Jawan 24 Days Collections: RRR రికార్డు బ్రేక్ చేసిన జవాన్.. అన్ని కోట్లతో సంచలనం.. లాభాలు చూశారంటే!

ఇప్పుడంటే ఇండియా వ్యాప్తంగా చాలా ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్లు ఉన్నారు. కానీ, చాలా కాలం క్రితమే ఈ రేంజ్‌లో ప్రభావాన్ని చూపించిన వాళ్లు కొందరు ఉన్నారు. అందులో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ ఒకడు. అలాంటిది దాదాపు ఐదేళ్ల పాటు ఈ సీనియర్ హీరో ఒక్క హిట్‌ను కూడా అందుకోలేదు.

ఈ పరిస్థితుల్లో 'పఠాన్'తో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కి.. ఇప్పుడు 'జవాన్' అనే మూవీతో వచ్చాడు. దీనికి నాలుగో వారంలోనూ కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. దీంతో రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'జవాన్' మూవీ 24 రోజుల రిపోర్టును మీరే చూడండి!

Jawan Movie 24 Days Worldwide Box Office Collections.. Crosses RRR Record at North America

'జవాన్‌'గా షారూక్ వచ్చాడు: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన తాజా చిత్రమే 'జవాన్'. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీనికి అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్ ఇచ్చాడు. దీపిక పదుకొనే కీలక పాత్ర చేసింది. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ ప్రొడ్యూస్ చేసింది.

Jawan Movie 24 Days Worldwide Box Office Collections.. Crosses RRR Record at North America

జవాన్ మూవీ బిజినెస్.. రిలీజ్: హై ఓల్టేజ్ యాక్షన్‌తో వచ్చిన 'జవాన్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఫలితంగా ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే షారూక్ మూవీని ప్రపంచ వ్యాప్తంగా 10000లకు పైగా థియేటర్లలో తీసుకొచ్చారు.

Jawan Movie 24 Days Worldwide Box Office Collections.. Crosses RRR Record at North America

ఏ రోజు ఎంత వచ్చిందంటే?: అట్లీ దర్శకత్వంలో షారూక్ నటించిన 'జవాన్' మూవీకి రెస్పాన్స్ భారీగా దక్కుతోంది. ఇలా ఈ చిత్రం ఫస్ట్ వీక్‌లో రూ. 389.88 కోట్లు, 2వ వారంలో రూ. 128 కోట్లు నెట్‌ను కలెక్ట్ చేసింది. 3వ వారంలో రూ. 55.92 కోట్లు రాబట్టింది. ఇలా 3 వారాల్లో రూ. 573.80 కోట్లు నెట్‌ను కలెక్ట్ చేసింది. ఇక, 22వ రోజు రూ. 5.97 కోట్లు, 23వ రోజు రూ. 5.05 కోట్లు నెట్‌ను వసూలు చేసింది.

Jawan Movie 24 Days Worldwide Box Office Collections.. Crosses RRR Record at North America

24వ రోజు ఎంత వచ్చిందంటే: షారూక్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు చేసిన 'జవాన్' మూవీకి అన్ని ఏరియాల్లోనూ భారీ వసూళ్లు లభిస్తున్నాయి. మూడో వీకెండ్‌లో మాత్రం ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. కానీ, వీక్‌ డేస్‌లో మళ్లీ డౌన్ అవుతూనే వచ్చింది. ఇలా 24వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 'జవాన్' మూవీ రూ. 9.25 కోట్లు నెట్, రూ. 17 వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు: షారూఖ్ ఖాన్ నటించిన 'జవాన్' చిత్రాన్ని విదేశాల్లోనూ అత్యధిక స్క్రీన్లలో విడుదల చేశారు. దీంతో ఈ మూవీ అక్కడ మిలియన్ల డాలర్లను వసూలు చేస్తోంది. ఇక, 24 రోజులకు కలిపి ఇది 42.2 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 350 కోట్లు రాబట్టింది. ఇక, నార్త్ అమెరికాలో ఇది 14.35 మిలియన్ డాలర్లు రాబట్టింది. దీంతో RRR పేరిట ఉన్న 14.30 రికార్డుకు బ్రేక్ చేసింది.

Jawan Movie 24 Days Worldwide Box Office Collections.. Crosses RRR Record at North America

24 రోజులకూ కలిపి ఎంతంటే: 'జవాన్' మూవీకి 24 రోజులకూ కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 596.20 కోట్లు నెట్‌తో పాటు రూ. 1067 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా 'పఠాన్' కలెక్ట్ చేసిన రూ. 1054 కోట్లు గ్రాస్‌ను దాటేసి షారూక్ కెరీర్‌లో టాప్ మూవీగా నిలిచింది. ముఖ్యంగా హిందీలో ఈ చిత్రం రూ. 539 కోట్లు వరకూ నెట్ వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ రికార్డును మరింతగా మెరుగుపరుచుకుంది.

Jawan Movie 24 Days Worldwide Box Office Collections.. Crosses RRR Record at North America

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?: షారూక్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది 24 రోజుల్లోనే రూ. 596 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు ఈ సినిమాకు ఇప్పటి వరకూ రూ. 296 కోట్లు లాభాలను కూడా వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X