐదో రోజు రూ. 32.92 కోట్లు, ఆరో రోజు రూ. 26 కోట్లు వసూలు చేసి సత్తా చాటుకుంది.

ఏడో రోజూ ఎంత వచ్చింది?:షారూక్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రలు చేసిన 'జవాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇలా 7వ రోజు ఈ చిత్రానికి వసూళ్లు మరింతగా తగ్గిపోయాయి. ఫలితంగా ఏడో రోజు ప్రపంచ వ్యాప్తంగా 'జవాన్' మూవీ రూ. 23.30 కోట్లు నెట్, రూ. 44 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు:బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్‌ను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే 'జవాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ అక్కడ మిలియన్ల డాలర్లను వసూలు చేస్తోంది. ఇక, 6 రోజులకు కలిపితే వరల్డ్ వైడ్‌గా 25.8 మిలియన్ డాలర్లు అంటే రూ. 208 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది.

ఏడు రోజులకూ కలిపి ఇలా:'జవాన్' మూవీకి ఓవరాల్‌గా మంచి రెస్పాన్సే లభిస్తోందనే చెప్పాలి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం వారం రోజులకూ కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 368.38 కోట్లు నెట్‌తో పాటు రూ. 665 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా వారంలోనే రూ. 650 కోట్లు మార్క్ దాటిన మొదటి హిందీ చిత్రంగా ఇది రికార్డు సాధించింది. పఠాన్ రూ. 630 కోట్లు వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జవాన్' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వారం రోజుల్లో రూ. 368.38 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే ఈ సినిమా రూ. 68.38 కోట్లు లాభాలను సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











