Jawan 23 Days Collections: ఇండియాలో టాప్ మూవీగా జవాన్.. బాహుబలి 2తో పాటు ఆ రికార్డులన్నీ బ్రేక్
హిందీ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను ఏర్పరచుకున్న హీరోల్లో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ ఒకడు. ఒకప్పుడు ఎన్నో హిట్ చిత్రాలతో రికార్డులు బ్రేక్ చేసిన అతడు.. ఈ మధ్యన ఎన్నో ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు. ఈ పరిస్థితుల్లోనే 'పఠాన్'తో అదిరిపోయే కమ్‌బ్యాక్ అయి.. ఇటీవలే 'జవాన్' మూవీతో వచ్చాడు.
దీనికి కూడా భారీ రెస్పాన్స్ వస్తుండడంతో కలెక్షన్లు పోటెత్తాయి. ఇప్పుడు డౌన్ అయినా ఎన్నో రికార్డులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'జవాన్' మూవీ 23 రోజుల కలెక్షన్ల రిపోర్టును చూద్దామా!

'జవాన్'గా షారూక్ ఊచకోత: బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ నటించిన తాజా చిత్రమే 'జవాన్'. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీనికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు. దీపిక పదుకొనే కీలక పాత్ర చేసింది. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు.

జవాన్ మూవీ బిజినెస్.. రిలీజ్: హై రేంజ్ కాంబోలో వచ్చిన 'జవాన్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఫలితంగా ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే షారూక్ మూవీని ప్రపంచ వ్యాప్తంగా 10000లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు.

ఏ రోజు ఎంత వచ్చిందంటే?: అట్లీ - షారూక్ కలిసి చేసిన 'జవాన్' మూవీకి రెస్పాన్స్ భారీగా దక్కుతోంది. ఇలా ఈ చిత్రం ఫస్ట్ వీక్‌లో రూ. 389.88 కోట్లు, 2వ వారంలో రూ. 128 కోట్లు నెట్‌ను కలెక్ట్ చేసింది. అలాగే, మూడో వారంలో రూ. 55.92 కోట్లు రాబట్టింది. ఇలా మూడు వారాల్లో రూ. 573.80 కోట్లు నెట్‌ను కలెక్ట్ చేసింది. ఇక, 22వ రోజు షారూక్ ఖాన్ సినిమా రూ. 5.97 కోట్లు నెట్‌ను వసూలు చేసింది.

23వ రోజు ఎంత వచ్చిందంటే: షారూక్, నయనతార, విజయ్ సేతుపతి కలిసి నటించిన 'జవాన్' మూవీకి అన్ని ఏరియాల్లోనూ భారీ వసూళ్లు లభిస్తున్నాయి. మూడో వీకెండ్‌లో మాత్రం ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. కానీ, వీక్ డేస్‌లో మళ్లీ డౌన్ అవుతూనే వచ్చింది. ఇలా 23వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 'జవాన్' మూవీ రూ. 5.25 కోట్లు నెట్, రూ. 10 వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది.
ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు: షారూఖ్ ఖాన్ నటించిన 'జవాన్' చిత్రాన్ని విదేశాల్లో అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీ అక్కడ మిలియన్ల డాలర్లను వసూలు చేస్తోంది. ఇక, 23 రోజులకు కలిపి ఇది 41.4 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 345 కోట్లు రాబట్టింది. ఇక, నార్త్ అమెరికాలో ఇది 13.3 మిలియన్ డాలర్లు రాబట్టింది. దీంతో RRR పేరిట ఉన్న 14.3 రికార్డుకు చేరువైంది.

23 రోజులకూ కలిపి ఎంతంటే: 'జవాన్' మూవీకి 23 రోజులకూ కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 587 కోట్లు నెట్‌తో పాటు రూ. 1053 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ముఖ్యంగా హిందీలో ఈ చిత్రం రూ. 530 కోట్లు వరకూ నెట్ వసూళ్లు రాబట్టింది. దీంతో ఇండియాలోనే ఎక్కువ నెట్ సాధించిన హిందీ ఫిల్మ్‌గా రికార్డు సాధించింది. తద్వారా 'పఠాన్', 'గదర్ 2', 'బాహుబలి 2' రికార్డులను బ్రేక్ చేసేసింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?: షారూక్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది 23 రోజుల్లోనే రూ. 587 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు ఈ సినిమాకు ఇప్పటి వరకూ రూ. 287 కోట్లు లాభాలను కూడా వచ్చాయి.


Click it and Unblock the Notifications











